
The Great Wall of China: ఒక రీసెర్చ్ టీం గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలోని మట్టి లోపల కొన్ని కర్ర ముక్కలను గుర్తించారు. సో షాకింగ్ విషయం ఏంటంటే అవి 2000 సంవత్సరాల పురాతనమైనవి. అంతే కాకుండా ఆకర్రల మీద చైనా భాషలో క్లారిటీగా రాసి ఉంది. చైనీస్ ట్రాన్స్‌లేటర్ తో వాటిని ట్రాన్ట్సెట్ చేయించా రీసెర్చర్స్ మొత్తం ఆశ్ఛర్యపోయారు. ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
చైనా క్యాపిటల్ బీజింగ్ కి ప్రతి సంవత్సరం ఎంతో మంది వస్తూ ఉంటారు…వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ దగ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది కాబట్టి. ఇది పెద్ద కట్టడం అని…దీన్ని పూర్తిగా ఒకేసారి చూడాలంటే డ్రోన్ కూడా సరిపోదు. అలాగే ప్లేన్ లో వెళ్లినా కూడా చూడలేం. దీన్ని పూర్తిగా చూడాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం ఉంది. 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఔటర్ స్పేస్ సాటిలైట్ ద్వారా దీన్ని ఫోటో తీసి చూడటమే పాసిబుల్ అవుతుంది. అయితే కాలి నడకతో దీన్ని పూర్తిగా తిరిగి చూసిన వాళ్లు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ముగ్గురు ఫ్రెండ్స్ 1984 లో మొత్తం వాల్ ని కాలి నడకన తిరిగి చూశారాని తెలుస్తుంది. దీన్ని చూడటానికి వీళ్ళకు 17 నెలలు అంటే 510 రోజుల సమయం పట్టింది.
ఈ వాల్ ఒక చోట ఎత్తైన కొండలపై నుండి వెళితే ఇంకో చోట భయంకరమైన లోయల నుండి వెళ్తుంది. వేడిగా ఉండే ఎడార్లో కూడా దీన్ని కట్టారు. ఇది రెండంతస్తుల ఇల్లు అంత ఎత్తు 20 అడుగుల వెడల్పు వేల మైళ్ల వరకు ఉన్న ఈ గోడ నడవడానికే 510 రోజులు పడితే దీన్ని కట్టడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో మనం ఊహించుకోవచ్చు. మరి ఎంత కష్టమైన ఈ గోడను ఎవరు కట్టారు. ఎందుకు కట్టారు…ఎన్ని వేల సంవత్సరాలు అయినా ఈ గోడ ఇలాగే ఉంది అంటే దీనిలో ఏ రహస్యం దాగి ఉందో తెలియదు. అది తెలుసుకోవడం చాలా కష్టమే అని చెప్పుకోవాలి.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొన్ని విషయాలు పడుతూ ఉంటాయి. బీజింగ్ నుంచి 100 కిలో మీటర్ల దూరంలో జిన్సన్ లింగ్ దగ్గర కొండల్లో ఈ గోడలోని ఒక భాగం సరిగ్గా ఒరిజినల్ పొజిషన్ లో ఉంది. ఈ పోర్షన్ కట్టినప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికిీ అలాగే చెక్కుచెదరకుండా ఉంది. సాటిలైట్ తీసిన చిత్రాల ప్రకారం ఈ గోడ జిన్షన్ లింక్ కొండల్లో చాలా ఎత్తులో ఉంటుంది. ప్రతి వాచ్ టవర్ లో గాలి కోసం ఎన్నో కిటికీలు దాదాపు 50 మంది స్టే చేయడానికి సరిపడా స్థలం కూడా ఉంటుంది. నిపుణులు ఈ మొత్తం గోడలో 25000 వాచ్ టవర్స్ ఉన్నట్టుగా గుర్తించారు. దీన్ని మింగ్ డైనస్టీ వాళ్లు 650 సంవత్సరాల క్రితం కట్టించారని నిపుణులు చెబుతున్నారు. నిపుణులకు వాచ్ టవర్ ఉన్న ప్లేస్ లో గోడలకు అనేక రంధ్రాలు కూడా కనబడ్డాయని అంటున్నారు. ఇవి గోడ కట్టినప్పుడు చేసినవే కానీ వాటి అవసరం ఏంటో ఎవరికీ తెలియదు. గోడ మీద నిలుచున్న సిపాయి ఇక్కడి నుండి పెద్ద పెద్ద బాల్స్ విసిరేవారు. దాన్ని చూసి శత్రువులు గోడ ఎక్కడానికి భయపడేవారు. అంటే ఇది కేవలం కోడ మాత్రమే కాదు పూర్తిగా ఒక మిలిటరీ డిఫెన్స్ సిస్టం అన్నమాట.
అసలు మింగ్ డైనస్టీకి ఉన్న ప్రమాదకర శత్రువులు ఎవరు… ఈ గోడ నార్త్ వైపు దట్టమైన అడవి ఉంది అక్కడ మంగోల్స్ ఉండేవారు. మంగోల్స్ ఎప్పుడు చైనాలోకి గ్రామాల్లోకి వచ్చి దోచుకొని ఊళ్ళను తగలబెట్టేవారు. వీళ్ళ వల్ల జరిగే నష్టాన్ని ఆపడానికి మింగ్ రాజులు ఈ గోడను కట్టించారు. అసలు మనుషులు నడవడానికి కూడా చాలా కష్టమైన ఈ దట్టమైన అడవిలో ఇంత పెద్ద గోడను కట్టడానికి పెద్ద పెద్ద రాళ్లను ఎలా తీసుకొని వెళ్లారని ఎక్స్పర్ట్స్ షాక్ అయ్యారు. దానికి వాళ్లు డ్రోన్ సహాయంతో ముందు ఒక 3డీ మోడల్ తయారు చేయాలనుకున్నారు. ఆ డ్రోన్ ఫుటేజ్ ని వాడుతూ ఉండగా ఒక్కొక్క సీక్రేట్ బయటకు వచ్చింది. 3డీ మోడల్ లో గోడ కింది భాగంలో ఉన్న చూసి వాల్లు షాక్ అయ్యారు. వాళ్లకు ఆ గోడ కింద ఒక సీక్రెట్ డోర్ కనిపించింది. ఈ గోడను మంగోల్స్ నుండి కాపాడడానికి కడితే ఈ తలుపులను గోడకు అంత కిందకు అది కూడా కనపడకుండా ఎందకు పెట్టినారో వాళ్లకి అర్థం కాలేదు. ఈ పోర్షన్ లో 50 కంటే ఎక్కువ వీటిని కనుగొన్నారు. బహుశా మింగ్స్ ఆమి మంగోల్ వేషంలో ఈ తలుపుల నుంచి బయటకు వచ్చి మంగోల్స్ తో కలిసిపోయి వాళ్ల రహస్యాలు తెలుసుకునేవారేమో అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రీసెర్చర్స్ ని ఈ సీక్రెట్ తలుపుల కంటే ఇంకొకటి ఎక్కువ ఆశ్చర్యపరిచింది. ఎక్స్పర్ట్స్ డ్రోన్ ఫుటేజ్ లో ఉన్న ఒక సీక్రెట్ టన్నెల్ ని కనుగొన్నారు. ఈ టన్నెల్ ఎంట్రీ పాయింట్ చూస్తే అది మిగతా తలుపుల కంటే భిన్నంా ఉంది. దాన్ని చూస్తే బహుశా దాన్ని బలవంతంగా పగలగొట్టి ఉంటారేమో అనిపిస్తుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించగా దాన్ని బయట నుంచి కాదు లోపల నుండే పగలగొట్టారని తెలిసింది. కానీ ఎందుకు అక్కడ ఒక సీక్రెట్ తలుపు కూడా ఉంటే ఆ పాయింట్ లో ఆ తలుపును లోపల నుండే ఎందుకు పగలగొట్టారు? ఆ టన్నెల్ ను కన్ర్స్టక్ష్న్ సమయంలోనే నిర్మించి ఉంటారని దీనికి ఒక ప్రత్యేక అవసరం ఉంది కాబట్టి పగలగొట్టారని రీసెర్చర్స్ యొక్క అభిప్రాయం. ఆ అవసరం ఏంటి అంటే ఒకవేళ మంగోల్స్ గోడ మీద అటాక్ చేస్తే మెయిన్ ఆర్మీ సైనికులు ఈ టన్నెల్ ని పగల గొట్టి మంగోల్స్ మీద వెనక నుంచి దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది డ్రోన్ ఫుటేజ్ లో వచ్చిన పగిలిన ఒక టన్నెల్ ఇలాంటివి ఎన్నో టన్నెల్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో ఉన్నాయి. ఇంత దూరంలో విస్తరించిన ఈ గొడ ఇంత అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్స్ కలిగి ఉన్న ఈ గోడకు అసలు హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ గానే ఉంది. ఎక్స్‌పోర్ట్స్ సాటిలైట్ డేటాతో ట్రాక్ చేయగా ఈ వాల్ ఈస్టర్న్ చైనా నుంచి ఎత్తైన కొండల్లోంచి గోబీ డెసర్ట్ వరకు విస్తరించి ఉంది. ఈ వాల్ మొత్తం పొడవు 8850 కి.మీ గా నోట్ చేయబడింది. ఇది న్యూ ఢిల్లీ నుంచి ముంబై వరకు…లాహోర్ నుంచి కరాచి వరకు ఏడు సార్లు వెళ్లీ రావడంతో సమానం. అయితే ఈ వాల్ ఒక భాగం సముద్రంలో అంతమవుతుంది. ఈ గోడ స్టార్టింగ్ పాయింట్ మాత్రం గోబీ డెసర్ట్ లో ఉంది. అక్కడ ఒక అద్భుతమైన కోట కట్టబడి ఉంది.
ఇక ఇది గోడ మీద ఉనన వాచ్ టవర్లు అన్నిటికంటే పెద్దగా ఉంది. బహుశా ఇదే మెయిన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ అయి ఉండొచ్చు. ఈ గోడ గోబీ డెసర్ట్ లో అంతమవుతుంది. కానీ విరిగిపోయిన ఒక గోడ ఇక్కడ నుండి ముందుకు వెళ్తుందని సాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలిసింది. చూడటానికి ఈ గోడ గ్రేట్ వాల్ చైనా కంటే చాలా పురాతనమైనదిగా కనిపిస్తుంది. కాలం గడిచే కొద్దీ ఈ గోడలోని చాలా భాగం అంతమైపోయి ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉన్నారు. కోట నుడి కేవలం 250 మీటర్ల దూరంలో డెసర్ట్ లోని ఈ వాల్ ను పరిశీలించింగా ఇది మింగ్ డైనస్టీ ద్వారా కట్టించిన గ్రేట్ వాల్ కంటే చాలా పురాతనమైంది అని తెలిసింది. అసలు ఈ పురాతన వాల్ ని ఎవర ఎందుకు కట్టించారు. ఈ వాల్‌తో పాటు పెరిగిపోయిన విచిత్రమైన కట్టడాలు కూడా కనిపించాయి. వాటి అవసరం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. రీసెర్చర్స్ కి దొరికిన కొన్ని ఆధారాలు వాళ్ళ కష్టాన్ని దూరం చేశాయి. ఈ పురాతన వాల్ దగ్గర కొన్ని పురాతన కర్రలు దొరికాయి. వాటి మీద చైనీస్ భాషలో ఏదో రాసి ఉండటాన్ని వారు గమనించారు. ఇవి ఇసుకలో 2000 సంవత్సరాల నుండి కూరుకుపోయి ఉన్నాయి. ఒక చైనీస్ ఎక్స్ప్ ర్ట్ తో దాన్ని చదివించగా ఆ కర్రలు ఎవరో ఒక మిలిటరీ కమాండర్ వి అని తెలిసింది. దానిపై కొన్ని సూచలను రాసి ఉన్నట్లు తెలిసింది. అది ఒక వేళ హ్యాండ్స్ దాడి చేస్తే వాచ్ టవర్లు అన్నింటి మీద ఫ్లాగ్ ఎగరవేయాలని రాత్రిపూట దాడి చేస్తే టవర్ పైన నిప్పు పెట్టి ఉంచాలని రాసి ఉంది. The Great Wall of China.
ఈ విచిత్రమైన కట్టడాలు నిజానికి ఒక పురాతన వాచ్ టవర్ అని ఎక్స్ప్ ర్ట్స్ కి తెలిసింది. రాత్రి సమయంలో దాడి చేస్తే ఈ వాచ్ టవర్స్ ఇలా కనిపిస్తూ ఉండేవేమో. వేల కిలోమీటర్ల్లు విస్తరించి ఉన్న ఈ పురాతన వాల్ తో పాటు రీసెర్చర్స్ కి దొరికిన కొన్ని ఎవిడెన్సెస్ వల్ల అది కేవలం బోర్డర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే కాదు ఇది సిల్స్ రూట్ ను కూడా ప్రొటెక్ట్ చేయడానికి నిర్మించారని తెలుస్తుంది. ఇది చైనాలోని ఈస్టర్స్ నుంచి వెస్టర్న్ దేశాలకు ఎక్కువగా సిల్క్ ట్రేడింగ్ జరిగేది. అందుకని దీనికి సిల్క్ రూట్ అనే పేరు వచ్చింది. చైనాకు ఈ సిల్స్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనా ఎకానమీ ఈ సిల్స్ రూట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకని చైనాకు ఈ సిల్స్ రూట్ ఎంత కష్టమైనా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చైనాలోని అన్ని గోడల్ని కలిపితే దాని పొడవు 21000 కి.మీ ఉంటుంది. ఒకవేళ ఈ అన్ని గోడల్ని స్ట్రెస్ చేస్తే అది సం కంటే ఎక్కువ ప్రపంచాన్ని విస్తరిస్తుంది. ఒక రిపోర్ట్ ప్రకారం గ్రేట్ వాల్ దాదాపు 40శాతం వరకు పగిలిపోయి కనిపించకుండా పోయింది. కేవలం మింగ్ డైనస్టీ కట్టించిన గోడ కట్టడానికే నాలుగు లక్షల మంది కార్మికులు తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. వాళ్లను బానిసలుగా చేసి బలవంతంగా పని చేయించుకున్నారని తెలుస్తుంది. చనిపోయిన కార్మికుల శవాలని ఆ గోడలోనే పాతి పెట్టి ఉంటారని అనుకుంటూ ఉంటారు.