టాప్ 10 కంట్రీస్.!!

Top 10 Sandalwood Countries: మంచి సువాసన అందించే గంధపు చెక్కకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దీన్ని మతపరమైన ఆచారాలు, ఆయిల్‌, పర్ఫ్మూమ్‌లు , కాస్మొటిక్స్ , మెడిసిన్స్‌లో కూడా వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం దీనికి డిమాండ్ పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు గంధపు చెట్లను ముఖ్యమైన వనరుగా భావిస్తాయి. వాటిని పెంచి, రక్షిస్తాయి. అయితే ప్రపంచంలో గంధపు చెక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

గంధపుచెక్క అనగా ఒక సువాసనల చెక్క, దీని నుండి నూనెను తయారు చేస్తారు. దీనిని పరిమళాలకు, ఔషధాల కోసం ఉపయోగిస్తారు. ఇవి భారతదేశం, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పసిఫిక్ ద్వీపాలలో కనిపిస్తాయి. దీని ప్రజాతి శాంటాలం. ఇండోనేషియా, మలేషియాలలో దీని స్థానిక పేరు చందన. ఈ చెక్కలు బలంగా, పసుపురంగులో, అత్యుత్తమంగా ఉంటాయి. ఇవి అనేక ఇతర సుగంధ చెక్కలలా కాకుండా దశాబ్దాలపాటు సువాసనను కలిగి ఉంటాయి. థాయిలాండ్ మతపరమైన, సాంస్కృతిక అవసరాలకు ముఖ్యంగా బౌద్ధ ఆచారాల కోసం గంధపు చెక్కను పండిస్తుంది. ఆసియా అంతటా పరిమళ ద్రవ్యాలు, అగరబత్తీలు కోసం గంధపు చెక్కను సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది. తోటలను అభివృద్ధి చేస్తోంది. టాప్‌ టెన్‌ లిస్టులో పదో స్థానంలో ఉంది.

పపువా న్యూ గినియా ఈ లిస్టులో 9వ ర్యాంకులో ఉంది. ఈ దేశం తోటలు, సహజ అడవుల నుంచి పసిఫిక్ గంధపు చెక్కను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాంతం నుంచి గంధపు నూనె ఆసియా మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. దీన్ని పర్ఫ్యూమ్‌లు, అరోమాథెరపీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎనిమిదో ర్యాంకులో ఉన్న ఫిజి.. పసిఫిక్ గంధపు చెక్క (శాంటలమ్ యాసి)ను ఉత్పత్తి చేస్తుంది. ఇది దీవులలో సహజంగా పెరుగుతుంది. ఇది ప్రధానంగా ఆయిల్‌, అగరబత్తీలు తయారీకి ఎగుమతి అవుతుంది. ఇది ఫిజి అత్యంత విలువైన అటవీ వనరులలో ఒకటిగా నిలిచింది.

పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి చైనా దక్షిణ ప్రావిన్సులలో గంధపు తోటలను పెంచుతోంది. ఈ దేశం లిస్టులో 7వ ర్యాంకులో ఉంది. అయితే చైనా ఇప్పటికీ పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుటోంది. అయినా అగరబత్తీలు, మెడిసిన్‌, కాస్మొటిక్స్‌ తయారీకి గ్లోబల్‌ సప్లైకి కాంట్రిబ్యూట్‌ చేస్తోంది. ఈ లిస్టులో 6వ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్.. అటవీ, కొండ ప్రాంతాలలో గంధపు చెక్కను పండిస్తుంది. భారతదేశం లేదా ఆస్ట్రేలియాతో పోలిస్తే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. లోకల్‌గా పర్ఫ్యూమ్స్‌, అగరబత్తీలు, కాస్మొటిక్స్‌ తయారు చేసే ఇండస్ట్రీలకు సపోర్ట్‌ చేస్తుంది. ప్రభుత్వం కూడా లాభదాయకమైన పంటగా గంధపు చెక్క వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది.

నేపాల్‌ 5వ ర్యాంకులో ఉంది. ఈ దేశంలో గంధపు చెక్క ప్రధానంగా దక్షిణ తెరాయ్ ప్రాంతాలలో పెరుగుతుంది. దీన్ని స్థానికంగా అగరబత్తీలు కర్రలు, మతపరమైన ఆచారాలు, తక్కువ మొత్తంలో నూనె తీయడానికి వాడుతారు. ఇటీవల నేపాల్ గంధపు చెక్క ఎగుమతి మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీలంక 4వ పొజిషన్‌లో ఉంది. ఈ ద్వీప దేశంలో గంధపు చెక్క ఉత్పత్తికి సుదీర్ఘ చరిత్ర ఉంది. శ్రీలంక గంధపు చెక్క సువాసన చాలా పాపులర్‌. దీన్ని తరచుగా ఆలయ ఆచారాలు, పర్ఫ్యూమ్‌లు, ట్రెడిషినల్‌ మెడిసిన్‌లో ఉపయోగిస్తారు. దేశం గంధపు చెక్కను చురుకుగా పండిస్తుంది, రక్షిస్తుంది.

ఇండోనేషియా 3వ ర్యాంకులో ఉంది. ప్రధానంగా తూర్పు నుసా టెంగార లో గంధపు చెక్కను ఉత్పత్తి చేస్తుంది. తైమూర్ గంధపు చెక్క సువాసన చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందుకే దీన్ని అగరబత్తీలు, శిల్పాలు, కీలకమైన ఆయిల్స్‌ తయారీలో ఉపయోగిస్తారు. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రభుత్వం గంధపు చెక్క తోటలను ప్రోత్సహిస్తుంది. లిస్టులో మూడో స్థానంలో ఉంది. సెకండ్ ర్యాంకులో కంగారూ కంట్రీ ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఉత్తర ప్రాంతంలో పెద్ద తోటలలో ఇండియన్‌ శాండిల్‌ వుడ్ పెంచుతారు. ప్రస్తుతం కాస్మొటిక్స్‌, మెడిసిన్‌లో విస్తృతంగా ఉపయోగించే గంధపు నూనె ఎగుమతిదారులలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. Top 10 Sandalwood Countries.

ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే గంధపు చెక్కను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం. కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు అవుతాయి. మైసూర్ గంధపు చెక్క చాలా పాపులర్‌. ఎందుకంటే ఇందులో ఎక్కువ ఆయిల్‌ ఉంటుంది, మంచి సువాసన అందిస్తుంది. భారతదేశం పెర్ఫ్యూమ్‌లు, సబ్బులు, ఆయుర్వేద ఉత్పత్తుల కోసం పెద్ద మొత్తంలో గంధపు నూనెను ఎగుమతి చేస్తుంది. టాప్‌ టెన్‌లో మొదటి స్థానంలో ఉంది.స