కడప జెడ్పిటిసి ఉప ఎన్నికల ఘర్షణ..!

Kadapa ZPTC Election Atmosphere: ఉమ్మడి కడప జిల్లాలో 50 జెడ్పిటిసి స్థానాలకు గాను రెండు జెడ్పిటిసి స్థానాలకి ఈ నెల 12వ తేదీన ఉదయం 7 గంటల నుండి 7 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ సృష్టించి ఎన్నికలు నిర్వహించారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. రెండు ప్రధాన పార్టీలు కబులింపు చర్యలకు పాల్పడుతూ దాడులు ప్రతిదాడులతో పులివెందుల నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం ప్రజలు అడలెత్తిపోయారా. చిన్నపాటి ఎన్నికలలో కోట్లల్లో డబ్బు ఖర్చు చేశారా. రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా జడ్పిటిసి ఉప ఎన్నికలు చూసారా.ఆ రెండు జెడ్పిటిసి స్థానాలని ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు.

ఉమ్మడి కడప జిల్లాలో ఈ నెల 12వ తేదీన రెండు జడ్పిటిసి ఉప ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు పది రోజులు ముందు నుండే రెండు నియోజకవర్గాలలో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం దాడులు ప్రతి దాడులు ఇలా ఎన్నో మరెన్నో చోటు చేసుకున్నాయట. ఓటుకు నోటు కోట్లల్లో డబ్బు ఖర్చు చేయడం ఎవరికి వారే యమునా తీరంలా ప్రవర్తించారట. పోలింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలైనప్పటికీ ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికలలో అటు ప్రతిపక్ష పార్టీ నేతలు ఇటు అధికారపక్ష పార్టీ నేతలు సై అంటే సై అంటూ కాలు దువ్వుకున్నారట. ఎన్నికల జరుగుతున్న సమయంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆ మండలంలోకి ఇతర నియోజకవర్గాలకు చెందిన వ్యక్తులు నేతలు రాకూడదు అని నియమాలు ఉన్నప్పటికీ.

ఏ ఒక్క పార్టీ కూడా ఈ నియమాలు పాటించలేదట. ఎక్కడ చూసినా రెండు పార్టీ నేతలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ రణరంగం సృష్టించారట. చిన్నపాటి ఎలక్షన్ కె ఇంత ఘర్షణ వాతావరణ ఎందుకు సృష్టించాల్సి వచ్చిందనే భావన విశ్లేషకులలో కలుగుతుందట. ఎన్నికలవేళ రెండు ప్రధాన పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అటు ఎన్నికల అధికారులను ఇటు పోలీసు ఉన్నతాధికాలను మూడు చెరువుల నీళ్లు తాపించారట. ఉమ్మడి కడప జిల్లాలో కేవలం రెండు జెడ్పిటిసి స్థానాల కోసం ప్రధాన పార్టీలు ఇంతలా పోటీ పడడంపై పలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయట.

మరోవైపు ఈ నెల 12వ తేదీ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాకమునుపే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని ఇటు టిడిపి నేతలు అరెస్టులు చేస్తూ ఎక్కడే గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కు తావు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ పులివెందుల నియోజకవర్గం లోని జడ్పిటిసి ఓపె ఎన్నికల్లో భాగంగా కొన్ని పోలింగ్ బూతుల సమీపంలో వైసీపీ నేతలు ధమనకాండ సృష్టించారట. మరోవైపు అధికార నేతలు అధికారం అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించారంటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారట. కూటమి నేతలు మాత్రం గత 30 సంవత్సరాల లో ఎంతటి ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరగలేదని గొప్పలు చెప్పుకుంటున్నారట. Kadapa ZPTC Election Atmosphere.

గత వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో కనీసం స్థానిక సంస్థ ఎన్నికలలో నామినేషన్లు కూడా వేయించలేదట అప్పటి ప్రభుత్వం. ప్రజా పాలనలో భాగంగా కూటమి నేతలు అది అసెంబ్లీ ఎన్నికైన స్థానిక సమస్త ఎన్నికైన అర్హులు ఉన్న ప్రతి ఒక్కరూ నామినేషన్లు దాఖలు చేసే విధంగా చర్యలు చేపట్టామంటూ చెప్పుకొస్తున్నారట. అలా లేదు గతాన్ని మనసులో పెట్టుకొని కూటమినేతలు కూడా రణరంగం సృష్టిస్తున్నారనే అపవాది కూడా కూటమి నేతలపై నిన్న జరిగిన ఎన్నికల పర్వంలో కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. గతంలో బంతిని వైసీపీ నేతలు గోడకు కొట్టారు. ఆ బంతి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జెట్ స్పీడ్ లో వచ్చిందంటున్నారు విశ్లేషకులు. మరి ఇంతటి ఘర్షణ వాతావరణం లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో ఎవరికి విజయం వరిస్తుంది అన్నది మరో 24 గంటలు వేచి చూడాల్సిందే..

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/bank-robbery-like-the-cinema-range-rs10-crores-stolen-from-the-hindupur-sbi-bank/