
Balakrishna’s Aditya 999: నందమూరి బాలక్రిష్ణ స్పీడు మామూలుగా లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో రెండు సినిమాలు ఫైనల్ చేసేస్తున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్న బాలయ్య రెండు సినిమాలను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశారు. అయితే.. బాలయ్య త్రిబుల్ రోల్ చేయబోతున్నారనే వార్త లీకైంది. ఇంతకీ.. ఏ సినిమాలో చేయబోతున్నాడు..? దర్శకుడు ఎవరు..? ఈ మూవీ ఎలా ఉండబోతుంది..?
బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ సీక్వెల్ అఖండ 2 కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు ఒకదానిని మించి మరోటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టరే అనే ఫీలింగ్ అందరిలో కలిగించారు. దీంతో ఇప్పుడు అఖండ 2 కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈ మూవీ తర్వాత చేసే సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మలినేని గోపీచంద్ తో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయని సమాచారం. ఇందులో బాలయ్య ఇంత వరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య.. క్రిష్ తో సినిమా చేయనున్నారు. ఇది ఆదిత్య 369 మూవీకి సీక్వెల్ అని.. ఆదిత్య 999 అని సమాచారం. ఈ మూవీని బాలయ్యే తెరకెక్కించాలి అనుకున్నప్పటికీ.. ఆ బాధ్యతలను క్రిష్ కు అప్పగించారని తెలిసింది. Balakrishna’s Aditya 999.
అయితే.. ఇందులో బాలయ్య ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఇందులో బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ కూడా నటిస్తున్నాడని తెలిసింది. డిసెంబర్ లో ఈ మూవీని పట్టాలెక్కించనున్నారు. ఆదిత్య 369లో భూత, భవిష్యత్, వర్తమానాల్ని చూపించారు సింగీతం శ్రీనివాసరావు. ఈసారి.. క్రిష్ వాటితో పాటుగా కొత్త లోకాల్ని ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం. మరి.. బాలయ్యతో క్రిష్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.