ప్రభాస్ ‘ఫౌజీ’ లో మరో స్టార్ హీరో..!

Abhishek Bachchan Prabhas Fauji: రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి . ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికర అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.

అందుతున్న సమాచారం మేరకు.. ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటించబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆ నటుడు ఈ మూవీ ద్వారా తొలిసారిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారని సమాచారం. ఈ హీరో మరెవరో కాదు, బాలీవుడ్‌ స్టార్ అభిషేక్ బచ్చన్ అని టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ ఇప్పటివరకు అనేక చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, వాటిలో ఏ సినిమా ఎప్పుడు విడుదలయ్యే అవకాశముందో మాత్రం స్పష్టత లేదు. కొన్నింటి పనులు ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంటే, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని పోస్టు ప్రొడక్షన్‌లో ఉన్నాయి. దర్శక నిర్మాతలు అప్పుడప్పుడూ కొన్ని విషయాలను బయటపెడతే, అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంటాయి. అలాగే ఇప్పుడు ‘ఫౌజీ’ కి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఈ తాజా న్యూస్‌ భారీ చర్చలకు దారి తీస్తోంది.

‘ఫౌజీ’ మూవీ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే వార్ డ్రామా కావడంతో, అభిషేక్ పాత్ర కూడా అలాంటి కోణంలోనే ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే షూటింగ్‌లో చేరనున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం మేకర్స్ నుంచి రావాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి బాలీవుడ్ స్టార్లు నటిస్తుండగా, అభిషేక్ కూడా చేరితే ఈ సినిమాకి బాలీవుడ్ మార్కెట్‌లోనూ మరింత క్రేజ్ రావడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నాడు. ‘సీతారామం’లో హీరో దుల్కర్ సల్మాన్ ను ఆర్మీ జవాన్‌గా చూపించిన హను రాఘవపూడి, ఈసారి మరింత మాస్ అటిట్యూడ్‌తో ప్రభాస్‌ను ఆర్మీ ఆఫీసర్‌గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మరొకవైపు, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. Abhishek Bachchan Prabhas Fauji.

కల్కి 2898 ఏ.డి. లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన ప్రభాస్.. ఇప్పుడు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో ‘ఫౌజీ’లో స్క్రీన్ షేర్ చేయనున్నారన్న సమాచారం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. త్వరలో ‘రాజాసాబ్’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వచ్చే ఏడాది ‘సలార్ 2’ మరియు ‘కల్కి 2’ వంటి మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి.