‘ఓజీ’ కి తెలంగాణ సర్కార్‌ గుడ్ న్యూస్..!

Telangana OG Benefit Show: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ఓజీ’ (OG) సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతే కాకుండా, ప్రీమియర్ షోలకు కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ ప్రీమియర్ షోలు ఆమోదం పొందడం సినిమా వర్గాల్లో, ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. ఈ సినిమా పై అభిమానులే కాకుండా, ట్రేడ్ సర్కిల్స్ లోనూ భారీ హైప్ ఉంది. ఈ క్రేజ్ ను బట్టి నిర్మాతలు టికెట్ రేట్లు పెంచడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించారు.అల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్లు మరియు ప్రత్యేక షోలపై అనుమతి ఇచ్చింది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దారిలో ముందుకెళ్లి, ప్రీమియర్ షోలతో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ముఖ్యంగా పుష్ప 2 సమయంలో జరిగిన అనర్థం తర్వాత తెలంగాణలో ప్రీమియర్స్‌కి పర్మిషన్ లభించకపోయినా, ఈసారి OG సినిమాకి మాత్రం మినహాయింపు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో ప్రకారం, OG ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 24న రాత్రి 9:00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా మేకర్స్‌కు అవకాశం ఇచ్చారు. Telangana OG Benefit Show.

సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.100 (జీఎస్టీతో కలిపి) అదనంగా తీసుకోవచ్చు.

మల్టీప్లెక్స్ లలో అయితే రూ.150 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చు.

ఇది సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు అంటే 10 రోజుల పాటు అమల్లో ఉంటుంది.

ఈ నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొనగా.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద OG సినిమాకు మరింతగా జోష్ పెరిగింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనుండగా, సిరి లేళ్ల (నారా రోహిత్ కాబోయే భార్య), అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.