కూటమి నేతల్లో హీట్ పెంచుతున్నా కారణాలు ఏంటీ..?

Srikalahasti Temple Chairman Post: రాష్ట్రంలో దక్షిణ కాశీగా పిలవబడే శ్రీకాళహస్తీశ్వరాలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోందట. బోర్డ్ చైర్మన్ పదవి తమకంటే తమకు ఖాయమని ఎవరికి వారే ప్రచారం చేసుకోవడం ఇప్పుడు కూటమి నేతల్లో హీట్ పెంచుతోందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే తమ పార్టీ పెద్దలతో లాబీయింగ్ మొదలు పెట్టినట్లు సమాచారం.

దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యముంది. రోజు 30 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక రోజు కోటి రూపాయల వరకూ ఆదాయం వస్తుంది. అంతేకాదు, ఈ ఆలయ చైర్మన్ పదవికి పోటీ కూడా అంతే స్థాయిలో ఉంది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్య నాయుడు పేరు ఎక్కువగా వినబడుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆయన పార్టీలో కొనసాగుతున్నారు. దీంతోపాటు పార్టీకి, బొజ్జల కుటుంబానికి ఆయన ఎంతో నమ్మకస్తుడు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక కష్టాలు ఎదుర్కొని నిలబడిన నేత. Srikalahasti Temple Chairman Post.

ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి సిఫారసు చేసిన ఏకైక పేరు ఈయనదే కావడంతో పార్టీ అధిష్టానం ఆయన పేరును ఖరారు చేస్తుందని భావిస్తున్నాయి టిడిపి వర్గాలు . అలాగే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తన వర్గం నుంచీ మాజీ ఎమ్మెల్యే సత్రవాడ మునిరామయ్య కుమారుడు ప్రవీణ్ పేరును అధిష్టానానికి ప్రతిపాదించారట. ఇక బీజేపీ నేత కోలా ఆనంద్ తన కుటుంబసభ్యుల్లో ఒకరికి పాలకమండలి చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు జనసేన నుంచి కోట వినూత భర్త చంద్రబాబు పేరు కూడా అధిష్టానం పరిశీలనలో ఉండేది. అయితే డ్రైవర్ రాయుడి హత్య కేసులో వినూత దంపతులు జైలుకెళ్లడంతో ఇప్పుడు రేసు నుంచి తప్పుకున్నట్లు అయింది. ఇక తిరుపతికి చెందిన ఓ విద్యాసంస్థ అధినేత పేరు కూడా జనసేన తరపున బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

చెంచయ్యనాయుడికి చైర్మన్ పదవి కోసం ఎమ్మెల్యే బోజల సుధీర్ రెడ్డి అధిష్ఠానం దగ్గర పట్టుబడుతున్నట్ల నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. గత ఐదు సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్న ముక్కంటి ఆలయ నిర్వహణను తాను ప్రక్షాళన చేసి చక్కదిద్దానని, ఇపుడు తాను సూచించిన వ్యక్తినే పాలక మండలి చైర్మన్ చేస్తే ఆలయం మరింత అభివృద్ధి అవుతుందని సుధీర్ రెడ్డి అధిష్ఠానంతో చెబుతున్నారట. నేతల సిఫారసుల సంగతి పక్కన పెడితే ఐవీఆర్ఎస్ సర్వేలో వచ్చే ఫలితాలను బట్టే ఛైర్మన్ పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/anil-kumar-yadav-vs-roop-kumar-yadav-are-facing-serious-consequences-in-nellore-city/