విశ్వంభర, పెద్ది.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చేసిందోచ్!

Vishwambhara & Peddi Updates: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. ఈ భారీ సోషియో ఫాంటసీ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటిస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్. ఈ భారీ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ.. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ను మేకర్స్ ఇవ్వడం లేదు. అయితే.. ఇప్పుడు విశ్వంభర, పెద్ది సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. అదేంటో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సంక్రాంతికి రావాలి కానీ.. కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. ఈ సినిమాకి ఓ సాంగ్ బ్యాలెన్స్ ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాట షూటింగ్ పూర్తి చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మరి.. విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అంటే.. సెప్టెంబర్ లో ఉంటుందని కొంత మంది అంటుంటే.. డిసెంబర్ లో ఉండచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ మాత్రం అంతా పూర్తైన తర్వాత అవుట్ ఫుట్ చూసుకుని అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. అయితే… అక్టోబర్ లో విశ్వంభర విడుదల ఉండచ్చు అని చెప్పారు.

అయితే.. విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత క్వాలిటీ సరిగా లేదనే విమర్శలు వచ్చాయి. అందుకనే మరింత కేర్ తీసుకుని.. అదిరిపోయే క్వాలిటీ అందించాలని మేకర్స్ చాలా కష్టపడుతున్నారు.. చాలా ఖర్చు పెడుతున్నారు. ఆడియన్స్ సినిమా చూసి విజువల్ వండర్ అనడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. యు.వీ క్రియేషన్స్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందించారు. బింబిసార తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ రావడంతో డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. Vishwambhara & Peddi Updates.

ఇక పెద్ది విషయానికి వస్తే.. ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న పెద్ది సినిమా నుంచి ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. వినాయక చవితి నుంచి పెద్ది ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని సమాచారం. దీనికి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందించారు. చరణ్‌ కు జంటగా జాన్వీ కపూర్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతోన్న ఈ పెద్ది సినిమాను మార్చి 27న విడుదల చేయనున్నారు. మరి.. చిరు విశ్వంభర, చరణ్‌ పెద్ది సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/rajinikanths-latest-movie-coolie-nagarjuna-plays-the-villain-in-the-movie-this-is-the-story-of-the-big-crazy-movie-coolie/