
Kurnool District Alur Constituency: ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సఖ్యత కొరవ డిందట.. రెండు వర్గాలుగా విడిపోయి ఎవరికి రాజకీయం వారు చేసుకుంటూ పోతున్నా రట ..ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ ఇక మీదట కొనసాగ డని టిడిపి అధ్యక్షుడు చేసిన ప్రకటనతో ఆ నియోజక వర్గం లో ఇన్చార్జి పోస్టు కోసం గట్టి పోటీ నెలకొందని తెలు స్తోంది… అధికార పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ల మధ్య ఉన్న గొడవలేంటి.. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగు తుందో తెలుసుకో వాలంటే కర్నూలు జిల్లా ఆలూరు వెళ్లాల్సిందే..
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇది.. తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా వీరభద్ర గౌడ్ కొనసాగుతు న్నారు.. అయితే సుపరిపాల నలో తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా ఇటీవల జిల్లా టిడిపి అధ్యక్షుడు తిక్కా రెడ్డి ఆలూరు నియోజకవర్గం లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమా వేశం ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తెలియకుండా ఏలా మీటింగ్ పెడతారని ఆయన అనుచ రులు అధ్యక్షుడు తిక్కారెడ్డిని సభలో ప్రశ్నించారు.. దీంతో ఆ సభ గందరగోళంగా మారింది. జిల్లా అధ్యక్షుడిగా మీటింగ్ పెట్టినప్పుడు మీరు ఎలా నన్ను ప్రశ్నిస్తారని తిక్కా రెడ్డి వీరభద్ర గౌడ్ అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఇన్చార్జిగా వీరభద్ర గౌడ్ ను తొలగిస్తున్నామని ఒక ప్రకటన చేయడంతో ఆలూరు రాజకీ యం వేడెక్కింది..
జిల్లా అధ్యక్షుడు తిక్క రెడ్డి ఇంచార్జ్ ని తొలగి స్తున్నామని ప్రకటన చేయ డంతో ఆలూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిం ది… దీంతో ఇన్చార్జి పోస్టు కోసం కొందరు పోటీపడుతు న్నారు. ఇప్పటివరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వీరభద్ర గౌడ్ ఇన్చార్జిగా కొనసాగుతు న్నారు. టిడిపి రాష్ట్ర మహిళా నాయకు రాలిగా కొనసాగుతున్న వైకుంఠం జ్యోతి ఇన్చార్జి పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టి నట్లు తెలుస్తోంది. వైకుం ఠం జ్యోతికి జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి సపోర్టు ఉందని ఇంచార్జి పదవి ఆమెకి ఇస్తు న్నారు అన్న ప్రచారం ఆలూరు లో జరుగుతోంది. గత కొన్ని నీళ్లు గా బీసీ సామాజిక వర్గాని కి చెందిన వారికి ఇన్చార్జి పదవి స్తున్నారని అనేక సంవ త్సరాలుగా టిడిపిలో కొనసా గుతున్న ఇంచార్జ్ పదవి ఇవ్వడం లేదనే అసంతృప్తి కూడా వారిలో ఉన్నట్లు తెలుస్తోంది… ఇన్నేళ్లకు ఇన్చార్జి మార్పు అంశం తెరమీదికి రావడంతో ఓసి సమాజిక వర్గానికి చెందిన వైకుం ఠం జ్యోతి ఇన్చార్జి పదవి కోసం పోటీ పడుతు న్నారని తెలుస్తోంది.. అయితే ఉన్న పోస్టు చేజారకుండా వీరభద్ర గౌడ్ కూడా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం అందుతోంది.. Kurnool District Alur Constituency.
ఇన్చార్జి తొలగి స్తున్నామని జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రకటన చేసిన తెలు గుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికా రిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికీ వీరభద్ర గౌడ్ ఇన్చార్జి గానే కొనసాగుతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇన్ చార్జి వీరభద్ర గౌడ్ బాధితుల కు అందజేస్తున్నారు. ఏది ఏమైనా ఇన్చార్జి విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగు లు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి కాకుం డా వేరే సామాజిక వర్గానికి ఇన్చార్జి పదవిని ఇస్తే అక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్చార్జి ప్రకటన ఆలస్యం అవుతుందని చర్చ జోరుగా సాగుతోంది..