నాగార్జున 100 వ సినిమా టైటిల్ అదేనా?

Nagarjuna 100th movie title: టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున తన 100వ సినిమా ప్రకటన కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘నా సామిరంగ’ తర్వాత నాగార్జున ‘కుబేర’, ‘కూలీ’ వంటి చిత్రాలలో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ రెండు సినిమాల్లో నాగ్ క్యారెక్టర్స్ కొంతమంది అభిమానులను అసంతృప్తికి గురిచేసినప్పటికీ నాగార్జున ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే తత్వం వల్లే ఆయన ఇతర హీరోల కంటే భిన్నంగా కనిపిస్తారు.

సుమారు 30 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న నాగార్జున, తన మైల్‌స్టోన్ మూవీ అయిన 100వ చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

నాగార్జున 100వ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. వాస్తవానికి, ఈ ప్రాజెక్ట్ దసరాకే ప్రారంభం కావాలని అనుకున్నా, అది కార్యరూపం దాల్చలేదు.

దీంతో నిరాశ చెందిన అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చేలా, నిన్ననే (అక్టోబర్ 7) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీలో ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.Nagarjuna 100th movie title

నాగార్జునను అభిమానులు ‘కింగ్’ అని పిలవడం, ఆ టైటిల్ క్యాచీగా ఉండటం వలన, దర్శకుడు కూడా కథకు ఇదే పర్‌ఫెక్ట్ అని భావిస్తున్నారట. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నాగార్జున స్వయంగా తన సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ పై నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఈ చిత్రంలో నాగార్జున ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నారని టాక్. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌లో నాగచైతన్య, అఖిల్ కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి పాత్రలు కథలో కీలకమవుతాయా, లేక కేవలం కామియో రోల్స్ చేస్తారా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ 100వ సినిమా విషయంలో నాగార్జున స్క్రిప్ట్ సహా అన్ని విభాగాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గత మూడు దశాబ్దాలుగా స్టైల్‌కి ఐకాన్‌గా నిలిచిన నాగార్జున, ఈ మైల్‌స్టోన్ మూవీ కోసం కొత్త లుక్‌ను కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, నాగార్జున 100వ చిత్రానికి సంబంధించిన ఈ అప్‌డేట్‌లు అక్కినేని అభిమానుల అంచనాలను భారీగా పెంచుతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందో, ‘కింగ్’ తన వందో సినిమాతో ఏ స్థాయిలో అదరగొడతాడో చూడాలి.