
Fahad Fazil Ferrari purosangue: సెలబ్రిటీలకు లగ్జరీ జీవితం అంటే ఎంతో ఇష్టం. ఉండే ఇళ్లు, తిరిగే కారు, వేసుకునే బట్టలు, వాడే కార్లు.. ఇలా అన్నీ బ్రాండెడ్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు కార్ల పట్ల ఎంతో ఆసక్తిని కలిగిఉంటారు. వారి గ్యారేజీలో మినిమం మూడు నుంచి పది వరకూ ఖరీదైన కార్లు కనిపించడం సహజమే. లక్షల నుంచి కోట్లు విలువ చేసే లేటెస్ట్ మోడల్ కార్లను సైతం వెంటనే కొనుగోలు చేయడంలో వాళ్లు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో తమ హోదా, వ్యక్తిత్వానికి తగ్గట్లుగా అత్యాధునిక కార్లను ఎంపిక చేసుకుంటారు. తాజాగా ఈ జాబితాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పేరు కూడా చేరిపోయింది.
సౌత్ లో విలక్షణ నటనతో పేరు తెచ్చుకున్న ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం బిజీ హీరోగా దూసుకుపోతున్నారు. పుష్ప సినిమాలో విలన్‌గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఫాహద్, ఇప్పుడు వరుస సినిమాలతో ప్రాజెక్టుల మధ్య పోటీగా మారిపోయారు. పారితోషిక విషయంలోనూ ఆయన డిమాండ్ చాలా ఎక్కువ. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఫాహద్ ఇటీవల ఓ లగ్జరీ స్పోర్ట్స్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు.
ఫెరారీ పురోసాంగ్ అనే మోడల్ కారును ఫాహద్ కొనుగోలు చేశారు. ఇది ఫెరారీ సంస్థ రూపొందించిన తొలి 4-డోర్ ఎస్యూవీ కావడం విశేషం. భారత్‌లో దీని ధర సుమారు రూ. 13 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కారు డిజైన్, పర్ఫామెన్స్ అన్ని విషయంలోనూ ఈ మోడల్ ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఫాహద్ తన కొత్త కారుతో షోరూమ్ ముందు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వైట్ కలర్లో మెరిసిపోతున్న ఈ కారుకు స్టైలిష్ వీల్స్, అద్భుతమైన బాడీ డిజైన్ ఆకర్షణగా నిలిచాయి. అంతే కాకుండా, కార్లో బ్లూ కలర్ సీట్ కవర్స్ మరియు ఫుల్ లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ఇది నాలుగు సీట్లు కలిగిన ఎస్‌యూవీగా ఉండగా, వెనుకవైపు రెండు కెప్టెన్ సీట్లు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఈ కార్ కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ/గంట వేగాన్ని అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ సుమారు 310 కి.మీ/గంట అని చెబుతున్నారు. Fahad Fazil Ferrari purosangue.
ఈ మోడల్ కారు ఇప్పటికే టాలీవుడ్ నటుడు విక్రమ్, వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ వంటి ప్రముఖుల వద్ద ఉంది. మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఈ కారును మొదటిగా కొనుగోలు చేసిన వ్యక్తిగా ఫాహద్ ఫాజిల్ నిలిచారు. ఆయన గ్యారేజ్‌లో ఇప్పటికే ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి జాబితాలో ఇప్పుడు మరో మాస్ లగ్జరీ వాహనం చేరింది. ఈ కొత్త ఫెరారీతో ఫాహద్ ఫాజిల్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q