
Balayya & Koratala Siva: నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ జోరులో దూసుకెళ్తున్నాడు. ‘అఖండ’ సినిమాతో ఆయనకు తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. అప్పటిదాకా బాలయ్య సినిమాలకు దూరంగా ఉన్న దర్శకులు ఇప్పుడు ఆయనతో సినిమా తీయాలని బారులు తీరుతున్నారు. ‘అఖండ’ తర్వాత ‘వీరసింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘ఢాకు మహరాజ్’ సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో బాలయ్య మరింత జోష్‌లోకి వచ్చారు. తాజాగా ‘అఖండ 2’ను కూడా ప్లాన్ చేస్తున్న బాలకృష్ణ, ఇప్పటికే ఓ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంచగా, మరో రెండు ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పుడు తాజా సమాచారం మేరకు కొరటాల శివతో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది.
ఇక కొరటాల శివ దర్శకత్వంలో గతేడాది విడుదలైన ‘దేవర’ మొదటి భాగం మంచి హిట్ సాధించింది. కానీ రెండో భాగం ఇప్పటివరకు సెట్స్ మీదకెళ్లలేదు. దానికి కారణం హీరో ఎన్టీఆర్ వివిధ సినిమాలతో బిజీగా ఉండడమే. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాతో బిజీగా ఉన్నాడు. అనంతరం త్రివిక్రమ్, నెల్సన్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు. ఈ కారణంగా ‘దేవర పార్ట్ 2’ ప్రారంభం ఎప్పుడవుతుందన్నది ఇంకా క్లారిటీ లేదు. దీంతో కొరటాల శివ కూడా తాత్కాలికంగా ‘దేవర 2’ ప్రాజెక్ట్‌ను పక్కనబెట్టి కొత్త కథలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
కొద్ది రోజులుగా కొరటాల శివ అక్కినేని నాగ చైతన్యను కథానాయకుడిగా తీసుకుని ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని టాక్. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా కొరటాల శివ, నందమూరి బాలకృష్ణ కోసం ఓ పవర్‌ఫుల్ మాస్ కథను తయారుచేస్తున్నాడట. ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’, ‘దేవర’లాంటి హిట్స్ ఇచ్చిన శివ, ఇప్పుడు బాబాయ్‌కి కూడా అలాంటి బ్లాక్‌బస్టర్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. Balayya & Koratala Siva.
కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ – ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ – మంచి విజయాలు సాధించాయి. ‘ఆచార్య’ మాత్రమే కొంత వెనకబడినా, దానికి కారణం చిరంజీవి స్క్రిప్ట్‌లో జోక్యం చేసుకోవడమేనని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొరటాల కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు. అయితే బాలయ్య విషయంలో అలా జోక్యం చేసుకునే అవసరం లేకుండా, డైరెక్టర్ చెప్పినట్లు ఆయన నడుచుకుంటారని ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో, కొరటాల తన స్టైల్‌కు తగ్గట్టు ఫుల్ ఫ్రీడమ్‌తో సినిమా రూపొందించే అవకాశముంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.