
NTR Neel Movie: కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నాడు. యష్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్లనుMass మాస్ మైనర్ గానే కాకుండా, వెరైటీ యాక్షన్ గెటప్ల్లో చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అదే స్థాయిలో తారక్ (ఎన్టీఆర్) కోసం తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్‌ను నీల్ ఎలా డిజైన్ చేశాడు? టైటిల్‌కు తగ్గట్టే పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది? అంటూ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఇక తాజాగా, హైదరాబాద్‌లో నిర్వహించిన కాంతార చాప్టర్ 1 ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా డ్రాగన్ సినిమాపై కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న కాంతార చాప్టర్ 1 చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు హక్కులు తీసుకున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మైత్రీ నిర్మాత వై. రవిశంకర్ ‘ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్టీఆర్ – నీల్’ మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అన్నారు. డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించారు.
కాంతార చాప్టర్ 1’లో రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రజెన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఇప్పుడు షో వేస్తే థియేటర్ కి వెళ్లి చూడాలనే విధంగా సినిమా ఉంది. సినిమా చూసిన ముగ్గురు నలుగురు అద్భుతంగా ఉందని చెప్పారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్ సాధిస్తుందని నమ్ముతున్నాను. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పర్ఫార్మన్స్ దగ్గర నుంచి చూశాం. ఎన్టీఆర్ అన్నకి సరిపోయే హీరోయిన్, కనీసం ఆయన్ను మ్యాచ్ చేసే హీరోయిన్ ఎవరా అని నెలల తరబడి వెతికితే.. రుక్మిణి ఒక్కతే కనిపించింది. ఎన్టీఆర్ అంత కాకపోయినా 80 శాతం ఇవ్వగలరని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.. NTR Neel Movie.
ఎన్టీఆర్ – రిషబ్ శెట్టి చాలా క్లోజ్ గా ఉంటారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా బ్రదర్స్ లా ఉంటారు. వచ్చే నెలలో ‘ఎన్టీఆర్ నీల్’ సినిమా షెడ్యూల్ మొదలైతే, నిరంతరాయంగా సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మేము మీకు ప్రామిస్ చేసినట్లు.. బెస్ట్ డేట్ లో బెస్ట్ రిలీజ్ అందిస్తామని అనుకుంటున్నాం. సినిమా ఎలా ఉంటుందనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. అది వేరే వేరే వేరే లెవల్” అని రవి శంకర్ చెప్పుకొచ్చారు.