
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9కు సర్వం సిద్ధం అయ్యింది. గత సీజన్స్‌తో పోల్చితే ఈసారి మరింత వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈసారి సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 మొదలుకానుంది. ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9తో రెడీ అవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా బిగ్ బాస్ సీజన్ 9ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. అయితే ఈసారి సెలబ్రటీలతో సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. అయితే సామాన్యులను సెలక్ట్ చేయడానికి అగ్నిపరీక్షను మొదలు పెట్టారు. ఈ అగ్నిపరీక్ష కోసం ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ ను రంగంలోకి దింపారు. గత సీజన్స్ లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్నవారిని తీసుకొచ్చారు. సీజన్ 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి.. బిగ్‌బాస్ ఫస్ట్ సీజన్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ జడ్జిలుగా ఉండనున్నారు.
అలాగే ఈ అగ్నిపరీక్షకు హోస్ట్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది. తాజాగా విడుదల చేసిన ప్రేమో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కామన్ మ్యాన్ ఎంట్రీకి ఇప్పటికే వేలల్లో అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో 40మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్షద్వారా వారిలో 15మందిని సెలక్ట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్లనున్న 15మందిలో కొంతమంది పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ 15మందిలో ఇప్పుడు ఓ ముగ్గురు పేర్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అనూష రత్నం.. ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్. నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుందని తెలుస్తుంది. ఈ చిన్నదానితో పాటు మరో సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్ కూడా బిగ్ బాస్ లో సందడి చేయనుందని తెలుస్తుంది. దమ్ము శ్రీజ.. ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు కూడా తన ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది. వీరితో పాటు మిస్ తెలంగాణ రన్నరప్ గా నిలిచిన కల్కి. ఈ భామ అందానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ముగ్గురు భామలు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తుంది.
తాజాగా అగ్నిపరీక్ష అనే కాన్సెప్ట్ దుమారం రేపుతుంది. ఈ సారి హౌజ్‌లోకి కామనర్స్(సామాన్య ప్రజలు) రాబోతున్న విషయం తెలిసిందే. సుమారు ఐదు మంది కామన్ మ్యాన్లు బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నారు. వారిని ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతుంది. ఆ మధ్య కామన్ మ్యాన్ కూడా బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్‌గా వచ్చే అవకాశాన్ని కల్పిస్తూ బిగ్ బాస్ నిర్వాహకులు ఆన్‌లైన్ అప్లికేషన్స్ పెట్టారు. దీనికి విశేష స్పందన లభించింది. కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయి. వారిలో క్రమ క్రమంగా ఫిల్టర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అంతిమంగా 15 మందిని ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురుని ఫైనల్ చేస్తారు. వారే బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి కంటెస్టెంట్లుగా అడుగుపెడతారు.
అయితే ఈ 15 మంది ఎవరనే లిస్ట్ లీక్ అయ్యింది. . వారు ఎవరనేది చూస్తే,1 కంటెస్ట్ అనుషా రత్నం- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, 2 దివ్యా నిఖితా- వెజ్ ఫ్రైడ్ రైస్ మోమో గా ఫేమస్., 3. శ్రియా- ఎంపికైన వారిలో చిన్న వయసు ఉన్న అమ్మాయి., 4.స్వేతా శెట్టి- ఈమె యూకే నుంచి ఈ షో కోసం వచ్చారు. మంచి జిమ్ బాడీ బిల్డర్. 5.డెమాన్ పవన్- ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్., 6.ప్రసన్న కుమార్- యూనిక్ కంటెస్టెంట్. ఒక లెగ్ ఉండదు. 7.దమ్ము శ్రీజా- ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్. 8.మిస్ తెలంగాణ కల్కీ- మిస్ తెలంగాణలో రెండో స్థానం, 9.దాలియా- జిమ్ కోచ్, 10.ప్రియా శెట్టి, కామనర్., 11.మర్యాద మనిష్- బిజినెస్ మేన్, 12. మాస్క్ మెన్ హృదయ్-కామనర్, 13.పవన్ కళ్యాణ్- ఆర్మీ పర్సన్., 14.లాయర్ ప్రశాంత్, 15.షాకీబ్- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్
ఈ 15 మంది కంటెస్టెంట్లని అగ్నిపరీక్ష టాస్క్ కి పంపిస్తున్నారు. ఇందులో కఠినమైన టాస్క్ లు ఇవ్వబోతున్నారు. కాన్ఫిడెన్స్, క్లిష్టసమయంలో పరిస్థితులను డీల్ చేయడం, అనేక రకాల సవాళ్లు, మానసిక ఒత్తిడితో కూడిన టాస్క్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఎంపిక ప్రక్రియలో డ్రామా, భావోద్వేగాలు, ఉత్కంఠ అన్నీ కలగలిపి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాదు దీన్ని హాట్ స్టార్‌లో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. వీరిలోనుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎంపిక కాబోతున్నారు. వారే హౌజ్‌లోకి వస్తారు. Bigg Boss 9.
మొత్తానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ లో రచ్చ వేరే లెవల్ అని అర్థమవుతుంది. ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ సారి అరాచకమే అని హోస్ట్ నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రెండు హౌజ్‌లు ఉంటాయని, బిగ్ బాస్ కూడా మారుతున్నట్టు తెలిపారు నాగ్. మరి ఆ మార్పేంటనేది చూడాలి.