కిక్కుకి దిక్కులేదు.!

Rajasthan Beer Debate: మద్యం ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అతిముఖ్యమైన ఏకైక ఆదాయ సాధనంగా మారిపోయింది. ఏ వస్తువుపై లేనంత పన్నులు, సెస్సులు వేస్తూ ఉంటాయి ప్రభుత్వాలు. అయితే బీర్ బాటిల్ పై 20 శాతం ఆవు ట్యాక్స్ విధించడం వైరల్ గా మారింది. మందు బాటిల్ పై 20 శాతం కౌ సెస్ విధించడంపై రాజస్థాన్ లో పెద్ద డిబేట్ కు దారితీసింది. దేశంలో మందుబాబులంటే.. అన్ని ప్రభుత్వాలకూ చులకనేనా? సర్కారుకు మనీ కావాలంటే.. మద్యంపై రకరకాల పన్నులు బాదేయడమేనా? అసలు ఆవు పన్ను ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 20 శాతం పన్ను ఎందుకు విధిస్తున్నారు? దీనిపై నెటిజన్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.

సాధారణంగా మనం ఏదైనా వస్తువు గానీ, సేవలు గానీ పొందినపుడు.. ప్రభుత్వం మన నుంచి ట్యాక్స్ వసూలు చేస్తుంది. అయితే అందులో రకరకాల ట్యాక్స్‌లు, రకరకాల సెస్‌లు కలిసి ఉంటాయి. ఇక గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రాకముందు వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ , సెస్ వసూలు చేసేవారు. జీఎస్టీ రావడంతో అన్ని పన్నులను అందులోనే కలిపి వసూలు చేస్తున్నారు. కానీ మద్యం.. పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై జీఎస్టీ కాకుండా వ్యాట్, సెస్‌లు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ ఘటన చర్చనీయాంశమైంది. మద్యం తాగేందుకు ఓ బార్ కు వెళ్లిన మందుబాబుకు బిల్లు చూసి షాక్ తగిలింది. అందులో తాను తాగిన బీరుపై వ్యాట్ విధించడంతో పాటు దానిపై 20 శాతం ఆవు సెస్ (ఆవు పన్ను) విధించారు. దీంతో అతను ఈ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇది చూసిన నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు. మందుబాబుల బలహీనతను ఇలా కూడా సొమ్ము చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

అసలు విషయానికి వస్తే.. జోధ్‌పూర్‌లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చగా మారింది. జోధ్‌పూర్‌లోని పార్క్ ప్లాజా హోటల్‌లో గల జియోఫ్రేస్ బార్‌కు వెళ్లిన ఓ కస్టమర్ ఆరు బీర్లు, కార్న్ ఫ్రిట్టర్స్ ఆర్డర్ చేశారు. తాను తిని, తాగిన పదార్థాలకు బిల్లు మొత్తం రూ.2,650 అయింది. ఇక దానికి జీఎస్టీ, వ్యాట్, వ్యాట్‌పై 20 శాతం ఆవు సెస్ విధించినట్లు పేర్కొన్నారు. దీంతో అన్ని ట్యాక్స్‌లు కలిపి మొత్తం బిల్లు రూ.3,262కు చేరింది. ఈ బిల్లును ఆ కస్టమర్ నెట్టింట పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ బిల్లులో ఆవు సెస్ అని స్పెషల్‌గా పేర్కొనడంపై కస్టమర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. దీని వెనుక ఉన్న లాజిక్‌ను ప్రశ్నించారు.కొత్తగా ఈ ఆవు పన్ను ఏంటి? ఇదెప్పటి నుంచి వేస్తున్నారు?” అని అనుకుంటూ.. ఆ బిల్లును సోషల్ మీడియాలో పెట్టాడు. “ఇది రాజస్థాన్, జోధ్‌పూర్‌లో లిక్కర్ బిల్: 20% ఆవు సెస్” అని పోస్ట్ చేశాడు. అంతే.. ఆ పోస్టును లక్షల మంది చూశారు. కామెంట్ల వరద మొదలైంది. చాలా మంది పియాష్ రాయ్‌కి సపోర్టుగా కామెంట్స్ రాస్తున్నారు.

అయితే.. ఈ వ్యవహారంపై స్పందించిన బార్ యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు ఈ సెస్ కొత్తది కాదని స్పష్టం చేశారు. తాము 2018 నుంచి మద్యం విక్రయాలపై ఈ ఆవు సెస్‌ను వసూలు చేస్తున్నామని.. పార్క్‌ ప్లాజా హోటల్ మేనేజర్ నిఖిల్ ప్రేమ్ తేల్చి చెప్పారు. వసూలు చేసిన ఆ మొత్తాన్ని గోవుల సంరక్షణ, వాటి పోషణ కోసం ప్రభుత్వ పోర్టల్స్‌లో క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు వివరించారు. మేము వ్యాట్ వసూలు చేసినప్పుడల్లా.. ఆ వ్యాట్‌పై 20 శాతం ఆవు సెస్‌ను వసూలు చేస్తామని తెలిపారు. ఇది దాదాపు 24 శాతం అవుతుందని తెలిపారు. ఈ ఆవు సెస్ కేవలం బీర్, లిక్కర్‌కు మాత్రమే వర్తిస్తుందని.. చాలా బార్లలో దీన్ని సర్ ఛార్జ్ అని చెబుతారని.. కానీ తాము మాత్రం స్పష్టంగా ఆవు సెస్ అని వెల్లడించారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ మాత్రమే ఉంటుందని.. అయితే మద్యం విక్రయాలపై మాత్రమే వ్యాట్, సెస్ ఉంటాయని తెలిపారు.

ఈ వ్యవహారంపై రాజస్థాన్ ఆర్థిక శాఖ కార్యదర్శి కుమార్ పాల్ గౌతమ్ మరింత స్పష్టతనిచ్చారు. కస్టమర్ టేబుల్ వద్ద లిక్కర్ ఆర్డర్ చేసినప్పుడు.. దాని ధర సాధారణంగా ఎంఆర్‌పీ కంటే ఎక్కువగా ఉంటుందని.. ఈ విధంగా ధర పెంచడాన్ని వ్యాట్‌గా పరిగణిస్తారని తెలిపారు. ఎప్పుడైతే ఒక బిల్లుపై వ్యాట్ వసూలు చేస్తారో.. అప్పుడు దానిపై సెస్ కూడా వసూలు చేయాలని వెల్లడించారు. రాజస్థాన్‌లో ఈ సర్ ఛార్జ్‌ను ఆవు సెస్‌గా పిలుస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. 2018 జూన్ 22వ తేదీన అప్పటి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే నేతృత్వంలోని ప్రభుత్వం.. ఈ 20 శాతం సర్ ఛార్జ్‌ను విదేశీ మద్యం, మన దేశంలో తయారైన విదేశీ మద్యం, దేశీయ మద్యం, బీరు విక్రయాలపై విధిస్తున్నట్లు తెలిపింది. గోశాలలకు మద్దతు ఇవ్వడం, గోవుల సంరక్షణను ప్రోత్సహించడం కోసం ఈ ఆవు సెస్‌ ద్వారా వసూలు చేసిన నిధులను ఒక ఫండ్‌లో జమ చేస్తారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ఆవు సెస్‌ను కొనసాగించింది.

ఇక నెటిజన్లు ఈ పన్ను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “రాజస్థాన్‌లో లిక్కర్‌పై 20% ఆవు సెస్ అంటే ప్రభుత్వం.. ప్రతి డ్రింక‌ర్‌ దగ్గరా బలవంతంగా డబ్బు తీసుకొని.. ఆవు రాజకీయాలకు పాల్పడటమే అని విజయ్ పూనీత్ అనే యూజర్ ఫైర్ అయ్యారు. “ప్రభుత్వం నిజంగానే ఆవుల్ని కాపాడితే, సరే అనుకోవచ్చు. కానీ.. ఈ పన్ను విధానమే సరిగా లేదు. అసలు ఈ డబ్బు ప్రభుత్వానికి వెళ్తోందా? దీన్ని ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా” అని మరో యూజర్ ప్రశ్నించారు.ఆవు సంరక్షణకు సపోర్ట్ చేస్తాను కానీ, ఇప్పటికే టాక్స్‌లు ఉన్నాయి కదా? ప్రతి కారణానికీ కొత్త సెస్‌లు పెడితే ఎలా” అని నితిన్ కౌశిక్ అనే యూజర్ ప్రశ్నించారు. “ఈ సెస్ రాజకీయ నేతలకు మనీ సమకూర్చడానికే. ఇదంతా పార్టీల ఇన్‌సైడర్లకు వెళ్తుం. ఆవుల షెల్టర్లలో ఏ పనీ జరగదు” అని మరో యూజర్ ఆరోపించారు. “పబ్లిక్‌ను మొదట మూర్ఖులుగా చేసి, తర్వాత ఆవులుగా మారుస్తున్నారు” అని రాజేంద్ర కౌశిక్ అనే యూజర్ విమర్శించారు.

ఈ సెస్ 2018 నుంచి ఉందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. హోటల్ మేనేజర్ నికిల్ ప్రేమ్ దీనిపై స్పందించారు. “ఈ ప్రభుత్వ నోటిఫికేషన్ 2018 నుంచి ఉంది. VATపై 20శాతం ఆవు సెస్ చెల్లిస్తాం. బీర్, లిక్కర్‌కు మాత్రమే విధిస్తున్నాం. చాలా హోటల్స్ దీన్ని సర్‌ఛార్జ్ అటాయి. మేము ఆవు సెస్ అని చెప్తున్నాం. ఈ పన్ను డబ్బును.. ప్రభుత్వ పోర్టల్స్‌లో ఆవు సంరక్షణ, ప్రచార సెస్‌గా డిపాజిట్ చేస్తాం” అని వివరించారు. Rajasthan Beer Debate.

రాజస్థాన్, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఆవుల సంరక్షణ, రక్షణ కోసం ప్రత్యేకంగా విధిస్తున్న పన్ను ఇది. ఈ డబ్బుతో గోశాలల నిర్మాణం, వెటర్నరీ కేర్, ఆవులకు ఆహారం, మౌలిక సదుపాయాల కోసం వాడతారు. 2018లో వసుంధరా రాజే ప్రభుత్వం రాజస్థాన్ వాల్యూ అడెడ్ టాక్స్ యాక్ట్, 2003 కింద 10% ఆవు పన్నును ప్రవేశపెట్టి, తర్వాత దాన్ని 20 శాతానికి పెంచింది. ఫారెన్, ఇండియన్ మేడ్, కంట్రీ లిక్కర్, బీర్‌పై దీన్ని విధిస్తారు. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగించింది. ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వం గోవుల గ్రాంట్లు, సబ్సిడీల కోసం ఏటా రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఇందులో రూ.600 కోట్లకు పైగా గోశాలల నిర్వహణకు వెళ్తాయి. అయితే ఈ మొత్తం ఆవు సెస్ ద్వారా మాత్రమే కాకుండా.. ప్రభుత్వ గ్రాంట్లు, కేటాయింపుల ద్వారా కూడా భర్తీ అవుతోందని రాజస్థాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.