ఆ సినిమాకి సీక్వెల్.. అల్లు అర్జున్ సంచలన నిర్ణయం.!

Allu Arjun’s ‘Sarainodu’ Sequel: టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ట్రెండ్ బాగా హవా చూపిస్తోంది. స్టార్ హీరోలంతా భారీ బడ్జెట్ సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు. ఈ తరహా ప్రాజెక్ట్స్ పూర్తవ్వడానికి మినిమం రెండేళ్ల సమయం పడుతోంది. ఒకపక్క అభిమానులు తమ హీరో మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నందుకు గర్వపడుతున్నారు కానీ.. మరోవైపు ఏటా ఒక సినిమా అయినా థియేటర్లో చూడలేకపోతున్నామన్న అసంతృప్తి కూడా ఉంది.

ఈ గ్యాప్‌ని తగ్గించేందుకు, హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో తెలుగు ప్రేక్షకుల కోసం తక్కువ సమయంలో కంప్లీట్ చేసే సినిమాలు చేయాలన్న అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని ఆలస్యంగా అయినా అల్లు అర్జున్ గమనించినట్లు సమాచారం. ఈ క్రమంలో బన్నీ ఒక పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ చేయాలని ఫిక్సయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తన హిట్ మూవీకి సీక్వెల్ చేయాలనీ డిసైడ్ అయ్యారట.

2016లో బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ‘సరైనోడు’ ఎంతటి హిట్ అయ్యిందో తెలిసిందే. అల్లు అర్జున్ మాస్ అవతారం, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, థమన్ మ్యూజిక్ అన్నింటికీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ కాంబినేషన్ మళ్లీ రావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ కాంబినేషన్ మళ్లీ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఎప్పటికప్పుడు వేరే కమిట్మెంట్లు ఉండటంతో ఇప్పటివరకు ముహూర్తం కుదరలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఎట్టకేలకు బన్నీ – బోయపాటి కాంబోలో మరో ప్రాజెక్ట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ‘సరైనోడు’ కి సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. Allu Arjun’s ‘Sarainodu’ Sequel.

ప్రస్తుతం బన్నీ ‘పుష్ప-2’తో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇది 2027 వేసవిలో విడుదలయ్యే ఛాన్సుంది. అయితే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బోయపాటితో మూవీ చేసే ఆలోచనలో బన్నీ ఉన్నాడట. దీనికి కారణం అల్లు అరవింద్ సూచన అని తెలుస్తోంది.

వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తే హీరో – ప్రేక్షకుల మధ్య కొంత దూరం ఏర్పడుతుంది. అందుకే, పాన్ ఇండియా సినిమాల మధ్యలో టార్గెట్‌గా తెలుగు ఆడియన్స్ కోసం మాస్ సినిమాలు చేయాలి. ఇలాంటి ప్రాజెక్ట్‌కు బోయపాటి డైరెక్షన్ అయితే మరింత బావుంటుందని అరవింద్ చెప్పినట్లు టాక్. దీంతో బన్నీ కూడా ఆలోచనలోకి వచ్చి, అట్లీ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే బోయపాటితో సినిమా మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ఇక బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో ‘అఖండ-2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో విడుదల కావొచ్చు. ఆ తర్వాత వెంటనే ‘సరైనోడు 2’ ప్రాజెక్ట్ పనుల్లోకి దిగనున్నారని టాక్. ఇప్పటికే బోయపాటి కథా రూపరేఖ బన్నీ, అల్లు అరవింద్‌కి వినిపించారని, వాళ్లు చాలామందిని ఆకట్టుకున్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2026 ప్రారంభంలో ‘సరైనోడు 2’ అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం వినిపిస్తోంది.

Join with us: https://whatsapp.com/channel/0029VarK7kPHAdNW7c2XLY2q