
Prabhas Marriage Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి గత కొంతకాలంగా మీడియాలో వార్తలు రావడం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రెబల్ స్టార్ కృష్ణంరాజు చాలా సార్లు చెప్పారు. అయితే.. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి..ఇలా చాలా సినిమాలు చేసాడు కానీ.. పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ పెళ్లి అనేది వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి వార్త వైరల్ అవ్వడానికి కారణం ఏంటి..? ఇంతకీ.. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు..?
ప్రభాస్ ని పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే.. ప్రభాస్ మత్రం సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు కానీ.. ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే.. ఇప్పుడు పెళ్లికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. అసలు ఈ వార్త ఇప్పుడు తెర పైకి రావడానికి కారణం ఏంటంటే.. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ద్రాక్షారామం వెళ్లి అక్కడ ఉన్న టెంపుల్లో ప్రభాస్ గురించి ప్రత్యేకించి పూజలు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి త్వరలోనే ఉంటుందని.. అందుకనే ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నట్టుగా తెలియచేశారు.
ఇక అక్కడ నుంచి ప్రభాస్ ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు..? పెళ్లి ఎప్పుడు..? అనేది హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ పెద్దమ్మ పెళ్లి కూతురు గురించి ఎలాంటి సమాచారం బయటపెట్టలేదు. అయితే.. ఆమధ్య బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు వెళ్లిన ప్రభాస్, చరణ్ మధ్య జరిగిన సంభాషణలో పెళ్లి ప్రస్తావన రావడం.. ఆమె వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిగా చరణ్ బయటపెట్టడం జరిగింది. దీనిని బట్టి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయితోనే ప్రభాస్ పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో కూడా ప్రచారం ఊపందుకుంది. Prabhas Marriage Update.
మరి.. పెళ్లి ఎప్పుడు అంటే.. క్లారిటీ లేదు కానీ.. ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో తప్పకుండా ఉండచ్చు అనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమాని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సెప్టెంబర్ నెలాఖరున ఈ మూవీ స్టార్ట్ చేయనున్నాడు. ఈ లెక్కన నెక్ట్స్ ఇయర్ లో ప్రభాస్ పెళ్లి ఉంటుందేమో అనిపిస్తుంది. మరి.. ప్రభాస్ త్వరలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read: https://www.mega9tv.com/cinema/director-bobby-decided-to-do-a-film-with-mega-trio/