నూతన ఎస్పీ కి నెల్లూరు సవాల్..!

SP Ajitha Vejendla: నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అజిత వేజెండ్ల కు నెల్లూరు జిల్లాలోని సమస్యలు సవాల్ గా మారాయి.. వారానికి ఒక హత్య..పదిరోజులకు గంజాయి కేసు.. రాష్ట్రాన్నే ఉలిక్కిపడేసిన లేడీ డాన్ కేసు విచ్చల విడిగా గంజాయి దొరకటం.. గన్ కల్చర్.. ఎమ్మెల్యే మర్డర్ కు స్కెచ్ ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే లెక్కలేనని సమస్యలు ఉన్నాయి..

నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా గత సంవత్సరం రోజుల నుంచి జరిగిన క్రైమ్ చూస్తే ఎవరైనా భయపడిపోవాల్సిందే.. తెల్లవారితే ఏ దురవార్త వినాల్సి వస్తుందేమనని… బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా అని జిల్లాలో ఒక టెన్షన్ వాతావరణ నెలకొంది.. యువత గంజాయి వాడకంతో దారితప్పిన విషయం తెలిసిందే..

నెల్లూరు జిల్లా జైలులో దాదాపు 100 మంది రౌడీషీటర్లో రిమాండ్ లో ఉన్నారంటే నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్లే అర్థమవుతుంది.. కేవలం 10.000 కోసం నెల్లూరు నుంచి కిరాయి రౌడీలు ఒంగోలు వెళ్లి హత్య చేసిన విషయం తెలిసిందే.. అంటే నెల్లూరులో రౌడీయిజం ఏ స్థాయికి వెళ్లిపోయిందో తెలుస్తుంది..

నెల్లూరులో ప్రతి ఒక్కరూ జేబులో సెల్ఫోన్ పెట్టుకున్నట్లు కత్తులు పెట్టుకునీ తిరగటం స్టైల్ గా మారింది.. ఎన్నో సందర్భాలలో పోలీసులు వాహన చెకింగ్ చేసే సమయంలో లెక్క లేనన్ని కత్తులు దొరికిన విషయం తెలిసిందే… అంటే నెల్లూరులో క్రైమ్ ఏ విధంగా ఉందో ఇట్లే అర్థమవుతుంది. పోలీసులు కార్డెన్ సెర్చ్.. వెహికల్ సెర్చ్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రైమ్ మాత్రం తగ్గటం లేదు..గత ఎస్పీ బదిలీపై రెండు రోజుల క్రితం జిల్లా వదిలి వెళ్ళిపోతున్న సమయంలో కూడా ఒక హత్య జరిగిందంటే ఇక నెలలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు…

చాలామంది పోలీసులు రౌడీషీటర్లతో గతంలో చట్టా పట్టాలు వేసుకొని తిరగటం వల్ల రౌడీలకు పూర్తిగా భయం పోయిందని ఒక ప్రచారం కూడా జరుగుతుంది.. దానికి తోడు గతంలో రాత్రులు గస్తి నిర్వహించినట్టు ఇప్పుడు నిర్వహించడం లేదని పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఏది ఏమైనా నెల్లూరు జిల్లాకు తొలి మహిళ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అజిత వేజెండ్ల కు నెల్లూరులోని సమస్యలు ఒక పెద్ద సవాల్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో ఏమాత్రం జాలి దయతో ఉంటే నెల్లూరులో రౌడీయిజం మరింత పెట్రేగిపోయే అవకాశాలు ఉన్నాయనీ…. విధులు పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బంది భరతం కూడా పట్టాలని నెల్లూరు జిల్లా ప్రజలు పదే పదే కోరుతున్నారు.. పక్క జిల్లా అయినా తిరుపతిలో సిబ్బంది ఏ మాత్రం విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వెంటనే అక్కడ ఎస్పి సస్పెండ్ పరంపర కొనసాగించడంతో క్రైమ్ రేట్ బాగా తగ్గిన విషయం తెలిసిందే. SP Ajitha Vejendla.

మరి నూతన ఎస్పీ అజిత వేజెండ్ల ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతారో జిల్లాలో భయంకరమైన పరిస్థితులును ఎలా సాధారణమైన పరిస్థితులకు తీసుకొస్తారో వేచి చూడాలి మరి…..