రైతులు బీ అలర్ట్..!

E Crop extension: ఖరీఫ్‌ ఈ-క్రాప్‌ నమోదుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. మొదట సెప్టెంబరు 30 వరకే గడువు ఇచ్చింది. అయితే సగం విస్తీర్ణం వివరాలు కూడా నమోదు కాకపోవడం..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఈనెల 25 వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వపరంగా రైతులకు ఇచ్చే రాయితీలు, ఇతర అన్ని విషయాల్లోనూ ఈ క్రాప్‌ నమోదు తప్పనిసరి . గతంలో కేవలం పంటల సాగు విస్తీర్ణాన్ని మాత్రమే ఈ క్రాప్‌ లో నమోదు చేసేవారు. కానీ ఈ ఏడాది నుంచి పంటలు సాగు జరిగినా, లేకపోయినా.. ప్రభుత్వ, బీడు భూములు అయినా , ఒక్క ఫారెస్టు భూమి మినహా సర్వే నంబరు కేటాయించిన అన్నిరకాలను ఈ పంట నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. సేద్యంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యవసాయ రుణాలు తీసుకోవడానికి, యంత్రాల కొనుగోలుకు , ఉత్పత్తుల అమ్మకాలకు ఇలా రకరకాల పథకాలను రైతులకు అందిస్తున్నాయి. అయితే ఈ పథకాల ఫలాలను రైతులు పొందాలంటే కేంద్రం చెప్పిన ఒక పనిని తప్పనిసరిగా చేయాల్సి ఉంది. వ్యవసాయానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు అన్నింటికీ ప్రామాణికమైన …ఈ పంట నమోదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోనూ ఈ పంట నమోదు కార్యక్రమం విస్తృతంగా జరుగుతోంది.

రైతులు తమ పంటపొలాలలో పండించే పంట వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవడమే ఈ పంట నమోదు. కేంద్రం తీసుకువచ్చిన ఈ క్రాప్ బుకింగ్లో వ్యవసాయ అధికారుల ద్వారా రైతులు తాము పండించే పంటలను నమోదు చేయడం ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ముఖ్యంగా దోహదం చేస్తుంది. అంతే కాదు పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా.. ఏదైనా అనుకోని విపత్తులు సంభవించి నష్టపోతే పెట్టుబడి సాయం, బీమా పొందాలన్నా.. ఈ-క్రాప్‌ పోర్టల్‌లో నమోదు కావాల్సిందే. గతంలో సాంకేతిక సమస్యలతో రైతుసేవా కేంద్రాల సిబ్బంది ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఇటువంటివి తలెత్తడకుండా యాప్‌ను నవీకరించడంతో పంట నమోదు సాపీగా సాగిపోతోంది. E Crop extension.

రైతులు తమ పంట వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా e-crop అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా నమోదు చేయించుకోవచ్చు. మొదట సెప్టెంబరు 30 వరకే ఈ పంట నమోదుకు గడువు ఇచ్చింది కేంద్రం. అయితే సగం విస్తీర్ణం వివరాలు కూడా ఇందులో నమోదు కాకపోవడం..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఈనెల 25 వరకు గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం కిసాన్ వంటి పథకాలు రావాలంటే ఈ పంట తప్పనిసరి. ఇది కేవలం పంట నమోదు ప్రక్రియ మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు దోహదపడే వ్యవస్థగా నిలుస్తోంది. డిజిటల్‌ ఈ-పంట నమోదు ఎంత ముఖ్యమో .. ఈకేవైసీ కూడా అంతే అవసరం. పంట నమోదు అయిపోయిందని ఊరుకుని ఈకేవైసీ చేయించుకోకపోతే ఈ-కర్షక్‌ పోర్టల్‌లో రైతుపేరు నమోదు అయ్యే అవకాశం ఉండదు. అంతే కాదు ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన వంటి పథకాల ప్రయోజనాలు పొందలేరు. అలాగే రాష్ట్రం అందించే పలు సంక్షేమ పథకాల నుండి దూరమవుతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల రైతులందరూ వెంటనే ఈ-క్రాప్ , ఈ-కేవైసీల నమోదు ప్రక్రియలను పూర్తి చేసి ప్రభుత్వ సహాయాన్ని పొందాలని కోరుతున్నారు.