
Deepika Padukone: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోణె తాజాగా వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ‘కల్కి: 2898 ఈ.డి – పార్ట్ 2’ చిత్ర బృందం నుంచి ఆమె తప్పించబడడం, అంతకు ముందు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ నుంచి పక్కకు పెట్టడం వంటి సంఘటనలతో ఆమె కెరీర్ పరంగా కొంత చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు మరో వివాదం దీపికా చుట్టూ ముడిపడింది. ఈసారి ఆమె గతంలో కలిసి పనిచేసిన ప్రముఖ దర్శకురాలు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సంగతి వెలుగులోకి వచ్చింది.
గతంలో ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో ఫరాఖాన్ – దీపికాల మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే ఇటీవల ఫరాఖాన్ ఓ టాక్ షోలో మాట్లాడుతూ, “దీపికా ఇప్పుడు రోజుకు 8 గంటలే పని చేస్తానంటుంది కాబట్టి, ఇలాంటివి చేయడానికి ఆమెకు టైం ఎలా దొరకుతుంది?” అని వ్యాఖ్యానించింది. మొదట ఇదంతా సరదా కోణంలో అనిపించినా, దీపికా మాత్రం ఆ కామెంట్‌ను సీరియస్‌గా తీసుకుందట. వెంటనే ఆమె ఫరాఖాన్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసింది. దానికి ప్రతిస్పందనగా ఫరా కూడా దీపికాతో పాటు రణవీర్ సింగ్‌ను కూడా అన్‌ఫాలో చేసింది. దీంతో ఈ విషయంలో వారి మధ్య స్నేహం బీటలు వారిందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ వివాదానికి ముందే, దీపికా పనితీరు, వర్క్ కండీషన్స్ గురించి పలువురు ఫిల్మ్‌మేకర్లు అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలైంది. ‘స్పిరిట్’ సినిమా కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెతో చర్చలు జరిపినప్పటికీ, ఆమె పెట్టిన షరతులు అతనికి నచ్చకపోవడంతో చిత్రబృందం వెనక్కి తగ్గిందని టాక్. దీపికా తన టీమ్ కోసం లగ్జరీ హోటల్స్‌లో ఉండటం, ప్రత్యేక ఆహార ఏర్పాట్లు, 8 గంటలు మించి పని చేయలేనని చెప్పడమే కాకుండా, భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే ప్రధాన కారణమని వదంతులు వినిపించాయి.అంతేకాదు, కల్కి టీమ్ కూడా పార్ట్ 2లో ఆమె పాత్ర ఉండదని స్పష్టం చేయడంతో దీపికా వరుసగా రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌ను కోల్పోయింది.
ఇప్పటికే “8 గంటల పని” అనేది పరిశ్రమలో వేడి చర్చనీయాంశంగా మారింది. కొందరు దీపికా నిర్ణయాన్ని ప్రొఫెషనల్‌గా చూస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నప్పటికీ, మరికొందరు మాత్రం ఆమె ప్రవర్తనను తప్పుబడుతున్నారు. కొంతమంది ఆమెపై సెటైరికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఫరాఖాన్ వ్యాఖ్యలు కూడా ఇదే నేపథ్యంలోనే వచ్చి, చివరకు ఒకప్పటి స్నేహితుల మధ్య దూరాన్ని పెంచాయి. Deepika Padukone.
ఒకప్పుడు మంచి కెమిస్ట్రీ కలిగిన ఈ ఇద్దరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విడిపోయారు. ఇది తాత్కాలిక విరామమా? లేక శాశ్వతంగా వారి బంధానికి తెరపడిందా అన్నది చూడాలి. బాలీవుడ్ వర్గాల్లో అయితే ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్‌లో వీరిద్దరు మళ్లీ కలిసి పని చేసే అవకాశాలున్నాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.