అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై..?

Annamayya District TDP President: అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొందా. పోటా పోటీగా అధ్యక్ష పదవి కోసం అప్లికేషన్లు వస్తున్నాయా. అధ్యక్ష పదవి ఎంపికపై అధిష్టానం తర్జనభర్జన పడుతోందా. అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవిపై త్రీమెన్‌ కమిటీ సీఎంకు నివేదిక అందజేసిందా. వాచ్ దిస్ స్టోరీ.

గత కొంత కాలంగా జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న చమర్తి జగన్మోహన్ రాజుకు ఈమధ్యనే అధిష్టానం రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో జిల్లాకు కొత్త అధ్యక్షుడి అవసరం ఏర్పడింది. దీంతో కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవికోసం రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, మదనపల్లి, పీలేరు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున నేతలు ఆశిస్తున్నారట. అయితే అధిష్టానం మాత్రం అన్నమయ్య జిల్లాలో పార్టీ పటిష్టతను పెంచుతూ, కార్యకర్తలను కలుపుకుపోయే నేత కోసం తర్జన భర్జన పడుతోందట. దీంతో అధ్యక్ష పదవిపై జిల్లాలో ఆసక్తి రేపుతోందట.

ఎంతమంది పోటీ పడినప్పటికీ ప్రధానంగా అధ్యక్షుని రేసులో ఉండేది మాత్రం బలిజ సామజిక వర్గానికి చెందిన సుగవాసి ప్రసాద్ బాబుకు దక్కడం ఖాయంగా కనిపిస్తోందట. మరోవైపు రైల్వే కోడూరు నుంచి కస్తూరి విశ్వనాథ నాయుడు, రాజంపేట నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గత ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్లారు. ఆయన తమ్ముడు సుగవాసి ప్రసాద్‌ బాబు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో ప్రసాద్ బాబుకే జిల్లా అధ్యక్ష పీఠం దక్కుతుంద్న టాక్ జిల్లాలో బలంగా వినిపిస్తోంది.

ఇప్పటికే బలిజలకు ఉమ్మడి కడప జిల్లాలో అన్యాయం జరిగిందని ఆ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. కడప, అన్నమయ్య జిల్లాలలో ఎక్కడో ఒక చోట బలిజ సామజికవర్గం వైపు పార్టీ దృష్టి పెట్టాలని కోరుతున్నాయి. దీంతో అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం బలిజ సామాజికవర్గం నుండి సుగవాసి ప్రసాద్ బాబు, బాలిశెట్టి హరిప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అధిష్టానం మాత్రం పార్టీ కష్టా కాలంలో పార్టీని భుజాన మోసిన వారికే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. Annamayya District TDP President.

ఇప్పటికే అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై అధిష్టానం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లాలో పర్యటించి, నివేదిక కూడా పార్టీ అధిష్టానానికి పంపింది. పదవి కోసం దాదాపు 24 మంది పోటీలో ఉన్నారట. అందరి పేర్లను పరిశీలించిన అధిష్టానం ఇప్పటికే షార్ట్ లిస్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ జాబితాలో ఎవరు ఉన్నారన్నదే జిల్లా నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అటు అధిస్టానం కూడా ఎవరి పేరు ఫైనల్ చేస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q