బాహుబలి రీ యూనిన్.. అనుష్క రాకపోవడానికి అసలు కారణం ఇదే!

Anushka Missing in Bahubali Reunion: బాహుబలి ఓ చరిత్ర. ఈ సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. అలాగే ఒకే కథను రెండు పార్టులుగా తీయడం అనే ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసింది. అంతే కాకుండా.. బాహుబలి పార్ట్ 2.. భారతీయ సినిమాకు 1000 కోట్ల కలెక్షన్ అందించిన తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. తెలుగులో రూపొందిన బాహుబలి దేశం మొత్తం ఆకట్టుకుని 1000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంతటి సంచలనం సృష్టించిన బాహుబలి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బాహుబలి టీమ్ కలుసుకున్నారు. ఫోటోలు తీసుకున్నారు.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ఫోటోల్లో అనుష్క ఎక్కడా కనిపించలేదు. మరి.. అనుష్క బాహుబలి రీ యూనిన్ కి రాకపోవడానికి కారణం ఏంటి..?

బాహుబలి సినిమాతో అనుష్కకు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఒకప్పుడు నెంబర్ 1 హీరోయిన్ అంటే అనుష్క పేరు చెప్పేవారు. అయితే.. ఇప్పుడు కాలం మారింది. అనుష్కను తెర పై చూసి చాన్నాళ్లు అయ్యింది. అలాగే ఏ ఈవెంట్ లో అనుష్క చివరిసారిగా కనిపించిందో చెప్పడం కష్టం. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా బాహుబలి రీ యూనిన్ జరిగింది. ఈ రీ యూనిన్ కు అయినా అనుష్క వస్తుంది అనుకుంటే.. ఎక్కడ కనిపించలేదు. ప్రభాస్, రానా, రాజమౌళి ఇలా అందరూ వచ్చారు కానీ.. ముగ్గురు మిస్ అయ్యారు. ఆ ముగ్గురు ఎవరంటే.. అనుష్క, కీరవాణి, తమన్నా.

కీరవాణి అంటే.. ఆయన ఫాదర్ చనిపోయారు కాబట్టి రాలేదు. మరి.. అనుష్క ఎందుకు రాలేదంటే.. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుందని.. ఇప్పుడు బాగా బొద్దుగా తయారైందని.. అలా మీడియా ముందుకు రావడం ఇష్టం లేకనే ఎక్కడకి రావడం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సైజ్ జీరో సినిమా కోసం లావుగా తయారైంది. ఆ సినిమా తర్వాత నుంచి స్లిమ్ గా అవ్వాలని ట్రై చేసింది కానీ.. ఏ ప్రయత్నమూ ఫలించడం లేదట. అందుకనే అనుష్క ఎక్కడకి రావడం లేదని తెలిసింది. ఈమధ్య అనుష్క ఘాటీ అనే సినిమాలో నటించింది. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో కూడా స్వీటీ క‌నిపించ‌డ‌బోవ‌డం లేద‌ని తెలుస్తోంది. అనుష్క లేకుండానే ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ని క్రిష్ అండ్ కో ప్లాన్ చేసింద‌ని స‌మాచారం అందుతోంది. ఆమె షూటింగ్ కి వచ్చినా సెట్ లో చాలా తక్కువ మందే ఉండాలనే కండీషన్ పెడుతుందట. ఆమె లావుగా ఉండడంతో సీజీలతో అనుష్కని సన్నగా ఉన్నట్టుగా చూపించడం కోసం చాలా కష్టపడాల్సి వస్తోందట. ఇంకా చెప్పాలంటే.. రెమ్యూనరేషన్ కన్నా.. ఈ సీజీల కోసమే నిర్మాతలు ఎక్కవ ఖర్చుపెడుతున్నారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ కారణం వలన బాహుబలి రీ యూనిన్ కు కూడా రాలేదట. మరి.. స్వీటీ ఎప్పుడు స్లిమ్ అవుతుందో ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. Anushka Missing in Bahubali Reunion.

Also Read: https://www.mega9tv.com/cinema/thandel-which-collected-100-crores-on-the-silver-screen-and-chaitanya-who-created-a-sensation-with-thandels-trp-rating/