
Deepika Padukone out From Kalki 2: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇకపై ‘కల్కి 2898 ఏ.డి.’ సీక్వెల్లో భాగం కాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. గతంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాలో కూడా దీపికాను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆమె స్థానంలో మరో హీరోయిన్ను ఎంపిక చేయడంతో అప్పట్లోనూ ఇలాంటి నిరాశే ఎదురైంది. ఇప్పుడు ‘కల్కి 2’ విషయంలోనూ అదే పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశమైంది.
ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘‘జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మేం ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగం కోసం ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో పార్ట్‌లో భాగస్వామి కాలేకపోయింది. గొప్ప టీమ్‌తో కల్కి సీక్వెల్ మీ ముందుకు వస్తుంది. భవిష్యత్తులో దీపిక మంచి సినిమాలతో అలరించాలని కోరుకుంటున్నాం’’ అని వైజయంతీ మూవీస్ పోస్ట్ పెట్టింది. నిర్మాణ సంస్థ ప్రకటనతో అభిమానులు షాక్ అవుతున్నారు. కల్కి సీక్వెల్లో పని గంటల గురించి, పారితోషికం గురించి దీపికా పదుకొణె డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వైజయంతీ మూవీస్ వారు అందుకు నో చెప్పినట్లు సమాచారం. వారి మధ్య ఢీల్ సెట్ కాకపోవడంతో దీపికా పదుకొణెను తప్పించారని తెలుస్తోంది. Deepika Padukone out From Kalki 2.
గత కొన్ని రోజులుగా దీపికా పేరు నిత్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ భారీ అప్‌కమింగ్ సినిమా నుంచి ఆమె వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించగా దీపికా పదుకొణె సుమతి పాత్రలో అద్భుతమైన నటనతో సినిమాకే హైలైట్‌గా నిలిచారు. ఇప్పుడు దీని సీక్వెల్లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్నదే హాట్ టాపిక్‌గా మారింది.