ఏలియన్స్.!

Siberia Stone Soldier: అంతరిక్షం ఎప్పుడూ ఆసక్తికరమే.ఆది అంతం లేని అంతరిక్షంలో భూమిమీద మనిషికి తోడుగా మరో గ్రహం జీవం ఉందా అనేది ఊహలు అపోహలు కుతూహలుగానే మిగిలిపోయింది. అయితే మొన్న మధ్య ఒక వార్త కొంచెం సంచలనం సృష్టించింది.రష్యా వాళ్లు ఒక యుఎఫ్ ఓ పైకి మిసైల్ ని ప్రయోగించారనేది ఆ వార్త సారాంశం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కు చెందిన కొన్ని రహస్య పత్రాలు చెప్పిన సమాచారం ఇది. వాళ్ళ అధికారిక వెబ్సైట్ లో అందుకు సంబంధించిన వివరాలు పత్రాలు కూడా ఉండడంతో ఈ సమాచారం నిజమేనని నకలీ వార్తలు కావని నమ్మడానికి బలం చేకూరింది. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే సదరు సంఘటన ఇప్పటిది కాదట. ప్రచన్న యుద్ధం కాలంలో రష్యా సైన్యం యుద్ధం సన్నాహకాళ్ఠు గస్తీ తిరుగుతుండగా వాళ్ళకి ఎదురైన కొందరు గ్రహాంతరవాసులతో తలపడినప్పుడు జరిగిన సంఘటనగా చెప్తున్నారు. ఇక ఈ సంఘటన జరిగింది 1989వ సంవత్సరంలో అయితే సదరు వార్త వైరల్ అయ్యింది మాత్రం 2000వ సంవత్సరంలో. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన అధికారిక వెబ్సైట్ లో ఈ వార్తను ఉంచింది. సీఐఏ తాను సంపాదించిన 250 పుట్టల రహస్య సమాచార పత్రాల్లో సైబీరియాలోని ఒక ప్రాంతంలో సైనిక బృందం పై దాడి చేసిన గుర్తు తెలియని అంతరిక్ష వాహకం గురించిన సమాచారం ఉందని చెప్పింది.

ప్రచన్న యుద్ధ కాలంలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది సోవియట్ సైనికుల పటారానికి అరుదైన సంఘటన ఎదురైంది. అమెరికా సోవియట్ యూనియన్లు ఎప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో తలపడతాయో తెలియదు కనుక ప్రతిక్షణం అలర్ట్ గానే ఉండాల్సిన పరిస్థితుల్లో సోవియట్ సైనికులు తమ యుద్ధ సామాగ్రిని సరిచేసుకుంటున్నారు. ఆ సమయానికి వాళ్ళు చూస్తుండగానే ఆకాశం నుంచి వచ్చిన పళ్లెం ఆకారంలోని ఒక వస్తువు తమ స్థావరానికి సమీపంలో కొంచెం హైట్ లో ఎగరసాగింది. అటువంటి ఎగిరే వాహనాన్ని వాళ్ళు ఇంతకుముందెప్పుడు చూడలేదు. అంతేకాకుండా ఆ ప్రాంతం ఫ్లయింగ్ జోన్ కూడా కాదు అది. కాబట్టి అది శ్రువుల వాహక నౌక అయి ఉండాలనుకున్నారు. తమ క్షిపణి వాహనాన్ని సిద్ధం చేసి ఆ అపరిచిత వస్తువు వైపు గురిపెట్టారు. నేలను మించి గాలిలోని లక్ష్యాలను చేదించే తమ క్షిపని ఆ వింత వాహనం పైకి ప్రయోగించారు.

దీంతో ఆ క్షిపణి నేరుగా దాన్ని ఢీ కొట్టడంతో అది కూలి పడిపోవయింది. ఇక అందులో ఎవరైనా ఉంటే బ్రతికుండే ఛాన్సే లేదని కూడా వాళ్ళు అనుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఆ వస్తువు కూలిన ప్రదేశానికి వెళ్ళగా అందులో ఎవరో సజీవంగా ఉన్నట్టు వారికి అనిపించింది. అయితే కోల్డ్ వార్ సమయంలో శత్రు దేశపు వ్యక్తులు సజీవంగా దక్కడం అంటే అది ఒక విజయోత్సవమే వారికి. అయితే వాళ్ళ ఉత్సాహం పై నీళ్లు చల్లుతూ ఆ వాహనంలో నుంచి ఐద మానవ ఆకారం మాదిరి జీవులు బయటకు వచ్చాయి. అతి తక్కువ ఎత్తు పెద్ద తలకాయలు చిక్కని చీకటి లాంటి కళ్ళు కలిగిన జీవులుగా వాటిని గుర్తించారు. సోవియట్ సైనికులు చూస్తుండగానే ఆ ఐదుగురు కలిసిపోయి ఒకే సర్కిల్ గా మారిపోయారు. ఆ ఆకారం చాలా విచిత్రమైన శబ్ధాలను చేయసాగింది. ఇక ఆ ఆకారం నుంచి తీవ్రమైన వెలుతురు కూడా వచ్చింది. ఆ కాంతి ఆ శబ్ద తీవ్రత క్షణక్షణానికి ఎక్కువ అవుతుంది.

దీంతో సైనికులు ఆ తీవ్రమైన కాంతిని చూడలేక ఆ సౌండును వినలేక చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు అలా ఇబ్బంది పడుతూ ఉండగానే ఆ వెలుతురు ముద్ధ ఒక్కసారిగా పేలిపోయి ఆ ప్లేస్ వెలుతురు చల్లా చెదరయ్యింది. ఆ 25 మంది సైనికుల బృందంలో 23 మంది అప్పటికే ఆ వెలుతురుకు సమీపంగా వెళ్ళి పోయారు. ఇక మిగిలిన ఇద్దరు మాత్రం వారికి దూరంగా వెనుకడుగు వేస్తూ వచ్చారు. ఆ వెలుతురు ముద్ధ పేలిపోయి కాంతి పరుచుకున్న దృశ్యాన్ని కళ్ళతో చూడలేక దూరంగా ఉన్న సైనికులిద్దరు తమ కళ్ళను గట్టాగా మూసుకున్నారు. ఇక కాసేపటికి ఆ వెలుతురు మాయమైనట్లుగా ఊహించుకోని కళ్ళు తెరిచి చూడగా తమకంటే ముందుగా ఉన్న 23 మంది సైనికులు వారికి కనిపించలేదు. అంటే మాయమైపోయారా అంట కాదు ఆ 23 మంది ఉన్న చోటనే శిలా విగ్రహాల్లా మారిపోయారు.

తర్వాత ఆ వెలుతురు ముద్ద విస్పోటనం చెందడానికి ముందు వాళ్ళు ఏ భంగిమలో ఉన్నారో అలాగే బొమ్మల్లా నిలుచుండిపోయారు. ఇక అంతకుముందు అన్నీ కలిసిపోయి ఒకే వెలుతురు ముద్దగా మారిపోయిన ఆ ఐదుగురు మానవుల ఆకారాల రూపంలో ఇప్పుడు అక్కడ లేవు. కాసేపటికి తెలివి తెచ్చుకున్న ఆ ఇద్దరు సైనికులు ఇక తమ అధికారులకు సమాచారం అందజేశారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎవరైనా ఇది వట్టి బూటకమని కట్టు కదా అని భావిస్తారు. అయితే తమ సైనికులు తమతోనే వేళాకోలం ఆడారు కనుక వాళ్ళ స్వరంలో ఏదో ఆందోళన ధ్వనించింది కనుక సైనికాధికారులు కొందరు ఆ ప్రదేశానికి వచ్చారు. సోవియట్ యూనియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన కొమితేత్ గుదిదాస్ వెన్యూ బెజోపాస్ట్నోస్టి అనగా కేజీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి బొమ్మల్లా బిగిసుకుపోయిన ఆ 23 మంది సైనికుల్ని కాలి కూలిన ఆ అంతరిక్ష వస్తువు సిధిలాల్ని మాస్కోలోని ఓ రహస్య ప్రదేశంలోని పరిశోధన కోసం తీసుకువెళ్లారు.

ఇక ఆ తర్వాత 1991లో ఉక్రైన్ బెలారూస్ తో సహా పలు ప్రాంతాలు బెలోవేజ్ అకార్డ్స్ ఒప్పందంతో ప్రత్యేక దేశాలుగా ప్రకటించుకున్నాయి. ఫలితంగా USSR ముక్కలైంది. 1991 డిసెంబర్ 31 రోజు రష్యా ఉక్రైన్, బెలారూస్, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్, జార్జియా, అజర్బైజాన్, లితివేనియా, మెల్దువా, లాట్వియా, కర్గిస్తాన్, తజికిస్తాన్, అర్మేనియా, తుర్కెనిమిస్తాన్, ఈస్టోనియా అనే 15 దేశాలుగా ఏర్పాటు రాజ్యాలు ఏర్పడ్డాయి. యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ వేరు వేరు దేశాలుగా విడిపోగానే కేజీబీ కూడా కనుమరుగైపోయింది. అందులో పనిచేసిన సీక్రెట్ సర్వీస్ అధికారులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. అలా 1989లో సైబీరియాలో సోవియట్ సైనికుల పాలిట జరిగిన వింత సంఘటన తాలుకు ఫైల్స్ అమెరికా సీఐఏ చేతికి వచ్చి చేరింది. ఇక వాటిలోని ఒక పత్రమే 2000వ సంవత్సరంలో సీఐఏ అధికారిక వెబ్సైట్ లో ప్రత్యక్షమైంది. సీఐఏ విడుదల చేసింది కనుక అందులో సంఘటన వాస్తవంగా జరిగిందని చాలా మంది భావించారు. అంటే కొందరు అనుమానించారనే కదా అర్ధం. సీఐఏ పనికట్టుకుని ఇలాంటి అపనమ్మకాలని ప్రచారం చేయాలా అని భావించిన వాళ్ళు తమ పరిశోధనలని కొనసాగించారు. Siberia Stone Soldier.

ఈ వార్తలు చక్కర్లుకొట్టడంతో సీఐఏ అధికారులు ఏమన్నారో అని చూస్తే మైక్ బేకర్ అనే అధికారి ఫాక్స్ దీని పై క్లారిటీ ఇచ్చారు. సీఐఏ నిజంగానే ఏదైనా కనిపెడితే ఈ విధంగా అందరికీ తెలిసేలా మాత్రం బహిర్గతం పరిచేందుకు గల అవకాశం చాలా తక్కువ. పైగా సదరు పత్రంలో సీఐఏ అభిప్రాయం కానీ తాను కనుక్కున్న విషయాలను కానీ తెలపలేదని చెప్పారు. అంటే ఏలియన్స్ వెహికల్ ను పేల్చినట్లు 23 మంది సైనికులు బొమ్మల్లా మారిపోయినట్లు వారిపై టెస్ట్ లు నిర్వహించిన 250 పుట్ట రహస్య సమాచారం తమ వద్ద ఉన్నట్టు చెప్పుకొచ్చిన సీఐఏ కబుర్లు ఉత్తవే అని దీన్ని బట్టి తేలిపోయింది.