
Akira Nandan debut movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు..? అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. సరైన సమాధానం బయటకు రాలేదు. ఫ్యాన్స్ అయితే.. పవర్ స్టార్ వారసుడు ఎంట్రీ గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అకిరా నందన్ ఫోటో బయటకు వస్తే చాలు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతుంది. ఇప్పుడు అకిరా ఫస్ట్ మూవీ గురించి మళ్లీ ప్రచారం మొదలైంది. ఈ ఇద్దరిలో ఒకరితో అకిరా సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఆ ఇద్దరు ఎవరు..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వీరమల్లు అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం తెలిసిందే. అయితే.. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో పంచాయితీ చేయాల్సివచ్చిందని.. పంచాయితీ చేస్తేనే కానీ.. సినిమా బయటకు రాలేదనే విషయాన్ని పవర్ స్టార్ చెప్పారు. అలాగే ఈ మూవీ రిలీజ్ టైమ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, సినీ నిర్మాత టీ.జే. విశ్వప్రసాద్ ఎంతగానో సహకరించారని చెప్పారు. మేటర్ ఏంటంటే.. ఏఎం రత్నం గత సినిమాలకు సంబంధించి బకాయిలు ఉండడంతో వాళ్లందరూ వీరమల్లు రిలీజ్ టైమ్ లో పట్టుబట్టడంతో వాటిని విశ్వప్రసాద్ క్లియర్ చేశారని సమాచారం.
వీరమల్లు టైమ్ లో హెల్ప్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో సినిమా చేస్తానని మాట ఇచ్చారని తెలిసింది. అయితే.. పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు అకిరా నందన్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారట విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ కూడా తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో అకిరా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే.. అకిరాతో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్న మరో నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్. ఈ నిర్మాణ సంస్థకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎంత చెబితే అంత. అందుచేత ఈ బ్యానర్ లో కూడా అకిరా మూవీ ఖాయంగా కనిపిస్తోంది. Akira Nandan debut movie.
అయితే.. అకిరా ఫస్ట్ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హారిక అండ్ హాసిని ఈ రెండు నిర్మాణ సంస్థల్లో ఏదో ఒక బ్యానర్ లోఉండడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరో వైపు పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా అకిరాతో సినిమా కోసం ట్రై చేస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎవరి డైరెక్షన్ లో ఉంటుందంటే.. త్రివిక్రమ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. త్రివిక్రమ్ అడిగితే పవన్ కళ్యాణ్ కాదనరు. అందుచేత త్రివిక్రమ్ తో అకిరా సినిమా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఏది ఏమైనా అకిరా ఫస్ట్ మూవీ గురించి క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.