పాకిస్థాన్‌కు షాక్!

India Russia New Plan: భారత్, రష్యాలు తమ వైమానిక రక్షణ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రెండు దేశాల మధ్య నెక్ట్స్ జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని భారత్ కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దృవీకరించింది.

సో నూతన యుద్ధ విమానాల తయారీ కోసం రష్యాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ ప్రతినిధి తెలిపారు. MIG-21 నుంచి Su-30MKI ఫైటర్ జెట్ల వరకు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉమ్మడి సహకారాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ బంధాన్ని కొత్త రంగాలకు, ముఖ్యంగా ఐదో తరం స్టెల్త్ ప్లాట్‌ఫారమ్‌లు వంటి వాటికి విస్తరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్ఏఎల్ అధికారి క్లారిటీ ఇచ్చారు.

రష్యాతో కలిసి పనిచేయడం వారికి చాలా సౌకర్యంగా ఉందని హెచ్ఏఎల్ ప్రతినిధి తెలిపారు. మా వైపు నుంచి ఎటువంటి సమస్య లేదని…. MIG-21, Su-30MKI యుద్ధ విమానాల ఉమ్మడి ఉత్పత్తి ద్వారా ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి.” అని అన్నారు. రష్యా నిపుణులు తమకు చాలా సహాయం చేస్తున్నారని, తాము యాక్టివ్‌గా అనుభవాన్ని పంచుకుంటున్నామని ఆయన తెలిపారు.

భారత వైమానిక దళం తమ యుద్ధ విమానాల ఆధునికీకరణపై సీరియస్‌గా దృష్టి సారించిన సమయంలో ఈ కీలక ముందడుగు పడింది. వైమానిక దళంలో స్క్వాడ్రన్ల కొరత, పెరుగుతున్న ప్రాంతీయ భద్రతా ముప్పు నేపథ్యంలో ఈ భాగస్వామ్యం మరింత కీలకంగా మారింది. కోల్డ్ వార్ సమయంలో భారత్‌కు తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ మిగ్-21తో ఈ భాగస్వామ్యం మొదలైంది. దీనిని రష్యా లైసెన్స్ కింద బెంగళూరు, నాసిక్‌లోని హెచ్ఏఎల్ ప్లాంట్లలో అసెంబ్లింగ్ చేశారు. 1990ల చివర్లో Su-30MKI కార్యక్రమం రూపంలో ఈ సహకారం అభివృద్ధి చెందింది. ఇప్పటివరకు 270 కంటే ఎక్కువ యూనిట్లను తయారు చేశారు. ఇవి భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి. India Russia New Plan.

ప్రస్తుతం హెచ్ఏఎల్ నాసిక్ ప్లాంట్‌లో మరో 15 అదనపు Su-30MKI జెట్లను ఉత్పత్తి చేసేందుకు ఒక ఒప్పందం ఉంది. వీటి డెలివరీ 2026 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వీటిలో ఎయిర్‌ఫ్రేమ్ నుంచి ఇంజిన్ వరకు 60 శాతం కంటే ఎక్కువ భాగాలు ఇండియాలోనే తయారవుతున్నాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకు చాలా ముఖ్యం. అంతేకాకుండా హెచ్ఏఎల్ ఇప్పటికే ఉన్న విమానాలను ‘సూపర్ సుఖోయ్’ అప్‌గ్రేడ్ పేరుతో ఆధునికీరిస్తోంది.