పొలిటికల్ పవర్ కు కేరాఫ్ అడ్రస్ ఆ గడ్డ..?!

Dr. Gopireddy Srinivasa Reddy: పొలిటికల్ పవర్ కు కేరాఫ్ అడ్రస్ ఆ గడ్డ. ఇక్కడ ఎవరు గెలిచినా ఓ హైప్ ఉంటుంది. ఆ పార్టీ కేడర్ కు జోష్ పంచుతుంది. అసలు సిసలు రాజకీయానికి చిరునామాగా నిలుస్తుంది. రెండు ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా తల పడతాయి. వ్యక్తులు, వర్గాలే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాంటి గడ్డపై ఇప్పుడు దెబ్బతిన్న పార్టీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. పార్టీకి కాయకల్ప చికిత్స కోసం పొలిటికల్ వైద్యుడిపై భారం వేసింది. మరి..ఆ నిర్ణయం ఆ పార్టీ సీన్ మారుస్తుందా.

రాజకీయ పౌరుషాలకు అడ్డా పల్నాడు. 2014 ముందు, ఆ తర్వాత అన్నట్లుగా పల్నాడు రాజకీయాలు మారాయి. 2014లో నువ్వా నేనా అన్నట్లుగా టీడీపీ, వైసీపీ మధ్య పోరు సాగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ పల్నాడును క్లీన్ స్వీప్ చేసింది. 2024 లో సీన్ రివర్స్ అయింది. టీడీపీ అన్ని సీట్లను ఏకపక్షంగా గెలుచుకుంది. అయినా రెండు పార్టీలు ఇప్పటికీ సై అంటే సై అంటున్నాయి. పల్నాడు వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పటి వరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి చూసేవారు. అయితే పిన్నెల్లి జైలుకు వెళ్లటంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించ లేదు. దీంతో పల్నాడు అధ్యక్ష పగ్గాల కోసం పార్టీలోని పలువురు నేతలు ప్రయత్నాలు చేసారు. Dr. Gopireddy Srinivasa Reddy.

ఇక జగన్ విధేయుడైన నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది అధిష్టానం. నర్సరావుపేటలో వైద్యుడిగా మంచి పేరున్న గోపిరెడ్డి రెండు సార్లు వరుసగా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 2024లో ఓడిపోయారు. మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు గా ఉన్నారు. పార్టీ నిర్ణయంతో పల్నాడు వైసీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఈ నిర్ణయంతో పల్నాడులో వైసీపీ బలోపేతం కావటం ఖాయమనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

గోపిరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపించటంతో పాటుగా ప్రత్యర్థి పార్టీలపై అంశాల వారీగా నిలదీయటంలో నేర్పరి. పార్టీ కేడర్ కోసం ఎలాంటి నిర్ణయాలకు అయినా వెనుకాడని నైజం ఆయన సొంతం. అదే సమయంలో సామాన్య ప్రజల్లోనూ ఆయనకు గుర్తింపుంది. జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో అధినాయకత్వం గోపిరెడ్డిపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించింది. మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయన్న ప్రచారంతో పార్టీ అంచనాలను గోపిరెడ్డి ఏ మేరకు నిజం చేస్తారన్నదీ రానున్న రోజుల్లో తేలనుంది.

Also Read: https://www.mega9tv.com/andhara-pradesh/ap-cm-n-chandrababu-naidu-took-a-45-minute-social-science-class-for-secondary-school/