Dude Movie Trailer:లవ్ టుడే మరియు డ్రాగన్ లాంటి వరుస హిట్లతో అటు తమిళ ఇండస్ట్రీలో ఇటు తెలుగు ఇండస్ట్రీలో యూత్ కి ఫేవరెట్ హీరోగా నిలిచిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన స్టైల్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు.ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.ఈ దీపావళికి హ్యాట్రిక్ హిట్ అందుకోవడం కోసం ప్రదీప్ సిద్ధం అయిపోయారు.ప్రదీప్ రంగనాధం సరసన ప్రేమలు ఫేమ్ మమిత బైజు మరియు నేహా శెట్టి హీరోయిన్లుగా నటించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు మూవీ టీమ్.

ట్రైలర్ లో ప్రదీప్, మమతా బైజు, నేహా శెట్టి కాంబినేషన్ యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ చూస్తే ఒక స్టైల్ కనిపిస్తుంది.” డ్యూడ్ ” లో కూడా తన యాక్టింగ్ స్టైల్ కొనసాగిస్తూనే, ఈసారి మాస్ ఎలెమెంట్స్ ని కూడా కలిపి తన నటనతో ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాలో కామెడీ, రొమాన్స్ అలానే యాక్షన్ అన్ని కలిపి ఒక మంచి రోల్ తో రాబోతున్నారు అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.మమిత బైజు కూడా ఒక రెఫ్రెషింగ్ లుక్ అండ్ యాక్టింగ్ తో కనిపిస్తున్నారు.నేహా శెట్టి ట్రైలర్ లో తక్కువ సమయం కనిపించినా కానీ డిఫరెంట్ లుక్ తో ఆకట్టుంది. ట్రైలర్లో లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.Dude Movie Trailer
దర్శకుడు కీర్తిస్వరన్ ప్రతి క్యారెక్టర్ ని కూడా ఎంతో చక్కగా చూపించగలిగారు.నికేత్ బొమ్మి విజువల్స్ మరియు సాయి అభ్యంకర్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ ఎంతో ఉల్లాసంగా వుంది. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ దీపావళికి ఫన్ బ్లాస్ట్ తో ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి “డ్యూడ్” మూవీతో మూవీ టీమ్ సిద్ధం అయిపోయింది.