రాళ్లలో దాగి ఉన్న 5 మిస్టరీలు..!!

5 mysteries hidden in rocks: శిలాక్షరం అనే మాటను శాశ్వతంగా నిలిచేది అనే సందర్భాన్ని సూచించడానికి వాడుతాం. నీటి మీద రాతలు నిలబడవు కానీ….రాతి మీద రాతలు మాత్రం వేలాది సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. అవి వాతావరణ మార్పుల మూలంగా ప్రభావితం కావచ్చు. అవే ప్రపంచంలో రాళ్ల రూపంలో దాగిఉన్న ఐదు మిస్టరీలు. అయితే ఆ మిస్టరీల వివరాలపై ఒక లుక్ వేద్దాం.

దండయాత్రలో ధ్వంసం చేస్తే పాడవ్వచ్చు. అంటే ఒకటి సహజ క్షయం…మరొకటి ఉద్దేశపూర్వక వినాశనం.

కనుక వాటిని పక్కన పెట్టి చూస్తే శిలా శాసనాల వల్లే చారిత్రక వ్యక్తుల పుట్టుపూర్వత్రాలు వారు చేసిన పనుల గురించి మనకి ఈ కాలంలో తెలిసాయి. శిల్పకళ వల్ల మన ప్రాచీన సాంస్కృతిక వైభవం నేడు మనకు అర్ధమవుతుంది. అశోకుని శాసనాల్లోని చరిత్ర రామప్ప దేవాలయ మదనికల శిల్ప సౌందర్యం మాటున దాగిన ఆంధ్ర నాట్య శాస్త్రం ఎన్నో ప్రాచీన కళ సాంస్కృతిక చారిత్రీక సంపదలను మనకు అందిస్తోంది. భారతీయ దేవాలయాలు ఈజిప్ట్ పిరమిడ్లు, మయాన్ నాగరికత, గ్రీక్ రోమన్ కట్టడాలు ఇవన్నీ రాతిలో మలబడ్డ పురాచరిత్రకు జీవసాక్ష్యాలు. ఇవి చాలా వరకు మనకు పరిచమయ్యాయి. వాటిలో కొన్నింటి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

పెరువులోని ఆరాము మూరు పెరు దక్షిణ అమెరికాలోని ఒక దేశం. అక్కడ ఆండీస్ పర్వత శ్రేణులో ఉన్న రహస్య ప్రాంతమే ఈ ఆరాము మూరు. దీన్ని దేవతల ద్వారం అని స్థానికులు పిలుస్తారు. పెరువులోని హయ్యుమార్కా అనే ప్రాంతంలో ఉన్న ఈ నిర్మాణం టైటికాక సరస్సుకు సమీపంలో ఉంది. వాస్తవానికి ఇది భారీ రాతిని చెక్కి చేసిన ఒక విశాల ద్వారం. 23 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఈ రాతి ద్వారం తెరుచుకోదు. కానీ అచ్చం అది ఒక తలుపు మాదిరిగానే ఉంటుంది. దాని వెనుక గది కానీ స్వరంగం గాని లేదు. తలుపులాగా చెక్కిన రాయిలోని రహస్య ఏంటో ఎవరు చెక్కారో తెలియదు. అయితే స్థానిక విశ్వాసాల ప్రకారం ఆరామో మురు అనే వ్యక్తి ప్రాచీన ఆదివాసి పూజారి. ఆయన దేవతల ద్వారా లభించిన బంగారు తాళం చెవితో ఆ రాతి తలుపును తెరిచి వేరే లోకానికి వెళ్లిపోయాడని…మరి ఇక తిరిగి రాలేదని చెప్తారు.

ఇక నెక్ట్స్ వన్ థాయిలాండ్ లోని నాగావేక్. థాయిలాండ్ లో పచ్చని అటవి ప్రాంతం మధ్య ఉంది ఒక శిలాకృతి. నిజానికి ఇది ఒక పర్వతం. ఆకాశం మాత్రం పాము చుట్టూ చుట్టుకున్నట్టు నిండా పొలుసులు మాదిరిగా ఉంటుంది. థాయిలాండ్ ఈసాన్య దిశలో భూమంకాన్ ప్రాంతంలో ఉన్న పులాంగ్ నేషనల్ పార్క్ లో ఉంది ఈ నాగగుహ. 100 మీటర్ల పొడవైన భారీ శిల అచ్చంగా పాము ఆకారంలో ఉంటుంది. శరీరం నిండా పొడలు, ముడుచుకున్న వీపు భాగం మాదిరి పొడవైన వెన్ను. ముందు బాగం పామువలె ఉండి స్థిరంగా ఉన్న పెద్వ బండరాయి. దీన్ని చూస్తే పాకుతున్నట్టుగా ఓ మహానాగం అలాగే రాయిగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి పాము ఆకారపు బండలు ఒక 10 వరకు ఆ పార్కులో కనిపిస్తుంటాయి. కొన్ని పాము శిరస్సులాగా కొన్ని పాము పడగ లాగా, మరికొన్ని పాము శరీరం లాగా ఉన్నాయి. స్థానిక కథనాల ప్రకారం అక్కడ సర్పవంశం ఒకటి నివాసం ఉండేదట. వాళ్ళ రాజు దైవాజ్ఈను దిక్కరించి మద్యం సేవించగా మొత్తం ఆ పాముల వంశాన్నే బండరాలుగా దైవం మార్చేసిందని అక్కడ కథా చెప్పుకుంటారు. దైవ కృప మరలా వాటిపై ప్రసరించినప్పుడు మాత్రమే అివి తిరిగి పాములుగా మారుతాయి.

ఇక నెక్ట్స్ వన్ అర్జెంటీనాలోని పీడ్రా మావేడిజ ఇది ఒక ఏకశీ తనకు తానుగా కదులుతుంది. అర్జెంటీనాలోని టెంటల్ పట్ఠణంలో ఒక కొండ మీద ఉన్న ఒక రాయి పేరు పీడ్రా. ఆ పేరకు అర్ధం కదిలే రాయి అని. 300 టన్నల బరువు ఉండే హీడ్రా మావేడిజా కొండ వాళ్ళ మీద ఉండేది. గాలి విస్తే జారిపోవచ్చును అన్నట్టు గా ఉంటుంది.అలా వందల సంవస్తరాలు నిలబడింది. ఆ తర్వానే దానంతటా అదే కదిలింది. దైవశక్తే దాన్ని కదిలించిందని అక్కడ నమ్ముతారుఅదాది ఉన్న చోట కొండ లోపల పొరల్లో ఏవో విశేషమైన శక్తులు ఉంటాయిని నమ్ముతారు. అది ఒక దెయ్యం బండ అని. మనిషి వచ్చినప్పుడు కదలక మెదలక ఉంటుందని మనిషి లేనప్పుడు మాత్రం ఇష్టం వచ్చినట్టు కదులుతుంందని చెప్తారు. 1912 ఫిబ్రవరి 29న నాడు మాత్రం ఎటువంటి ప్రకృతి వైపరిత్యం రాకుండా ఎవ్వరూ ప్రయత్నించకుండానే పిడ్రా మోవేడిజా స్వయంగా కదిలి కొండ వాలుక దిగజారిందట.

ఇక నెక్టస్ వన్ లాలిబెల్లాలోని రాక్ హ్యూన్ చర్చ్లు కేవలం రాతితో చెక్కిన నిర్మాణం ఇది. కలెపా సిమెంట్ ఉపయోగించలేదు. కేవలం రాయి తొలిచి నిర్మించారు. ఇథియోపియాలోని ఓ చిన్నప్రాంతం లాల్బెల్లా. ఇక్కడ రాక్ హ్యూన్ చర్చ్ ని రాతిని తొలిచి నిర్మించారు. 12వ శతాబ్దంలో పై నుంచి క్రిందకు రాతిని తలుచుకొంటూ దీన్ని ఇలా అద్భుతంా నిర్మిండాన్ని ప్రశంసించకుండా ఉండలేము. అంటే దీన్ని ఏకశిలా నిర్మాణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక భారత్ దేశంలోని ఛాంద్ బావడి. రాజస్తాన్ లోని ఎడారి ప్రాంతంలో ఉన్న నిర్మాణం ఇది 13 అంతస్తుల్లో చెక్కిన లోతైన బావి ఇది. అవును ఇది కేవలం ఒక బావి . అయితే భారతీయ శిల్పకలకు ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. వందల కొద్ది మెట్లు ఖచ్చితమైన కొలతలతో చెక్కినట్లు వాటి…వాటి వరుస చూస్తుంటే కళ్ళు చెదురుతుంది. అవి మొత్తం 3500 మెట్లు. ఇంకా అంతకంటే ఎక్కువే అని చెప్పొచ్చు. తొమ్మిదవ శతాబ్దంలో రాజా చందా పరిపాలన కాలంలో దీన్ని నిర్మించారని తెలుస్తోంది. అంకగణితం రేఖ గణితం లెక్కలతో సర్గా సరిపోయేలా ప్రతి ఒక్క మెట్టు ఒకేలాంటి కొలతలతో చెక్కబడింది. ఈ చతురస్రాకార ఛాంధ్ భావ మొత్తం 13 అంతస్తులుగా ఉంటుందనే దీని నిర్మాణ శైలి ప్రత్యేకతను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. అచ్చ అలాగే మరో నమూనా కట్టడం కట్టమని సవాలు విసిరితే ఈ ఆధునిక కాలంలో కూడా దాదాపుగా అసాధ్యం. 5 mysteries hidden in rocks.

ఇక భారతదేశంలోని మరొకటి ఎల్లోరా గుహలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇది. ఆరు నుంచి 10 శతాబ్దాల మధ్యకాలం నాటి ఎల్లోరా కైలాస దేవాలయం ప్రపంచంలోని అతి పెద్ద ఏకశిలా నిర్మాణం ఒక పెద్ద కొండను పై నుంచి కిందకి చెక్కుకుంటూ దేవాలయంగా మలిచారు. రాష్ట్రకూటుల పరిపాలన కాలం నాటి ఈ గుహాలయ శిల్పాలు, స్తంభాలు, రాతి చట్రాలు ఆలయంలోని శివలింగంలతో సహా అన్ని ఒక కొండను తొలిచి చేసినవే తప్ప తయారు చేసి తెచ్చి ప్రతిష్టించినవి కావు. ఎల్లోరాలోనే ఉన్న బౌద్ధజైన గుహలు సామాన్య శకం పూర్వం 600 నుంచి వెయ్యి సంవత్సరాల మధ్య చెక్కినటువంటివి. కైలాస దేవాలయాన్ని రాజులు కాదు దేవతలే నిర్మించారని కొందరు నమ్ముతారు. ఇదంతా చూస్తే నాటి శిల్ప శాస్త్రప్రగతిని ఈనాటి మనం అందిపుచ్చుకోవడం దాదాపుగా కాదు అసలు సాధ్యమే పడదు. శిలలలో శిల్పాలు చెక్కినారు ఆ శిల్పాలకు జీవం పోసి నవరసాలు ఒలకించినారు మనవారు. ఈ సృష్టికే అందాలు తెచ్చినారంటూ ఇలాంటి గొప్ప కవిత్వం మల్లిన మనసు కవి ఆత్రేయ రచనను గుర్తు తెచ్చేలా ఉన్న ఈ గొప్ప కట్టడాలను మరోసారి చూడాల్సిందే.