
Deepika Shahrukh 6th Movie: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా రెండు పాన్ ఇండియా సినిమాల నుంచి ఆమె ఎగ్జిట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇక లేటెస్ట్ గా ఆమె చేసిన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలుస్తోంది. కల్కీ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తొలగించడంపై రకరకాల వర్తలు వస్తున్న నేపథ్యంలో చేసిన పోస్ట్ తో అందరి అటెన్షన్ ఆమెపై పడింది. దీపికా.. బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ తో కలిసి ఆరో సినిమా సైన్ చేయడం చాలా హ్యాపీగా ఉందని చెబుతూనే …ఈ సందర్భంగా షారుక్ తనకు నేర్పిన పాఠం గురించి ప్రస్తావించింది. అయితే దీపికా ఈ పోస్ట్ తో ఇండైరెక్ట్ గా కల్కి 2 గురించే మాట్లాడిందని సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు.ఇంతకీ దీపికా తన పోస్ట్ లో ఏం చెప్పింది. షారుఖ్ ఆమెకు నేర్పని పాఠం ఏంటి? కల్కీలో దీపిక ప్లేస్ ను ఎవరు ఫిల్ చేయబోతున్నారు. లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో…
నటి దీపికా పదుకొణె ఈ ఏడాది రెండు పాన్ ఇండియా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. వాటిల్లో ఒకటి సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ కాగా..రెండోది నాగ్ అశ్విన్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్. అయితే కల్కీ నుంచి ఈ భామ మేకర్సే తప్పించారు. కల్కీ సీక్వెల్ లో దీపిక భాగం కావడం లేదంటూ వైజయంతి మూవీస్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది. కల్కీ ఫస్ట్ పార్ట్ లో ఆమెతో చాలా ప్రయాణం జరిగినప్పటికీ, మళ్ళీ తనతో కలిసి పనిచేసే అవకాశం ఈసారి కనిపించలేదు. అలాంటి భారీ ప్రాజెక్ట్‌కి పూర్తి నిబద్ధత అవసరం..దీపికా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట అంటూ ఓ నోట్ విడుదల చేశారు. దీంతో ఈ బ్యూటీపై సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఆమెపై గత రెండు రోజులుగా నెట్టింట్లో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి..ఈ క్రమంలో తన కొత్త ప్రాజెక్ట్ గురించి ఓ పోస్ట్ షేర్ చేసింది దీపికా.
దీపికా పదుకొణె, షారుక్ ఖాన్ కాంబో సూపర్ డూపర్ హిట్ అని ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆరోసారి జంటగా మరో సినిమా చేయబోతున్నారు.సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తోన్న కింగ్ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని దీపికా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది. 18 సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్ నాకు మొదటి పాఠం నేర్పారు. ఒక సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం.. ఎవరితో కలిసి పనిచేస్తున్నామనే విషయాలే ఉన్నాయి. ఒక సినిమా విజయం కంటే ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఆ మాటలనే ఇప్పటికీ నమ్ముతాను. ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాను…అందుకే మేము మళ్ళీ కలిసి 6వ సినిమా చేస్తున్నాము అంటూ తెలపింది. కల్కి సినిమా నుంచి దీపికను తప్పించిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. తన పోస్ట్ తో కల్కీకి దీపిక కౌంటర్ ఇచ్చిందటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
దక్షిణాది దర్శకుకు దీపిక వర్క్ కల్చర్ నచ్చడం లేదు. మొన్నామధ్య స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికా మీద సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ , ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న స్పిరిట్ లో ముందుగా దీపికనే హీరోయిన్ అనుకున్నారు. అయితే కొన్ని కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని సెలెక్ట్ చేశారు. ఇక ఒక బిడ్డకు తల్లి అయిన దీపికా రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ పారితోషికం కూడా అడగడంతో సందీప్ వంగానే దీపికను తప్పించడని తెలుస్తుంది. అలాగే స్పిరిట్ మూవీ స్టోరీని దీపికా పీఆర్ టీమ్ కి లీక్ చేసిందనే వార్తలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీని పై కూడా సందీప్ చాలా ఫైర్ అయ్యాడు. ఇక ఇప్పుడు కల్కి సీక్వెల్ నుంచి కూడా దీపికను తప్పించారు. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తాననడంలాంటి కమిట్మెంట్స్ తన సినిమాకు సెట్ అవ్వవని మేకర్స్ తెలిపారు. అంతే కాదు దీపికాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు నాగ్ అశ్విన్. సోషల్ మీడియాలో కల్కి ఫస్ట్ పార్ట్ లో కృష్ణుడి ఎంట్రీ సీన్ ను నాగ్ అశ్విన్ షేర్ చేస్తూ..కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే అనే డైలాగ్ షేర్ చేశారు. దీనికి కౌంటర్ గానే దీపికా లేటెస్ట్ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. Deepika Shahrukh 6th Movie.

ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికా ప్లేస్ లో కల్కీలో ఎవరు నటిస్తారన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. దీపికా ప్లేస్ లో పూజా హెగ్డే నటిస్తుందని కొందరంటుంటే.. మారికొందరు ఆమె ప్లేస్ ను అనుష్క శెట్టి రీప్లేస్ చేస్తుందంటున్నారు. ఇంకొందరు కల్కి సినిమాలో దీపికా పదుకొణె అయితేనే సెట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కల్కిలో ఆమె క్యారెక్టర్ లో మరో హీరోయిన్ నటించే ఛాన్స్ లేదాని ఆమె పాత్రను ఫస్ట్ పార్ట్ తోనే ముగిస్తారని అంటున్నారు. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి, దీపికా ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె చేసే పోస్టులు, సినిమా సెలక్షన్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.