కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ వరకు ” తెలుసు కదా “

Neeraja Kona Interview: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అలానే శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం ” తెలుసు కదా “. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు యూత్ ని ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 17న గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఈ లవ్ స్టోరీ. ఈ సందర్భంగా డైరెక్టర్ నీరజ కోన కొన్ని విషయాలను పంచుకున్నారు.

నీరజ మాట్లాడుతూ “కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ గా మారడానికి ముఖ్య కారణం రైటింగ్ మీద నాకున్న ఇష్టం.ఒక దశలో సినిమాకి కథ రాయగలను అనే నమ్మకం కుదిరింది. అలా రాసుకున్న కథల్లో ఒకటి.. తెలుసు కదా.నాని నాకు చాలా సన్నిహితుడు. నాని నన్ను చాలా సపోర్ట్ చేసేవాడు.దాదాపుగా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను.అదే నా ఎక్స్పీరియన్స్ . పులి మేక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ ని కలిసాను. అప్పుడు ఈ ఐడియా చెప్పాను. ఈ కథకు సిద్దు అయితే బాగుంటుందని ఆయనే చెప్పారు.Neeraja Kona Interview

సిద్ధు కి కథ నచ్చి చేస్తాను అని చెప్పగానే చాలా హ్యాపీగా అనిపించింది. నా జీవితంలో మర్చిపోలేని మూమెంట్ గా గుర్తిండిపోతుంది.ఒక మహిళా డైరెక్టర్ గా కాకుండా ఒక గుడ్ ఫిలిం మేకర్ తీసిన సినిమా అని పేరు తెచ్చుకోవడం నాకు ఇష్టం.సిద్ధు ని టిల్లు ఇమేజ్ నుంచి బయటకి తీసుకురావడానికి ఈ సినిమాలో చేసిన వరుణ్ క్యారెక్టర్ ఉంటుంది.ఒక ఫిలిం మేకర్ గా నేను ఏమి అనుకుంటున్నానో ఆ క్యారెక్టర్ ని వరుణ్ గా సిద్ధులో చూశాను.సిద్దు అద్భుతమైన పెర్ఫార్మర్. గ్రేట్ స్టోరీ టెల్లర్. వరుణ్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేశారు. తన లుక్కు మేనరిజం అన్నిటి పరంగా చాలా స్ట్రాంగ్ ప్రజెన్స్ క్యారెక్టర్ అవుతుంది.

శ్రీనిధి, రాశీ వీళ్ళ ఇద్దరి క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి క్యారక్టర్ కి కూడా ప్రత్యేకత ఉంటుంది.ఈ సినిమా కి తమన్ అందించిన సంగీతం బ్యాక్ బోన్. తమన్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా కి చాలా సపోర్ట్ ఇచ్చారు.” అని చెప్పారు.