
Ambati Rambabu Comments: ఏపీలో చాలా మంది నేతలు ఉన్నా.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం చెప్పినా అది వైరల్ అవుతుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. తాజాగా ఆయన.. నారా లోకేష్ నెక్ట్స్ సీఎం అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అన్ని పార్టీల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. దీంతో రచ్చ మొదలైంది. అసలు టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు ఏమనుకుంటున్నారు…తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్ మెంట్ పనుల గురించి చర్చిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలిసేలా చేస్తుంది. ఇది కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ సీఎం ఎవరు అనే ప్రశ్న రాగానే.. అన్నీ పార్టీలూ అలర్ట్ అవుతాయి. ఎవరికి వారే తమ అధినేతే అని అంటున్నారు. అంటే.. వైసీపీ.. వైఎస్ జగన్ అంటుంది. జనసేన.. పవన్ కళ్యాణ్ అంటుంది. టీడీపీ చంద్రబాబు అంటుంది. బీజేపీ ఏమీ అనదు. ఎందుకంటే.. ఆ పార్టీకి ఏపీలో ఇంకా ఆ స్థాయిలో మద్దతు లేదని అందరికీ తెలుసు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో జరిగిన ఘటన.. ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అసెంబ్లీలో జరిగిన చర్చ.. అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ వేదికగా సైకో అని.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఆయనను తిట్టిపోస్తున్నారు. అయితే అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం జగన్‌పై.. ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. “బాలకృష్ణ అమాయకుడు. ఆయన్ని చూస్తే జాలేస్తుంది. ఆయనే తెలివైన వాడు అయివుంటే.. సీఎం అయ్యేవాడు. అంత లేదు కాబట్టే.. ఎమ్మెల్యేగా ఉండిపోయాడు” అని చురకలు అంటించారు. “బహుశా చంద్రబాబు సీఎంగా ఉన్నారనీ.. తన అల్లుడు నెక్ట్స్ సీఎం అవుతాడనే ఆలోచనతో బాలకృష్ణ సంతృప్తి చెందుతున్నారేమో” అని అంబటి అనడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై టీడీపీ, జనసేన, వైసీపీలో కూడా చర్చ జరుగుతోంది.
అయితే అంబటి ఇలా అనడం వైసీపీని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే.. నెక్ట్స్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని జగన్ చెబుతున్నారు. అలాంటిది అంబటి.. నెక్ట్స్ నారా లోకేష్ సీఎం అవుతాడని అంటే.. వైసీపీకి అది ఇబ్బందికరమే. ఆయన అన్న కాంటెస్ట్ ఏదైనా కావచ్చు. కానీ ఆ మాట వైసీపీకి సమస్యగా మారిందని చెప్పుకుంటున్నారు.
ఇక మరో వైపు తెలుగు తమ్ముళ్లు ఏంటున్నారు అంటే చంద్రబాబు ఆల్రెడీ సీఎంగా ఉన్నారు. 75 ఏళ్ల ఏజ్‌లో కూడా ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే.. మళ్లీ ఆయనే సీఎంగా ఉన్నా ఆశ్చర్య పోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల నారా లోకేష్ సీఎం అవుతారా అనేది ఆ పార్టీలో ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. దాన్ని అంబటి రాంబాబు పబ్లిక్ గా ఇలా అనేసి ఇరకాటంలో పడ్డారు. Ambati Rambabu Comments.
ఇక .జనసేన నుంచి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక నెక్ట్స్ సీఎం అయ్యేది పవన్ కల్యాణే అని జనసైనికులు ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందని టాక్. కానీ పవన్ కళ్యాణ్ ఏనాటూ అలాంటి దృష్టితో లేరు. సీఎం పీఠం పై ఆయన కన్ను వేయట్లేదు. ఎలాగోలా రాష్ట్రం డెవలప్ అవ్వడమే తన ఉద్ధేశం అని తరచూ చెబుతూ ఉంటారు. మరో 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలి అనే కోరుకుంటున్నారు.