
Global Star Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్ సినిమాల కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. అందుకనే.. ఈ నుంచి అంత టైమ్ తీసుకోకూడదని చరణ్ డిసైడ్ అయ్యాడట. అందుకనే.. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. తర్వాత చేయబోయే సినిమాల పై ఓ నిర్ణయానికి వచ్చేసారని తెలిసింది. ఇంకా చెప్పాలంటే.. రామ్ చరణ్ స్పీడు పెంచడం కోసం ప్లాన్ మార్చారని తెలిసింది. ఇప్పుడు చరణ్ లైనప్ లో ఉన్న సినిమాలు చూసి పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ.. చరణ్ ప్లాన్ ఏంటి..? ఏ క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు..?
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. సంచలన విజయం సాధించాడు చరణ్. ఆతర్వాత చేసే సినిమాలతో మరింత పెద్ద విజయం సాధించాలని తపించాడు కానీ.. గేమ్ ఛేంజర్ రూపంలో నిరాశ తప్పలేదు. ఆర్ఆర్ఆర్, గేమ్ ఛేంజర్.. ఈ రెండు సినిమాల కోసం ఐదేళ్లుకు పైగా టైమ్ తీసుకున్నాడు. అందుకనే చరణ్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. అందుకనే ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేదుకు పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. Global Star Ram Charan.
పెద్ది తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన చరణ్.. ఇప్పుడు అంతకంటే ముందుగా మరో భారీ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. చరణ్ మూవీ ఎవరితో అంటే ఈమధ్య బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నగేష్ పేరు వినిపించేంది. ఇప్పుడు ఊహించని విధంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు తెర పైకి వచ్చింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్.. నెక్ట్స్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది. చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా నేషనల్ లెవల్లో సత్తా చాటేలా కథ రెడీ చేశారట నీల్.
చరణ్ తో సినిమా చేసేందుకు నీల్ మాత్రమే కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఇద్దరితో చరణ్ సినిమాలు ఖచ్చితంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే.. త్రివిక్రమ్ రెండు ప్రాజెక్టులతో లాక్ అయ్యారు. అలాగే సందీప్ రెడ్డి వంగ.. స్పిరిట్, యానిమల్ పార్క్ చిత్రాలతో లాక్ అయ్యాడు. ఈ ఇద్దరి దర్శకులు వాళ్ల కమిట్మెంట్ అయిన తర్వాత చరణ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తారనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇలా క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెట్టడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.