మంచు తుఫాన్..!!

Mount Everest Rescue: ఒకప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం దరిదాపుల్లోకి చేరడం కూడా సాహసమే అనిపించేది. కఠినమైన వాతావరణం, సరైన సౌకర్యాల లేకపోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే ఆ సవాల్‌ స్వీకరించగలిగేవారు. హిమాలయాలు.. ప్రకృతిలోని అత్యంత అద్భుతమైన సృష్టి. భగవంతుడు శివుడు కొలువై ఉన్న పవిత్ర ప్రదేశంగా భావించబడే ఈ పర్వత శ్రేణులు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని తమలో ఒదిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ మహా శిఖరం వద్ద పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

ఒకప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం దరిదాపుల్లోకి చేరడం కూడా సాహసమే అనిపించేది. కఠినమైన వాతావరణం, సరైన సౌకర్యాల లేకపోవడంతో చాలా తక్కువ మంది మాత్రమే ఆ సవాల్‌ స్వీకరించగలిగేవారు. కానీ గత కొన్నేళ్లుగా సాంకేతికత, పరికరాలు, మార్గదర్శక సదుపాయాలు పెరగడంతో ప్రపంచం నలుమూలల నుంచి పర్వతారోహకులు ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు తరలివస్తున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఆ ఉత్సాహం భయాందోళనగా మారింది. ప్రస్తుతం ఎవరెస్ట్‌ పరిసర ప్రాంతం మంచు తుఫాన్ బీభత్సంతో వణికిపోతోంది. విపరీతమైన హిమపాతం కారణంగా వాతావరణం అంటార్కిటికా చలిని తలపించేలా మారిపోయింది. ఈ సమయంలోనే సుమారు వెయ్యి మంది పర్వతారోహకులు టిబెట్‌ వైపున 16 వేల అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. నిరంతర మంచు కురవడం వల్ల వారిలో చాలామంది హైపోథెర్మియాతో బాధపడుతున్నట్టు సమాచారం.సహాయక బృందాలు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, తీవ్ర వాతావరణ పరిస్థితులు, హిమపాతం కారణంగా చర్యలు కష్టతరంగా మారాయి. స్థానిక షెర్పాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు నేపాల్‌లో కూడా భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రోడ్లు మూసుకుపోవడం, కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడం వల్ల సహాయక చర్యలు సజావుగా సాగడంలేదు.

వాతావరణ నిపుణుల ప్రకారం, ఈ మంచు తుఫాన్‌ కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరెస్ట్‌ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్‌ 30 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతోందని చెబుతున్నారు. ఈ స్థితిలో పర్వతారోహకులు శ్వాసకోశ సమస్యలు, శరీర ఉష్ణోగ్రత తగ్గడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం చిక్కుకుపోయిన పర్వతారోహకులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాలను, అంతర్జాతీయ సంస్థలను కోరుతున్నారు. ఇప్పటికే నేపాల్‌ ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తుంది.

రెస్యూ బృందాలు ఇప్పటిదాకా 350 మందిని కాపాడినట్లు సమాచారం. వాళ్లందరినీ క్యూదాంగ్‌ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైపోథర్మియా శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకి పడిపోవడం) కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. “ఇది తమ జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి” అని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.. మంచు తుఫాన్‌ ధాటికి టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో పర్వతారోహకులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్న దృశ్యాలతో ఓ వీడియో రికార్డు బయటకు వచ్చింది. అయితే పర్వతారోహకులు అలా తరలిపోతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి తప్పిపోయే అవకాశం ఉండడం, పైగా హైపోథర్మియాతో పాటు ఆక్సిజన్‌ కొరత వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

కర్మా లోయ సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉంది. నేపాల్‌లో భారీ వర్షాలు, మెరుపు వరదలు,కొండ చరియలు విరిగిపడి 47 మంది మరణించారు. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్ట్‌పై మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుపాను సంభవించింది. మరోవైపు.. తుపాను నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను శనివారం నుంచే నిలిపివేసింది.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. గతంలో అయితే దీనిని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 340 మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10-11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించారు. అలాగే.. 2014 ఏప్రిల్‌ 18వ తేదీన మంచు శిఖరాలు (ice seracs) కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో భాదిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా.. ఎవరెస్ట్‌ బేస్‌క్యాంప్‌పై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్ట్‌ విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది. Mount Everest Rescue.

ఎవరెస్ట్‌ శిఖరం ఎప్పటిలాగే మహిమగలదే అయినా, ఈ మంచు బీభత్సం ఆ ప్రాంతం మీద మానవ జోక్యం, వాతావరణ మార్పుల ప్రభావం ఎంత పెరిగిందో మరోసారి గుర్తు చేసింది. ప్రకృతిని జయించాలనే మనుషుల తపన, ఇప్పుడు వారికి తీవ్రమైన సవాలుగా మారింది.