
Bhuma vs Byreddy in Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో కొత్త ఎపిసోడ్ మొదలైంది. ఇద్దరు యువనేతలు ఒకరిపై ఒకరు కౌంటర్లు, సవా ళ్లు విసురుకుంటూ జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఓవైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబ వారసుడిగా ముందుకు వస్తున్న నాయకుడు, మరోవైపు తన ప్రత్యేక యాస, స్టయిల్ తో కేవలం కొద్ది కాలంలోనే ఫాలోయింగ్ సంపాదించిన మరో యువనేత. ప్రస్తుతం వీరిద్దరి మధ్య పొలిటికల్ వార్‌గా నడుస్తోంది. ఇంతకీ ఈ గొడవ ఎక్కడ మొదలైంది. జిల్లా రాజకీయాలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది. వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఇదే క్రమంలో ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ నుంచి భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, ఇప్పుడు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టై జైలో ఉన్నా రు. ఈ క్రమంలో జైల్లో మిథున్ రెడ్డిని పరామర్శించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అదే సమయంలో మంత్రి నారా లోకేష్ మీద తీవ్ర విమర్శలు గుప్పిం చారు. ఎంపీ మిథున్ రెడ్డి భవిష్యత్తులో లోకేష్ కి అడ్డు వస్తారన్న నెపంతో మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఎవడబ్బ సొమ్ము ఖర్చు పెడుతున్నారని విమర్శలు చేశారు. పనిలోపనిగా, గతంలో వైసీపీ పాలన సమయంలో టీడీపీ నేతలు చేసిన విమర్శలు గుర్తు చేశారు సిద్ధార్థరెడ్డి.
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ మీద వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆళ్లగడ్డ యువనేత భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారరు. ఎవడబ్బ సొమ్ము ఖర్చు పెడుతున్నారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అడిగడం విడ్డూరంగా ఉందన్న ఆయన, ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వందల కోట్లు ఎవడి సొమ్ము వృధా చేశారని కౌంటర్ ఇచ్చారు జగత్ విఖ్యాత్ రెడ్డి. Bhuma vs Byreddy in Kurnool.
ఆడదాం ఆంధ్రాలో తన సొంత గ్రామమైన ముచ్చుమర్రిలో వైసిపికి అనుకూలంగా ఉన్నవారు కాకుండా ఇతర వ్యక్తులకు గెలిచినా వెంటనే గొడవ చేసి తన వర్గానికి కప్పు ఇప్పించుకున్న ఘనత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది అంటూ మండిపడ్డారు. మొన్నటి దాకా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రత్యర్థి నేతలు ఎవ్వరూ నేరుగా కామెంట్స్ చేయలేదు. కానీ ఇప్పుడు భూమా వారసుడు ఇస్తున్న కౌంటర్లతో మరోసారి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.