సత్యదేవ్ ‘అరేబియా కడలి’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Arabia Kadali టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్ సిరీస్‌ ‘అరేబియా కడలి’. సత్యదేవ్ సరసన ఆనంది హీరోయిన్‌గా నటించారు. సూర్యకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌కు స్టార్‌ దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. దీంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ వివరాలను అమెజాన్‌ పంచుకుంది. ఆగస్టు 8 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది.

తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానున్నట్లు అమెజాన్‌ ప్రైమ్‌ తెలిపింది. ‘కాలానికి అందరూ సమానమే. అందరూ ఒడుదొడుకులను ఎదుర్కోవాల్సిందే’ అంటూ పోస్టర్‌ను పంచుకుంది. రెండు గ్రామాలకు చెందిన కొందరు మత్స్యకారులు అనుకోకుండా బార్డర్‌ క్రాస్‌ చేసి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశిస్తారు. దీంతో వాళ్లను విదేశీ జైల్లో బంధిస్తారు. అక్కడినుంచి వాళ్లు ఎలా బయటకు వచ్చారనే కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది రూపొందింది. 2024లోనే దీని చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఇటీవల ఇదే కథాంశంతో కొన్ని చిత్రాలు రూపొందినప్పటికీ ఈ కథ ఒరిజినల్‌ అని సంస్థ పేర్కొంది. Arabia Kadali