చిరు – బాలయ్య మల్టీస్టారర్ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే..?

Chiru Balayya Combo Movie: మెగాస్టార్‌ చిరంజీవి 70వ పుట్టినరోజున ఫ్యాన్స్ కి రెండో సర్ప్రైజ్ కూడా ఇచ్చేశారు. బుధవారం విశ్వంభర గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇవాళ అనిల్ రావిపూడి- చిరు కాంబోలో వస్తోన్న సినిమా బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. మెగా 157 టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్ గారు అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గ్లింప్స్‌ కూడా విడుదల చేశారు.ఈ ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాబోయే రోజుల్లో మెగాస్టార్- బాలయ్యతో కలిసి సినిమా చేస్తారా అని? మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి అనిల్ రావిపూడి స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇద్దరూ కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ రెండు స్టార్ హీరోల మధ్య కలయిక చాలా అరుదు. వారిని కలిసి తెరపై చూడాల అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, సరైన కథ రాకపోవడంతో వీరి కాంబోలో మల్టీస్టారర్ అనేది సాకారం కాలేదు. అయితే ఇప్పటి టాలీవుడ్ ట్రెండ్ చూస్తే మల్టీస్టారర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరోలతో పాటూ సీనియర్ హీరోలు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.

ఈ క్రమంలోనే చిరు – బాలయ్య కాంబో మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.తాజాగా చిరు – బాలయ్య మల్టీస్టారర్ పై అనిల్ రావిపూడి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.’ .’ వెంకటేశ్, చిరంజీవితో మన ప్రయాణం మొదలైంది.. బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో చిరంజీవిగారే మైకులో చెప్పారు. ఇద్దరు కూడా ఎవరికీ వారు డిఫరెంట్‌ ఇమేజ్‌ ఉన్న హీరోలు.. వారికి తగిన కథ సెట్‌ అయితే తప్పకుండా చేస్తాను. అలాంటి కథ కుదిరితే ఎవరు చేసినా బాగుంటుంది’ అని అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ వ్యాఖ్యల ప్రకారం చూస్తే, చిరు-బాలయ్య మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ భవిష్యత్తులో పట్టాలెక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Also Read: https://www.mega9tv.com/cinema/megastars-birthday-celebrations-in-goa-ram-charan-shares-video/