
North Sentinel Island: ప్రపంచంలో ఎన్నో రహస్యాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. అందులో కొన్ని ప్రదేశాలు మాత్రం మనిషి ఇప్పటివరకు పూర్తిగా అన్వేషించలేని చాలా డేంజరస్ ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. సహజ విపత్తులు, క్రూరమైన గిరిజన తెగలు, దూరమైన అడవులు, కఠినమైన వాతావరణం వంటి కారణాలతో ఆ ప్రదేశాలు మనిషి అడుగులకు అందకుండా ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశంలోని ఒక ప్రదేశం కూడా ఉంది. అది నార్త్ సెంటినల్ ద్వీపం. ఇలాంటి ఐదు భయంకరమైన, మర్మమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.
భారత దేశంలోని ఓ రహస్య ప్రాంతం గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ దివుల్లోకి అడుగు పెడితే ఇక చావే. అయితే అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రయాణాలు నిషేధించింది. భారతదేశంలో మృత్యుదీవిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే సెంటినల్ ద్వీపం. 2018 వరకు చాలా మంది ప్రజలకు దీని గురించి తెలియదు. కానీ అమెరికాకు చెందిన మతబోధకుడు జాన్ ఎలన్చౌ అనే వ్యక్తి సెంటినల్ ద్వీపానికి వెళ్లి అక్కడి ప్రజలకు మతబోధ చేయాలి అని భావించాడు. అయితే అనూహ్య రీతిలో సెంటినలీస్ తెగ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ ఘటనతో సెంటినల్ ద్వీపం గురించి వెలుగులోకి వచ్చింది.
ప్రపంచానికి దూరంగా ఉండే ఈ ద్వీపం ఇక్కడ నివసించే జనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ సెంటినల్ ద్వీపం వార్తల్లోకి ఎక్కింది. అండమాన్ దీవుల్లోని నిషేధిత ప్రాంతం సెంటినల్ దీవుల్లోకి తాజాగా ఓ అమెరికా జాతీయుడు ప్రవేఇంచి అక్కడ వీడియోలు తీయడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు అమెరికా పౌరుడిని అరెస్ట్ చేశారు. దాంతో మరోసారి సెంటినల్ దీవులు వార్తల్లో నిలిచాయి. హిందు మహాసముద్రం మధ్యలో ఉన్న సెంటినల్ దీవి బయట ప్రపంచంతో సబంధం లేకుండా విసిరివేయబడినట్లుగా ఉంటుంది. ఇక్కడ సెంటినల్స్ తెగకు చెందిన వారు నివసిస్తున్నారు. వీరు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.
దీవిలో వీరు మహా అయితే 50 నుండి 100 మంది ఉంటారు అని తెలుస్తోంది. ఇక సెంటినెల్స్ ఆఫ్రీకా నుండి వలస వచ్చిన తొలి మానవుల జాతికి చెందిన వారుగా భావిస్తున్నారు. సెంటినెల్స్ అతి పురాతనమైన తెగల్లో ఒకటి భారత ప్రభుత్వం ఈ ద్వీపానికి అన్ని రకాల ప్రయాణాలను నిషేధించింది. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్ళడానికి లేకుండా రూల్స్ పెట్టింది. సెంట్నలీస్ ప్రజలు సుమారు 60 వేల సంవత్సరాలకు పైగా ఒంటరిగా జీవిస్తున్నారు. విల్లు బాణాలతో వచ్చే సందర్శకుల భార్య నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. పరిశోధకులు ప్రభుత్వ అధికారులు సాహసోపేత అన్వేషకులు ఎవరైనా ఈ ద్వీపానికి వెళదాము అని ప్రయత్నిస్తే వారికి చేదు అనుభవాలను ఫేస్ చేస్తున్నారు. సెంటినలీస్ తెగవారు వేల సంవత్సరాలుగా బయటి వ్యక్తుల నుంచి ద్వీపాన్ని కాపాడుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. 1896 లో బీచ్లో కొట్టుకుపోయి తప్పించుకున్న భారతీయ ఖైదీని ఈ తెగవారు హత్య చేశారు. 1974లో సెంటినల్స్ మీద పరిశోధన చేయడానికి వచ్చిన నేషనల్ జియోగ్రాఫిక్ చిత్రబృందం పై వారు బాణాలు వేసి దాడి చేశారు. 2004 హిందూ మహాసముద్రంలో సునామి వచ్చిన తర్వాత ఈ తెగవారు స్థితిగతులను అంచనా వేయడానికి పంపించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ పై బాణాలతో దాడి చేశారు. వారు తమ ఉనికిని బయటి ప్రపంచానికి వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు.
ఇక వాలే డో జావారీఅమెజాన్ అరణ్యంలో 33,000 చ.మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రదేశం ఆస్ట్రియా దేశం అంత పెద్దది. ఇక్కడ సుమారు 19 గిరిజన తెగలు నివసిస్తున్నాయి. వీరు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటారు. ఎవరైనా ప్రవేశించే ప్రయత్నం చేస్తే చంపేస్తారు. దట్టమైన అరణ్యాలు, నదులు కారణంగా ఇక్కడికి చేరడం దాదాపు అసాధ్యం. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని చట్టపరంగా నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది.
శాండీ ఐలాండ్ ఇది ఒకప్పుడు ఆస్ట్రేలియా, న్యూ కాలెడోనియా మధ్య ఉన్న ద్వీపంగా పటాల్లో కనిపించేది. కానీ 2012లో పరిశోధకులు అక్కడికి వెళ్లినప్పుడు ఏదీ కనుగొనలేదు. కొందరంటూ ఇది మ్యాప్ పొరపాటు అని, మరికొందరంటూ సముద్రపు ప్రవాహాల కారణంగా ద్వీపం మునిగిపోయిందని చెబుతున్నారు. గూగుల్ మ్యాప్స్‌లో ఇది ఇప్పుడు ఫాంటమ్ ఐలాండ్ గా చూపబడుతోంది.
ఇక పటగోనియా… ఇది దక్షిణ ధృవానికి సమీపంలో ఉన్న ఈ విస్తారమైన భూభాగం మంచుతో కప్పబడి ఉంటుంది. హిమనదులు, అడవులు, తుపానులు ఇక్కడ సాధారణమే. తీవ్రమైన వాతావరణం, దూరమైన ప్రదేశం కావడంతో ఇక్కడి భౌగోళిక వివరాలు ఇప్పటికీ పూర్తిగా అందుబాటులో లేవు. అనూహ్యమైన మంచు తుఫానులు, కఠినమైన పరిసరాలు కారణంగా ఇది ప్రపంచంలో అత్యంత అన్వేషించని ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.
నార్తర్న్ ఫారెస్ట్ కంప్లెక్స్ (మయన్మార్)మయన్మార్‌లోని ఈ ప్రాచీన అరణ్యం అరుదైన వన్యప్రాణుల నివాస స్థలం. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, రోడ్లు లేకపోవడం, వన నాశనం వేగంగా పెరగడం వల్ల శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతానికి చేరలేరు. ఆర్థిక పరిమితులు, సాంకేతిక లోపాలు కారణంగా ఈ అడవులు మానవ జోక్యం లేకుండా ఇప్పటికీ సహజ స్థితిలోనే ఉన్నాయి. North Sentinel Island.
నార్త్ సెంటినల్ ద్వీపం ..ఇది అండమాన్ ద్వీప సమూహంలో భాగమైన ఈ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడ సెంటినెల్స్ తెగ నివసిస్తోంది. ఈ తెగ సుమారు 60,000 సంవత్సరాలుగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా జీవిస్తోంది. ఎవరైనా సమీపించాలంటే వారు బాణాలు, కత్తులతో దాడి చేస్తారు. అందుకే భారత ప్రభుత్వం ఈ ద్వీపం చుట్టూ 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రవేశ నిషేధ ప్రాంతంగా ప్రకటించింది. 2018లో ఒక అమెరికన్ మిషనరీ అక్కడికి వెళ్లి చంపబడ్డ ఘటన తర్వాత ఈ ద్వీపం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.