
Allu Sirish Marriage: ఇటీవల అల్లు ఫ్యామిలీ నుంచి పెళ్లి ఘట్టానికి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తున్నాయి. బన్నీ సోదరుడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఫిలింనగర్‌లో జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం శిరీష్ సినీ కెరీర్ పరంగా గ్యాప్‌లో ఉన్నా, వ్యక్తిగత జీవితంలో మాత్రం కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతేడాది ‘బడ్డీ’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శిరీష్ ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు. అంతేకాదు సోషల్ మీడియా నుంచి కూడా దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
శిరీష్ కెరీర్‌ను చూస్తే, ఆయన ‘గౌరవం’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ, తరువాతి చిత్రాలైన ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఏబీసీడీ’, ‘టెడ్డీ’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. నటనలో శిరీష్ మెరుగయ్యాడన్న మాట వినిపించినా, కథల ఎంపికలో వచ్చిన లోపాలే అతడి కెరీర్ కి బ్రేక్ వేసాయి. ఇదిలా ఉంటే, ఇటీవల అల్లు కుటుంబంలో ఓ విషాద సంఘటన జరిగింది. అల్లు రామలింగయ్య గారి సతీమణి, అల్లు అరవింద్ తల్లి అయిన కనకరత్నమ్మ మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ బాధను అధిగమించిన తరువాత శిరీష్‌కు పెళ్లి జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను శిరీష్‌కు మార్చిపెళ్లించేందుకు ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ముందుగా నిశ్చితార్థం నిర్వహించి, ఆ తర్వాత త్వరలోనే పెళ్లి చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కనకరత్నమ్మ మరణంతో ఈ శుభకార్యం కొద్దిగా వాయిదా పడిందన్న మాట వినిపిస్తోంది. Allu Sirish Marriage.
ఇప్పటికే మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ వివాహ బంధానికి అడుగుపెట్టారు. నిహారిక కూడా పెళ్లి చేసుకున్నా వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుంది. ప్రస్తుతం శిరీష్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మాత్రమే సింగిల్‌గా ఉన్నారు. అయితే వీరిలో ఇప్పుడు మొదటిగా శిరీష్ పెళ్లి జరగబోతున్నాడన్న వార్తలు జోరుగా చర్చనీయాంశమవుతున్నాయి. కాగా, గతంలో శిరీష్ పేరు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో లింక్ చేయబడి రూమర్స్ వచ్చాయి. అయితే ఆ వార్తలను శిరీష్ స్పష్టంగా ఖండిస్తూ, తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పాడు.ఇక ఇప్పుడు శిరీష్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.