దేవరకొండ కాంగ్రెస్ లో వర్గ పోరు..!!

Congress MLA Balu Naik: ప్రజల నాడి పట్టుకోవడంలో కాంగ్రెస్” కు ఒకప్పుడు మంచి పేరు ఉండేది!.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ కు పది సంవత్సరాల తర్వాత అధికారం దక్కినా,ఆ నియోజకవర్గం లో మాత్రం అసమ్మతి సెగలు గక్కుతుంది.ఆ ఎమ్మెల్యేను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడంతో రచ్చ రాజకుంటుంది. దీనిపై ఎమ్మెల్యే ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకు పెరిగిపోతుందట!..సోషల్ మీడియా గ్రూప్ లలో వార్నింగ్ ఇచ్చినా పరిస్థితి లో మార్పు లేదు..సీనియర్ల జోక్యం తో అంతా సద్దుమణిగినట్టు ఉన్నా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆ నియోజక వర్గం ఏది? ఎవరా ఎమ్మెల్యే?

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ లో ప్రస్తుతం అంతర్గత సెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యే బాలు నాయక్ తమను పట్టించుకోవడం లేదని క్యాడర్ సీరియస్ గా ఉంది. గ్రూప్ రాజకీయాలు ఆ ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు ఎమ్మెల్యేను టార్గెట్ చేయడంతో ఈ రచ్చ మరింత పెరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, తగాదాలు పెరుగుతుండటం కామన్ గా మారింది. రిజర్వ్ డ్ నియోజకవర్గాల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. సీనియర్లు తమ ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారు తమ అనుచరులను ప్రోత్సహించడం, రెచ్చగొట్టడం వల్ల వర్గ విభేదాలు పెరిగిపోతున్నాయి.”

దేవరకొండ నియోజకవర్గం నుంచి నేనవత్ బాలు నాయక్ రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగిరినా కూడా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డికి మంచి పట్టుంది. తన రాజకీయ భవిష్యత్తుకు జానారెడ్డినే కారణం అని బాలు నాయక్ పలు సందర్భాల్లో చెప్పినా, గ్రూపుల పోరు ఆగడం లేదని తెలుస్తుంది.ఇక ఇదే నియోజకవర్గంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన అనుచరులకు అండగా నిలుస్తున్నారు. జానారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ రఘువీర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు పార్టీని బలోపేతం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, లోలోపల గ్రూపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇక మొన్నటి వరకు ఎస్టీ కోటాలో మంత్రి పదవి ఆశించిన బాలునాయక్ సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆశ వదులుకుని నియోజకవర్గానికి పరిమితం అయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళుతున్నారు. గెలిచినప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న బాలు నాయక్ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తన తడఖా చూపిస్తానని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు పార్టీ ని వీడాల్సిందేనని చెపుతున్నారు. తన మాట కాదని పార్టీ లైన్ దాటితే పదవులు దక్కవని చెప్పారంటే గ్రూప్ రాజకీయాలు ఎంత తలనొప్పిగా మారాయో అర్ధం చేసుకోవచ్చు.

దీంతో ఎమ్మెల్యే బాలు నాయక్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. మొదటి నుంచి ఆయన వెంట నడిచిన కొందరు నాయకులు కూడా అసమ్మతితో రగిలిపోతున్నారు. ఎన్నికల్లో తమను ఉపయోగించుకొని, ఆ తర్వాత పక్కన పెట్టారనే బాధ వారిలో ఉంది. బాలు నాయక్ వైఖరి ‘ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా ఉంది’ అని చందంపేట, దేవరకొండ, పి.ఏ.పల్లి మండలాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు దూరమయ్యారు. ఈ పరిణామాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో, పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతోందని ఎమ్మెల్యేలో ఆందోళన నెలకొంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చని బాలు నాయక్ టెన్షన్ పడుతున్నారు. తన నియోజకవర్గంలో ఇతర స్థానాల నేతల జోక్యంతోనే కాంగ్రెస్ లో వర్గపోరు పెరిగిపోతుందని ఆయన వాదన. Congress MLA Balu Naik.

బాలు నాయక్ దేవరకొండ గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,లోకల్ బాడీ ఎన్నికల తర్వాత తడాఖా చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారు పార్టీని వీడాల్సిందేనని తేల్చి చెప్పారు. తన మాట కాదని పార్టీ లైన్ దాటిన వారికి ఎప్పటికీ పదవులు దక్కవని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మరీ టీపీసీసీ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో.. స్థానిక ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో.. దేవరకొండలో కాంగ్రెస్ లోని ఈ కోల్డ్ వార్ ఎక్కడికి దారితీస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..