
China Skull Found: మన భూమి తన గర్భంలో ఎన్నో అంతులేని రహస్యాలను భద్రంగా దాచుకుంది. కాలం గడచే కొద్దీ అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మానవజాతి మెదడుకు పరీక్ష పెడుతున్నాయి. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన వందల,వేల ఏళ్ల నాటి చరిత్ర ఆనవాళ్లు మనల్ని ఆశ్చర్యపర్యపరుస్తున్నాయి. తాజాగా చైనాలో బయటపడిన ఓ పుర్రె చరిత్ర తెలుసుకుని శాస్త్రవేత్తలు సైతం ఖంగుతింటున్నారు. ఇది మనిషి పుట్టుకనే ప్రశ్నిస్తోంది. ఇది పుర్రె కదా అందులో అంత ప్రత్యేకత ఏముంది? అని అనుకుంటున్నారా..మొదట్లో సైంటిస్టులు కూడా అదే అనుకున్నారు. కానీ దాన్ని స్టడీ చేశాక వాళ్ల మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయ్యింది. ఎందుకంటే..అది ఇప్పటిది కాదు ఏకంగా 10 లక్షల ఏళ్ల నాటికి చెందింది. అందులోనూ ఈ పుర్రె కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇంతకీ ఈ పుర్రె ఏ కాలానికి చెందింది? శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోవడానికి కారణాలేంటి? అసలు ఈ పుర్రె చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రిటన్ , చైనా పరిశోధకులు ఓ భారీ బాంబ్ పేల్చారు. దాదాపు 10 లక్షల ఏళ్ల క్రితం నాటి ఓ మానవ అవశేషంపై వీరు తాజాగా జరిపిన పరిశోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిశోధన మానవ పుట్టుక గురించి మనకు ఇప్పటి వరకు ఉన్న అన్ని అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తోంది. మధ్య చైనాలోని హుబయ్ ప్రావిన్స్ లో లభించిన ఓక పుర్రెపై చేసిన స్టడీ ప్రకారం మన జాతితో పాటు ఎక్కువ మెదడు కలిగిన మరో రెండు మానవ జాతుల ప్రస్తావన కూడా 10 లక్షల ఏళ్ల కిందే మొదలై ఉండొచ్చని అంటున్నారు. అంటే ఇప్పటి వరకు భావించిన దానికన్నా దాదాపు 5 లక్షల సంవత్సరాల ముందే ఈ రెండు మానవ జాతులు ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
చైనాలో రీసెంట్ గా లక్షల ఏళ్ల నాటి ఓ పుర్రె లభించింది. ఇప్పుడున్న మానిషి ముఖానికి దీనికి అస్సలు సంబంధమే లేదు. పోనీ.. ఇంతవరకూ బయటపడ్డ పూర్వీకులకు చెందిందా? అని పోల్చి చూస్తే, వాటితోనూ ఇది ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు. దీంతో ఈ పుర్రె ఇప్పుడు మానవ జాతి పుట్టుకకు సంబంధించిన చరిత్రను తిరగరాస్తోంది.
మనిషి పుట్టుకకు సంబంధించి మనం ఇప్పటి వరకూ చెప్పుకుంటున్న దానికన్నా చాలా పాత, లోతైన చరిత్ర ఉందని ఇది చెబుతోంది. తొలి ఆధునిక మానవులు సుమారు 10 లక్షల ఏళ్ల క్రితం హోమోఎరక్టస్ జాతితో కనిపించారని శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. దాదాపు 6 లక్షల సంవత్సరాల క్రితం ఈ జాతి నియాండర్తల్స్ మన పూర్వికులైన హోమోసెపియన్స్ నుంచి విడిపోయింది. కానీ చైనాలో లభించిన ఈ అవశేషం దాదాపు 10 లక్షల ఏళ్ల నాటిది. సహజంగానే పరిశోధకులు దీనిని హోమోఎరక్టస్ గా భావించారు. అయితే లేటెస్ట్ స్టడీ ప్రకారం ఇది పూర్తిగా వేరే జాతికి చెందినదని గుర్తించారు. ఆ కాలంలో ఉన్న నియాండర్తల్స్ హోమోసెపియన్స్ తో కలిసి ఈ జాతి మనుగడ సాగించింది. దాంతో మొత్తం టైమ్ లైన్ ఐదు లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లైంది. అంటే ఆధునిక మానవజాతి పరిణామం మనం ఇప్పటి వరకు భావించిన దానికన్నా చాలా పురాతనమైనదని ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.
యాంక్షియస్ అని పిలిచే 10 లక్షల ఏళ్ల కిందటి పుర్రె హోమోఎరక్టస్ జాతికన్నా ఆధునికమైందని శాస్త్రవేత్తలు ఎలా తెలుసుకున్నారంటే..ఎరక్టస్ , యాంక్షియస్ పుర్రె లు రెండూ పెద్దవే. అయితే ఎరక్టస్ పుర్రెకు బలమైన కనుబొమ్మల ఎముక ఉంది. సైడ్స్ లో లోపలికి ఒత్తుకుపోయినట్లు ఉంటుంది. మెదడు పరిమాణం కొంచెం చిన్నది. యాంక్షియస్ ప్రాధమికంగా ఉంది. ఎక్కువ వెడల్పు.. తక్కువ ఎత్తులో బలమైన కనుబొమ్మల ఎముక కలిగి ఉంది. బాగా పరిశీలించి చూస్తే ఇందులో మృదువైన ఆకృతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇది మరింత అభివృద్ధి చెందిన జాతికి చెందినది శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. China Skull Found.
చైనాలోని హుబయ్ ప్రావిన్స్ లో జరిపిన తవ్వకాల్లో ఇతర అనేక అవశేషాలతో పాటు ఈ పుర్రె బయటపడింది. కానీ అవన్నీ బాగా దెబ్బతిని విరిగిపోయి ఉన్నాయి. షాంఘైలోని ఫ్యూడాన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈ పుర్రెలను స్కాన్ చేసి విడి భాగాలను అతికించింది. కంప్యూటర్ మోడలింగ్ టెక్నాలజీని ఇందుకోసం ఉపయోగించారు. త్రీడీ ప్రింటర్ తో దాని నమూనాను తయారు చేశారు. కంప్యూటర్ కరెక్షన్ కు ముందు దెబ్బతిన్న పుర్రెలన్నీ తెల్లగా కనిపించాయి. బూడిద రంగులో కనిపిస్తున్నవి రీకన్స్ట్రక్ట్ చేసినవి. అలా వీటి మధ్య తేడాను గుర్తించే అవకాశం శాస్త్రవేత్తలకు లభించింది. ఇక ఫలితాలను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇవి హోమో లోంగై అని పిలిచే మరింత ఆధునిక మానవజాతికి చెందిన పుర్రెలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే సైన్స్ అనే జర్నల్ పబ్లిష్ చేసిన ఈ అధ్యయనాన్ని పూర్తిగా నమ్మలేమని…వీటిలో ఖచ్చితత్వం లేకపోవచ్చని కొందరు సైంటిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ప్రూఫ్స్ కావాలంటున్నారు. మొత్తానికి మానవ పుట్టుకకు సంబంధించి మరింత క్లిష్టమై…ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయనేది ఈ స్టడీ ద్వారా తెలుస్తోంది.