పాన్ ఇండియా స్టార్ తో శంకర్ సినిమా..?

Director Shankar New Movie: గ్రేట్ డైరెక్టర్ శంకర్.. ఒకప్పుడు వరుసగా సంచలన చిత్రాలు అందించాడు కానీ.. ఇప్పుడు వరుసగా డిజాస్టర్స్ అందిస్తున్నాడు. శంకర్ తో సినిమా అంటే.. అయ్య బాబోయ్ అంటూ భయపడే పరిస్థితి ఏర్పడింది. ముందు చెప్పిన బడ్జెట్ కి.. తర్వాత అయిన బడ్జెట్ కి అసలు పొంతన ఉండదు. అందుకనే శంకర్ తో ఇప్పుడు ఎవరూ సినిమా చేయాలి అనుకోవడం లేదు. అయితే.. శంకర్ తన నెక్ట్స్ మూవీని అనౌన్స్ చేశారు. దీంతో శంకర్ తో సినిమా చేసే ధైర్యం చేసిన ఆ ప్రొడ్యూసర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకీ.. ఆ డేరింగ్ ప్రొడ్యూసర్ ఎవరు..? ఇందులో నటించే స్టార్ ఎవరు..? అసలు శంకర్ ప్లాన్ ఏంటి..?

రోబో తర్వాత శంకర్ వేల్పారి అనే నవల ఆధారంగా ఓ భారీ చిత్రం చేయాలనేది తన డ్రీమ్ అని ప్రకటించారు. ఇందులో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సినిమాని 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలి అనుకుంటున్నారట. ఈ విషయం చెప్పినప్పటి నుంచి వరుస డిజాస్టర్స్ లో ఉన్న శంకర్ తో 1000 కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాత ఎవరు అనేది హాట్ టాపిక్ అయ్యింది. శంకర్ మాత్రం కొత్త సినిమాను ప్రకటించారు కానీ.. నిర్మాత ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. అయితే.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ శంకర్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారని టాక్ వినిపిస్తోంది.

ఇక ఇందులో నటించే హీరో ఎవరంటే.. ఇది కూడా శంకర్ అనౌన్స్ చేయలేదు కానీ.. పాన్ ఇండియా స్టార్ యశ్ పేరు వినిపిస్తోంది. యశ్.. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ మేకర్స్ సైతం యశ్ తో సినిమా చేయాలని తపిస్తున్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత చాలా కథలు విని ఫైనల్ గా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అలాగే బాలీవుడ్ లో రూపొందుతోన్న రామాయణం మూవీలో రావణుడుగా నటిస్తున్నాడు యశ్. Director Shankar New Movie.

ఇప్పుడు శంకర్ తెరకెక్కించే డ్రీమ్ ప్రాజెక్టులో నటించేందుకు ఓకే చెప్పాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ సినిమాని బాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మిస్తాడా..? లేక వేరే ప్రొడ్యూసర్ నిర్మిస్తాడా అనేది తెలియాల్సివుంది. అయితే.. శంకర్ పై ఎవరికీ నమ్మకాలు లేకపోవడంతో శంకరే స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. శంకర్ నిర్మించి సక్సెస్ సాధిస్తే.. మళ్లీ శంకర్ పై అందరికీ నమ్మకం పెరుగుతుంది. మరి.. శంకర్ తనే నిర్మిస్తారో..? లేక ఏ ప్రొడ్యూసర్ ని అయినా ఒప్పిస్తారో చూడాలి.

Also Read: https://www.mega9tv.com/cinema/akhanda-2-og-movies-to-release-on-september-25-vishwambhara-to-release-on-september-18/