
‘Kantara Chapter 1’ Trailer: కన్నడ సినిమా ఇండస్ట్రీలో ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా వినిపించిన పేరు ‘కాంతార. 2022లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకుంది. ఇప్పుడు దీనికి ప్రీక్వెల్‌ని ‘కాంతార ఛాప్టర్ 1’ పేరుతో తీశారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘కాంతార’… పేరుకు కన్నడ సినిమానే అయినా.. ఇతర భాషల సినీ ప్రేమికులు వాళ్ల సినిమాగా నెత్తిన పెట్టుకున్నారు. రిలీజైన ప్రతీ భాషలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి తన అద్భుతమైన దర్శకత్వం, నటనతో ఆ సినిమాను ఒక కళాఖండంగా మలిచారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ వచ్చేస్తుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. ట్రైలర్‌లో ఒక్కో షాట్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ ట్రైలర్ దెబ్బతో సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు డబుల్ అయిపోయాయి. ‘Kantara Chapter 1’ Trailer.
ట్రైలర్ చూస్తుంటే ఈసారి భారీతనం కనిపిస్తోంది. రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునేలా కనిపించాడు. ‘కాంతార’ తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా అనే డ్రామాని సింపుల్‌గా చూపించారు. ఈసారి మాత్రం రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమలో పడటం ఇలా అన్ని కూడా భారీగానే సెటప్ చేశారు. మరి ‘కాంతార’ ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.