విశాఖకు గూగుల్.!

Google in Visakhapatnam: ఉత్తరాంధ్రలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టేందుకు దిగ్గజ సంస్థ గూగుల్ సిద్ధమైతే రాయలసీమలో మరో ప్రముఖ సంస్థ హిందాల్కో ఐఫోన్ల ఛాసిస్ తయారు చేసేందుకు సై అంటోంది. విశాఖలో 50 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ‘గూగుల్ ’ సిద్ధమై 25 వేల మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చింది. కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ 586 కోట్లతో దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

విశాఖలో మరో ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ అడుగుపెడుతుంది. ఆ సంస్థ సుమారు రూ.50వేల కోట్ల పెట్టుబడులతో ఒక గిగావాట్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద హైపర్ స్కేట్ డేటా సెంటర్ కానుంది. మంత్రి నారా లోకేష్ గత ఏడాది అమెరికా టూర్ లో భాగంగా గూగుల్ సంస్థ ప్రతినిధులన కలిసి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల చేసే అతి పెద్ద కేంద్రానికి విశాఖ వేదిక కానుంది. గూగుల్ ప్రతిపాదన పై కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్ లో పోస్ట్ చేసింది. గూగుల్ ప్రతిపాదన గేమ్ ఛేంజర్ కానుంది. ప్రపంచానికి డిజట్ హబ్ గా దేశానికి గుర్తింపు వస్తదని జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక సమన్వయ సంస్థ ఇన్వస్ట్ ఇండియా పేర్కొన్నది. ఆ సంస్థ చేసిన ట్వీట్ తో ప్రపంచం ఒక్కసారిగా ఏపీ వైపు తిరిగి చూసింది. గూగుల్ క్లౌడ్, సర్చ్, యూట్యూబ్, AI వర్క్ ల పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేందుకు డేటా సెంటర్ ఉపయోగపడనుంది.

పరిశ్రమలు, స్టార్టప్ లు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా AI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అయితే మన దేశానికి చెందిన డేటా ఇక్కడే స్టోర్ అవుతుంది. దీనివల్ల డేటా చౌర్యానికి ఛాన్సే ఉండదు. అంతర్జాతీయ బాన్ విట్ ను పెంచేందుకు మూడు సబ్ మరన్ కేబుల్స్ కు సరిపడా ల్యాండింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసి డేటా సెంటర్ ను అనుసంధానించనుంది. ఇక అటు ముంబైలో గూగుల్ కు చెందిన పియరింగ్ క్యాచిస్ అవైర్లు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్ర మార్గంలో కేబుల్ తీసుకోవడం ఈజీనే. డార్క్ ఫైబర్ ద్వారా తక్కువ ఖర్చుతో తీసుకోవడం సాధ్యమవుతుంది. డేటా సెంటర్ కూలింగ్ కోసం పెద్ద ఎత్తున నీర అవసరం. ఈ ఉద్ధేశంతో విశాఖ సముద్ర తీరాన్ని డేటా సెంటర్ ఏర్పాటు కోసం సంస్థ ఎంపిక చేసింది. ఐటీ రంగంలో వచ్చే రెండు కోట్ల పెట్డుబడుకి ఒకరికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రకారం గూగుల్ సంస్థ పెట్టే పెట్టుబడుల ఆధారంగా సుమారు 25 వేల మందికి దశల వారిగా ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా.

పరోక్షంగా హోటళ్లు, నిర్మాణ రంగం, రవాణా వంటి సేవల ద్వారా మరో 50వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. డేటా సెంటర్ కోసం పునరుద్ధ్ పాదక విద్యుత్ ను వినియోగించాలని సంస్థ నిర్ణయించింది. డేటా సెంటర్ కూలింగ్ నిర్వాణకు ఎక్కువ విద్యుత్ అవసరం. ఆ విద్యుత్ ప్రాజెక్ట్ ల కోసం సుమారు రూ. 20వేల కోట్లను సంస్థ ఖర్చు చేయనుంది. సముద్ర తీరం వెంటా చిన్న ప్రాజెక్టులను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే విద్యుత్ ను భూగర్భ కేబుల్ ద్వారా సంస్థ వినియోగించుకునే అవకాశం ఉంది. అమెరికాలో కొన్ని సంస్థలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉంది.

ఇక ఇదే విషయం పై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే నెలలో విశాఖకు గూగుల్‌ రానుందని సీఎం చంద్రబాబుప్రకటించారు. ఇప్పటికే టీసీఎస్‌ విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు కర్మాగారం త్వరలో ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. ‘రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్లులో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అనంతపురంలోని లేపాక్షి- కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భారీ ఇండస్ట్రియల్‌ హబ్‌గా మారుతుంది. లాజిస్టిక్‌ కార్పొరేషన్‌ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయాలి. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు కానీ, నౌకల తయారీ కేంద్రం కానీ లేదా ఫిషింగ్‌ హార్బర్‌ కానీ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతం ఎకనమిక్‌ హబ్‌గా మారుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘2028 నాటికి మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుంది. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు రాష్ట్రానికి వారసత్వంగా వచ్చాయి. గతంలో సృష్టించిన ఎకో సిస్టం కారణంగా అత్యధిక ఆదాయం గడిస్తోంది. ఏపీలోనూ సుదీర్ఘ తీరప్రాంతం, పోర్ట్ లెడ్ ఎకానమీ ద్వారా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తాం. వచ్చే నెలలోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు. Google in Visakhapatnam.

అల్యూమినియం తయారీ రంగంలో దిగ్గజ సంస్థ హిందాల్ కో ఇండస్ట్రీ లిమిటెడ్ రూ.586 కోట్లతో ఒక అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ క్యూజర్ ప్లాంట్ ను కుప్పంలో ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా అల్యూమినియం ఉత్పత్తులే కాకుండా ఐఫోన్ ల ఛాచిస్ లను తయారు చేయనుంది. ప్రపంచంలో పలు దేశాల్లో సంస్థ వ్యాపారాలు ఉన్నాయి. ఆటో మొబైల్స్, విమానాలు, ప్యాకేజింగ్ ఎలక్ట్రనిక్స్ రంగాలకు అవసరమైన ఉత్పత్తులను సంస్థ అందిస్తుంది. ఈ పరిశ్రమతో ఆపిల్ , గ్లోబల్ సప్లై చేన్లు ఏపీ భాగస్వామ్యం కానుంది. దీని ద్వారా సుమారు 613 ఉద్యోగాలు లభించనున్నాయి. మేకిన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ వంటి కేంద్ర లక్ష్యాలకు అనుగుణంగా కీలకమైన విడి విభాగాలను ఉత్పత్తి చేసే దిశగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఐఫోన్ విడిభాగాలు ఇప్పుడు దేశంలోనే తయారు కానున్నాయి.