ఆఫర్.!

Mithun Reddy tour of America ఒక్క మిథున్ రెడ్డికి ప్రధాని మోదీ బిగ్ ఆఫర్ ఇచ్చారు.- బెయిల్ పై ఉన్నా గానీ ఆయనకు ప్రధాని అంత ఇంపార్టెంన్స్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంతకు ఆ ఆఫర్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిథ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. తెలుగుదేశం- జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది.

మొత్తం 16 మంది ఎంపీలు ఉన్న ప్రతినిధుల బృందం ఇది. దీనికి బీజేపీ ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వాన్ని వహిస్తోన్నారు. ఇక ఈనెల 27న న్యూయార్క్‌లో ప్రారంభమయ్యే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 80వ సెషన్‌కు భారత్ తరఫున ఈ ఎంపీల బృందం ప్రాతినిథ్యాన్ని వహించనుంది.

పురంధేశ్వరి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు విష్ణుదత్ శర్మ- ఖజురహో, డాక్టర్ భోళా సింగ్- బులంద్ షెహర్, దిలీప్ సైకియా- దర్రాంగ్ ఉదల్ గురి , సౌమిత్రా ఖాన్- బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్- బీజేపీ), రేఖా శర్మ- హర్యానా (రాజ్యసభ- బీజేపీ), సజ్దా అహ్మద్- ఉలూబేరియా (పశ్చిమ బెంగాల్- తృణమూల్ కాంగ్రెస్), పీ విల్సన్- తమిళనాడు ఉన్నారు.

డాక్టర్ ఇంద్రా హంగ్ సుబ్బా- సిక్కం (సిక్కిం క్రాంతికారి మోర్చా), జొయంత బాసుమతరి- కోక్రాఝర్ (అస్సాం- యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్), సందీప్ కుమార్ పాథక్- పంజాబ్ (రాజ్యసభ- ఆమ్ ఆద్మీ పార్టీ), నిరంజన్ బిషి- ఒడిశా (రాజ్యసభ- బిజూ జనతాదళ్), ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా- బీహార్ (రాజ్యసభ- రాష్ట్రీయ జనతాదళ్), జీకే వాసన్- తమిళనాడు (రాజ్యసభ- తమిళ మానిళ కాంగ్రెస్ మూపనార్), డాక్టర్ టీ సుమతి- చెన్నై సౌత్ (తమిళనాడు- డీఎంకే) చోటు దక్కింది. Mithun Reddy tour of America.

ఈ టీమ్ ఈ నెల చివరివారంలో అమెరికాకు బయలుదేరి వెళ్లనుంది. ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి కార్యక్రమాలు, సైడ్‌లైన్ భేటీలు, దౌత్య చర్చల్లో పాల్గొంటుంది. బెయిల్ పై ఉన్నప్పటికీ- ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ ప్రతినిధి బృందంలో మిథున్ రెడ్డికి చోటు లభించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.