కూలీ, వార్ 2.. రన్ టైమ్స్ ఎంత..? విజేతగా నిలిచేది ఎవరు..?

Coolie and War 2 run times: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటించడం విశేషం. ఇక సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన చిత్రం వార్ 2. ఈ సినిమా కూడా ఆగష్టు 14న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఒకే రోజున క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ.. ఈ రెండు సినిమాల రన్ టైమ్స్ ఎంత..? ఏ సినిమాకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కూలీలో నాగ్ విలన్ గా నటిస్తుంటే.. కన్నడ స్టార్ ఉపేంద్ర ముఖ్య పాత్ర పోషించడం.. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ గెస్ట్ రో ల్ కనిపించడం విశేషం. లోకేష్‌ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమా పై మరింతగా బజ్ క్రియేట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో.. భారీ కాస్టింగ్ తో ఉన్న ఈ సినిమాను లోకేష్‌ కనకరాజ్ చాలా స్పీడుగా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేయడం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని ఏమాత్రం రాజీపడకుండా నిర్మించింది. ఇక రన్ టైమ్ విషయానికి వస్తే.. 2 గంటల 50 నిమిషాలని సమాచారం.

వార్ 2 విషయానికి వస్తే.. ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పై చిత్రీకరించిన సాంగ్ లో డ్యాన్స్ వావ్ అనిపించేలా ఉంటుందని.. సినిమాకి ఇది హైలెట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ రన్ టైమ్ గురించి చెప్పాలంటే.. హిందీ వెర్సెన్ 2 గంటల 53 నిమిషాలు అని.. తెలుగు, తమిళ్ వెర్షెన్ 2 గంటల 51 నిమిషాలు అని తెలిసింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఏర్పడింది. అందుకనే దేవర సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర 500 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. Coolie and War 2 run times.

ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువుగా విజయావకాశాలు ఉన్నాయంటే.. కూలీ సినిమా ప్రమోషన్స్ లో దూసుకెళుతుంది. అందులో నాగార్జున విలన్ గా నటించడం అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది. దీనికి భారీగా బజ్ క్రియేట్ అయ్యింది. వార్ 2 సినిమా ప్రమోషన్స్ లో వెనకబడింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. అయితే.. ఇది బాలీవుడ్ మూవీ. అందుచేత తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఉంటుందా..? ఆడియన్స్ ని మెప్పిస్తుందా..? అనే డౌట్ ఉంది. ఇప్పటి వరకు అయితే.. కూలీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. వార్ 2 ని తక్కువ అంచనా వేయలేం. ఏది ఏమైనా ఇక్కడ పాజిటివ్ టాక్ రావడం ఇంపార్టెంట్. మరి.. ఏ సినిమాకి టాక్ వస్తుందో.. ఏ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/does-vijay-devarakonda-ties-up-with-harish-shankar-for-a-movie-under-sithara-entertainments/