
OG -2 is not a sequel but a prequel: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘ఓజీ’ చివరకు వెండితెరపై సందడి చేస్తోంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 100 కోట్లు వసూలు చేసిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, సినిమా మీద టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు దక్కిన మాస్ ఎలివేషన్ సీన్లు, ఆ సీన్లకు థమన్ కంపోజ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. థియేటర్లలో ఫ్యాన్స్ రియాక్షన్స్ చూస్తే ఆ హై ఎలా ఉందో అర్థమవుతుంది. దర్శకుడు సుజీత్ టేకింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఎవ్వరూ పవన్‌ను ఇలా స్టైలిష్‌గా చూపించలేదని పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం.
ఓజీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్!
సినిమా చివర్లో సీక్వెల్ ఉంటుందని క్లూ ఇచ్చినప్పటికీ, తాజాగా దర్శకుడు సుజీత్ అందరికీ షాక్ ఇచ్చేలా ప్రీక్వెల్ స్టోరీపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ –”ఓజీకి సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఇది సుభాష్ చంద్రబోస్ గురించి, ఆయన భారతీయులను జపాన్‌కి ఎలా తీసుకెళ్లాడు అనే పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది” అని వెల్లడించారు. ఈ కథలో సుభాష్ చంద్రబోస్ పాత్రకు అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆయనే ఆ పాత్రకు పర్ఫెక్ట్ అని భావించిన సుజీత్, ఇప్పటికే అమితాబ్‌ను కలిసి కథ వినిపించేందుకు సిద్ధమవుతున్నారట. ఒకవేళ బిగ్ బీ ఈ పాత్రలో నటించేందుకు ఓకే అయితే, ఇది నిజంగా తెలుగు సినిమా చరిత్రలో ఊహించని ట్విస్ట్ అవుతుందనే చెప్పవచ్చు.
ఇక్కడ కీలకంగా మారిన విషయం ఏమిటంటే – పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ సమయంలో మరో మూడు సినిమాలు పూర్తి చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ వస్తోంది. అలాగే ఓజీకి ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు డేట్స్ కేటాయిస్తారా? లేక రాజకీయ వ్యస్తతలతో సినిమాల నుంచి విరామం తీసుకుంటారా? అన్నది సందేహంగా మారింది. OG -2 is not a sequel but a prequel.
ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించగా, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందించారు. హీరోయిన్గా ప్రియాంక అరుళ్ మోహన్ ఆకట్టుకోగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా మంది సినీ అభిమానులు ఈయన టాలెంట్‌ని బాలీవుడ్ సరైన రీతిలో వాడుకోలేకపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.అలాగే శ్రేయా రెడ్డి, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు.