
Srisailam reservoir Flood Record: శ్రీశైలం డ్యాముకు ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో వరద పోటెత్తింది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి అల్పపీడన కారణంగా వాగులు, వంకలు, పొంగి పొరలి శ్రీశైలం జలాశయానికి రికార్డు స్థాయిలో వరద చేరడంతో ఎప్పుడు లేని విధంగా రికార్డులను నెలకొల్పింది.. శ్రీశైలం జలాశయం నుంచి డ్యామ్ నిర్మాణం తర్వాత ఆల్ టైం రికార్డు వరద నీటిపై మెగా 9టీవీ లో ప్రత్యేక కథనం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా ఉన్న శ్రీశైల జలాశయం ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వరద నీరు రావడంతో ఆల్ టైట్ రికార్డును నమోదు చేసుకుంది. ఈ సీజన్లో 8సార్లు శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి దిగునకు నీటిని విడుదల చేశారు.ఈ సీజన్లో ఎప్పుడు జూన్ నుంచే వరద ప్రవాహము వస్తూ ఉండగా అటువంటిది మే నెలలోనే ముందస్తుగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది.
ఈ సీజన్లో మే నెల నుండి ఇప్పటివరకు 2113.39 టీఎంసీల వరద ప్రవహించింది. ఎప్పుడు లేని విధంగా 1984 శ్రీశైలం డ్యామ్ ను జాతికి అంకితం చేసిన తర్వాత ఇంతటి వరద ఎప్పుడూ లేదు. గతంలో శ్రీశైలం జలాశయానికి 1994-95లో 2022.00టీఎంసీల వరద రాగా ఆ తర్వాత 2022-23లో 2039.87 టీఎంసీల వరద వచ్చింది. అయితే ఈ సీజన్ ఇంకా వరద కొనసాగే పరిస్థితి నెలకొన్నంతో మరో 120 టీఎంసీలు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో కృష్ణా బేసిన్లో ఇప్పటిదాకా 1382 టీఎంసీల వరద నీరు సముద్రంలో వ్యర్థంగా కలిసినట్లుగా నమోదయింది.
శ్రీశైలం జలాశయానికి సంబంధించి 1994-95 సంవత్సరంలో క్రస్ట్ గేట్ల ద్వారా 1378.70 టీఎంసీ లు నమోదు కాగా 1998-99 సంవత్సరం కుగాను 1371.76టీఎంసీ లుగా నమోదు అయ్యింది. ఇక 2022- 23 సంవత్సరంలో 1118.81టీఎంసీ లు వరద నీరు డిశ్చార్జ్ కాగా రికార్డు స్థాయిలో ఈ వార్షిక సంవత్సరం 2025- 26 లో 2113.39 టీఎంసీ ల వరద నీరు దిగునకు విడుదల చేశారు. అయితే నీరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009 వరదల తర్వాత డ్యాం వద్ద ఉన్న 12 ట్రస్ట్ గేట్లలో 10 గేట్లు మాత్రమే గరిష్టంగా 27 అడుగుల ఎత్తుకు ఎత్తి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఈ సారి అల్పపీడన కారణంగా ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి నారాయణపూర్ జూరాల జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలో కూడా వాగులు వంకలు, పొంగి పొరలి ఆ వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. అలాగే తుంగభద్ర నుంచి సుంకేసుల హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల ద్వారా కూడా భారీగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం రావడంతో ఆ నీటిని దిగునకు భారీగానే విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి విడుదలైన వరద నీరు నాగార్జునసాగర్ పులిచింతల విజయవాడ మీదుగా ప్రవహించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో ఈ వరద ప్రవాహం కలిసిపోతుంది.
వరద ప్రవాహం భారీగా దిగునకు విడుదల చేస్తూ ఉంటే శ్రీశైలం జలాశయానికి 2009 వరదల తర్వాత డ్యాం ఎదురుగా ఉన్న ప్లంజ్ పూల్ వద్ద 120 మీటర్ల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. శ్రీశైలం జలాశయం కింద భూగర్భంలోని రాతి శిలాల పొరల. మధ్య దృఢత్వం బలహీన పడినట్లు జియాలజికల బేతామాటిక్ సర్వే ద్వారా వెల్లడించింది. ఇప్పటికే పలుసార్లు సీవ్ డబ్ల్యూ సి ద్వారా కేంద్ర కమిటీలు డ్యాం భద్రత సంబంధించిన నిపుణుల బృందాలు ప్రత్యేక నివేదికలు ప్రభుత్వాలకు అందించాయి. తాజాగా జూలైలో నిర్వహించిన బాథామటిక్ సర్వేలో ఈ అంశం వెల్లడి కావడంతో డ్యామ్ పునాదుల లోతుకు గుంత లోతు మించిపోయినట్టుగా కొంతమంది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో భారీగా వరద ప్రవాహం నమోదు కావడంతో డ్యామ్ పునాదుల వరకు గొయ్యి విస్తరించి డ్యాం పునాదులు కు ప్రమాదం వాటిల్ల ఉచ్చని బలంగా అధికారులు నమ్ముతున్నారు ఈ దిశగా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికను కూడా సమర్పించింది. Srisailam reservoir Flood Record.
ఇక 2009 వరద తరువాత భారీగా వచ్చిన వరద ప్రవాహంతో డ్యాం ముందు బాగాన కొండ చర్యలు ప్లంజ్ పూల్ వద్ద భారీ గొయ్యి, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం జల సమాధి అవ్వడంతో భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే అటువంటి ప్రమాదం తిరిగి పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త పడినప్పటికీ ప్రభుత్వాల అలసత్వమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. డ్యాం భద్రత అత్యవసర పనులు చేయడంలోను మరియు నివేదికల సమర్ఫణ సర్వేల జాప్యము వంటి విషయాలు శ్రీశైలం జలాశయం ప్రమాద బారిన పడడానికి శాపంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన శ్రీశైల జలాశయానికి అత్యవసర నిధులు కేటాయింపుతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తుల పనులు చేసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదను హెచ్చరికలు జారీ చేస్తున్నారు.