చిరుతో జోడి కడుతున్న అనుష్క‌..!!

Anushka Chiranjeevi: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎనలేని ఎనర్జీతో వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ, తన స్టార్ డం‌ను మరోసారి నిరూపిస్తున్నారు. వయసు ఏమీ కాదని, యంగ్ హీరోలతో పోటీగా ఫుల్ ఎనర్జీతో పనిచేస్తూ ఫ్యాన్స్‌కు ఓ మాస్ ఫీస్ట్ అందిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి మూడు పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ప్రత్యేకంగా చూపాల్సిన ప్రాజెక్ట్ ‘మెగా 158’. వాల్తేరు వీరయ్య వంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ (కె.ఎస్.రవీంద్ర), మళ్లీ చిరుతో కలసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. చిరంజీవి లుక్‌ చూసి అభిమానులు ఖుషీ అయిపోయారు.

ఈసారి బాబీ చిరు కోసం ఎలా ఓ మాస్ రోల్ డిజైన్ చేశాడా అని ప్రేక్షకుల్లో భారీ కుతూహలముంది.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించబోయే నటి ఎవరు? అనే ప్రశ్న చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క శెట్టిను తీసుకోవాలని బాబీ యోచిస్తున్నాడట. చిరంజీవితో అనుష్క ఇంతకుముందు స్టాలిన్ సినిమాలో ఓ పాటలో మాత్రమే కనిపించింది. కానీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఆమె ఇంకా చిరుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు.

అనుష్క ఇప్పటి వరకు నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో నటించినా, చిరంజీవి, బాలకృష్ణలతో మాత్రం పూర్తి పాత్రలు చేయలేదు. ఓ ఇంటర్వ్యూలో చిరుతో కలిసి నటించాలని తాను ఎంతోకాలంగా ఆశపడుతున్నానని అనుష్క చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబీ ఆ కలను నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

70 ఏళ్ళ వయసులోనూ చిరంజీవి స్క్రీన్ మీద యంగ్ గా కనిపిస్తున్నారు. అయినా, చిన్న వయసు హీరోయిన్లతో జోడీ కట్టడం వల్ల విమర్శలు రావొచ్చన్న భయం మేకర్స్ లో ఉంది. విశ్వంభరలో త్రిష, మన శంకర వరప్రసాద్లో నయనతార లాంటి సీనియర్ హీరోయిన్లను తీసుకుని మేకర్స్ సేఫ్ గేమ్ ఆడారు. ఇప్పుడు మెగా 158లో అనుష్కను ఎంపిక చేయడం కూడా అదే కోణంలో తీసుకున్న నిర్ణయమే అనిపిస్తోంది. Anushka Chiranjeevi.

ఈ చిత్రం దసరా నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే చిరుతో బాబీ క్రేజీ హిట్ ఇచ్చినందున, ఈ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి బాబీ ఏ కథ, ఏ గెటప్‌తో మెగాస్టార్‌ను చూపించబోతున్నాడో చూడాలి. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మంచు మనోజ్ ను ఎంపిక చేయాలనే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడట. ‘మిరాయ్’లో విలన్‌గా చెలరేగిపోయిన మనోజ్, ఇప్పుడు చిరుకు పవర్ ఫుల్ విలన్ గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.