
What is Antifa: చార్లీ కిర్క్ హత్య తర్వాత వామపక్ష అతివాద భావజాలాన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, యాంటిఫా అనే గ్రూపును ‘దేశీయ ఉగ్రవాద సంస్థ’గా ప్రకటిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఫార్ రైట్ భావజాలాన్ని, జాత్యహంకారాన్ని, ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ, నాయకత్వం అంటూ లేని ఒక లెఫ్టిస్ట్ గ్రూపునే ‘యాంటిఫా’ అని అంటుంటారు. యాంటిఫా గ్రూపును ట్రంప్ ‘ఉగ్రవాద సంస్థ’గా ఎందుకు ప్రకటించారు, అసలు ఇది ఏం చేస్తుంది?
ట్రంప్ దీనిపై కొన్నాళ్లుగా విమర్శలు చేస్తున్నారు.దేశంలో రాజకీయ హింసను ప్రేరేపించడానికి ఈ సంస్థ అమెరికన్లను రిక్రూట్ చేసుకోవడం, ట్రైనింగ్ ఇవ్వడంలాంటివి చేస్తూ ప్రజలను రాడికల్‌గా మార్చే ప్రయత్నం చేస్తోందంటూ ట్రంప్ ఈ గ్రూప్ మీద ఆరోపణలు చేశారు.అయితే, ఒక నాయకుడు, సభ్యత్వంలాంటివేమీ లేని ఈ గ్రూపును అధ్యక్షుడు టార్గెట్ చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
2020లో, అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే కాంగ్రెస్‌లో ప్రసంగిస్తూ, యాంటీఫాను ఒక సంస్థగా కాకుండా ఒక భావజాలంగా చెప్పుకోవడం మంచిదని అన్నారు. దేశాన్ని, దేశంలో వాక్ స్వాతంత్ర్యాన్ని, తుపాకీ హక్కుల్ని అణగదొక్కాలని భావిస్తున్న వామపక్ష నెట్‌వర్క్‌లో యాంటిఫా అనేది కీలకమైన భాగమని కొంతమంది రైట్ వింగ్ కార్యకర్తలు, రాజకీయ నాయకులు వాదిస్తున్నారు.
యాంటీ ఫాసిస్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం యాంటిఫా. ఇది ఒక నాయకత్వం లేని వామపక్ష కార్యకర్తల సమూహం.”యాంటీఫాసిస్టిష్” అనే జర్మన్ పదం నుంచి ఇది పుట్టింది. 1930ల్లో జర్మనీలో ఫాసిస్ట్ వ్యతిరేక గ్రూపులను ఇలా పిలిచేవారు. అమెరికాలో యాంటిఫా చాలాకాలం నుంచి ఉంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం, 2017లో చార్లోట్స్ విల్లేలో జరిగిన ఫార్ రైట్ వింగ్స్ ప్రదర్శన తర్వాత వివిధ యాంటీ ఫాసిస్ట్ గ్రూపులన్నీ ఏకం కావడంతో దీనికి ప్రాముఖ్యం పెరగడం మొదలైంది.
అప్పటి నుంచి, యాంటిఫా కార్యకర్తలుగా గుర్తింపు పొందిన వాళ్లంతా తరచుగా ఆన్‌లైన్‌లోనూ, ప్రత్యక్షంగానూ రైట్ వింగ్ గ్రూపులతో వాడివేడి చర్చలు జరపడంతో పాటు గొడవలు పడుతున్నారు. ఇది అమెరికా అంతటా జరుగుతోంది.ప్రత్యేకంగా కేంద్రీకృత సంస్థ అంటూ ఏదీ లేకపోవడంతో యాంటిఫా కార్యకర్తలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కనిపిస్తుంటారు.దీని కార్యకర్తల్లో ప్రభుత్వ, పెట్టుబడి వ్యతిరేకులు, క్వీర్ కమ్యూనిటీకి, వలస వాదులకు అనుకూలంగా వాదించే అరాచకవాదులు, కమ్యూనిస్టులు, అతివాద సోషలిస్టులు ఉన్నారు. అయితే సంప్రదాయ రాజకీయ నాయకులు, టీవీ వ్యాఖ్యాతలు కొన్ని సందర్బాల్లో తమ రాజకీయ వ్యతిరేకులు, ఉదారవాద, వామపక్ష సమూహాలను యాంటిఫా భావజాలంతో ముడిపెట్టడం తరచూ కనిపిస్తుంది.
ఆత్మరక్షణ కోసం అని చెబుతున్నప్పటికీ, యాంటిఫాలోని కొంతమంది కార్యకర్తలు తమ లక్ష్య సాధన కోసం హింసకు దిగడంతో వారిని వామపక్షగ్రూపులకు భిన్నమైన వారిగా అభివర్ణిస్తున్నారు విమర్శకులు.
యాంటిఫా కార్యకర్తలు తరచుగా నలుపు రంగు దుస్తులు ధరించడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో తమ మొహాలను కవర్ చేసుకుంటున్నారు. కొన్ని ఆన్‌లైన్ వీడియోల్లో అబ్జర్ చేస్తే వాళ్లు బ్యాట్లు, కవచాలు, కర్రలు, పెప్పర్ స్ప్రే బాటిళ్లు పట్టుకుని కనిపించారు. 2017లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని బర్కిలీలో మాస్కులు వేసుకుని యాంటిఫా గుర్తులున్న జెండాలు పట్టుకున్న 100 మంది కార్యకర్తలు రైట్ వింగ్ ఆందోళనకారులపై దాడి చేశారు. ఈ సంఘటనలో అనేక మందిని అరెస్ట్ చేశారు.
ఇక 2020 కి వస్తే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మరణం తర్వాత అమెరికాలో అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడు తనను యాంటిఫా కార్యకర్తగా ప్రకటించుకున్న 48 ఏళ్ల మైఖేల్ రీనోయెల్, పోర్ట్‌లాండ్ ప్రాంతానికి చెందిన రైట్‌వింగ్ కార్యకర్తను కాల్చి చంపారు. ఆ తర్వాత రీనోయెల్‌ను పోలీసులు కాల్చి చంపారు. ఈ ఫాసిస్ట్ వ్యతిరేక కార్యకర్తలు, తాము ఫార్‌రైట్ గ్రూపు కార్యకర్తలుగా భావించిన వారి వివరాలను, గుర్తింపును బయట పెడుతుంటారు. సాంకేతికంగా దీన్ని ‘డాక్సింగ్’ అని అంటారు. వీరిని ఉద్యోగాల్లోంచి తీసేయించడం, లేదంటే సామాజిక బహిష్కరణకు గురయ్యేలా చేయడం దీనివెనకున్న ఉద్దేశం.
యాంటిఫా కార్యకర్తలమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు చార్లీ కిర్క్ హత్య తర్వాత ఈ హత్యను సమర్థిస్తూ, రెడిట్, ఎక్స్‌లో పెట్టిన పోస్టులను వెరిఫై గుర్తించింది.
యాంటిఫాను టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించడం చట్టపరంగా నిలుస్తుందా? అనే ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అమెరికన్ ప్రభుత్వం ఒక గ్రూప్‌ను విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించవచ్చు. ఇందుకు చట్టబద్దమైన ప్రక్రియ ఏంటంటే ఆ గ్రూప్ కచ్చితంగా విదేశీ సంస్థ అయి ఉండాలి. విదేశీ టెర్రర్ ఆర్గనైజేషన్ అనే ముద్ర పడితే ఆ సంస్థ సభ్యులపై అమెరికాలో నిషేధం ఉంటుంది. అలాగే వారిని దేశం నుంచి పంపించి వేయవచ్చు. ఇక సంస్థకు చెందిన నిధుల్ని జప్తు చేయడంతో పాటు సంస్థకు విరాళాలు ఇచ్చే వారిని టార్గెట్ చేయవచ్చు. లాటిన్ అమెరికాకు చెందిన డ్రగ్ కార్టెల్స్, ఐసిస్ శాఖలు ప్రస్తుతం స్టేట్ డిపార్ట్‌మెంట్ ఎఫ్‌టీఓ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ అధికారాలను యాంటిఫాకు ఎలా విస్తరిస్తారనే దానిపై క్లారిటీ లేదు.
తనకు తెలిసినంతవరకు ఏదైనా అమెరికన్ గ్రూపును దేశీయ టెర్రర్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించేందుకు అవసరమైన చట్టపరమైన విధానం ఏదీ లేదు” అని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో రీసర్చ్ ల్యూక్ బామ్‌గార్ట్‌నర్ చెప్పారు. అయితే, ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో, అన్ని కార్యనిర్వాహక శాఖలు, ఏజెన్సీలు…యాంటిఫా లేదా దాని మద్దతుదారులు నిర్వహించే చట్టవిరుద్ధమైన అన్ని కార్యకలాపాలపై దర్యాప్తు చేయడానికి, వాటికి అంతరాయం కలిగించడానికి, వాటిని నాశనం చేయడానికి అధికారాలిస్తుంది. ఆచరణలో దీనిని ఎలా అర్థం చేసుకోవాలని వైట్‌హౌస్‌ను ప్రశ్నించింది. బామ్‌గార్ట్‌నర్ తనకు తెలిసి ఏదైనా గ్రూపును దేశీయ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించే చట్టపరమైన అవకాశం లేదన్నారు. What is Antifa.
అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ ప్రకారం స్వేచ్ఛా వాక్ స్వాతంత్ర్యపు హక్కుల కింద ట్రంప్ ప్రయత్నాలను కోర్టులో సవాలు చేయవచ్చని మాట్లాడిన కొందరు న్యాయ నిపుణులు చెప్పారు.
రాజ్యాంగంలో మొదటి సవరణ వ్యక్తులకు గ్రూపుల్ని ఏర్పాటు చేసుకునే హక్కులు కల్పిస్తుంది. ఈ సవరణ ప్రభుత్వం ఆయా గ్రూపుల కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా వాటి హక్కుల్ని రక్షిస్తుంది. అయితే ఆ గ్రూపుల చట్టాన్ని ఉల్లంఘించకూడదు” అని డ్యూక్ యూనివర్సిటీలోని ట్రయాంగిల్ సెంటర్ ఆన్ టెర్రరిజం అండ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డేవిడ్ స్కాంజర్ చెప్పారు.